అల్ కాఫీ గ్రంథ వివరణ

ఆది, 01/07/2018 - 12:40

.

అల్ కాఫీ గ్రంథ వివరణ

షైఖ్ కులైనీ[ర.అ]సాధారణ టాఫిక్ ను «కితాబ్» అని మరియు ప్రతీ «కితాబ్»లో ఆ టాపిక్‏కు సంబంధించిన అంశాలను పలు «బాబ్» రూపంలో రచించారు. వారు ఈ పూర్తి గ్రంథంలో ఇంచుమించు 16 వేల హదీసులను రావీయుల క్రమంతో సహా సంగ్రహించారు.
“ఉసూలే కాఫీ” అధ్యాయంలో ఉన్న మొత్తం «కితాబ్»ల వివరణ:
1. «కితాబుల్ అఖ్ల్ వల్ జెహ్ల్»
2. «కితాబొ ఫజ్లిల్ ఇల్మ్» ఇందులో 22 «బాబ్» లు ఉన్నాయి.
3. «కితాబ్ అల్ తౌహీద్» ఇందులో విశ్వాస పరమైన ముఖ్య అంశాలు కలిగి ఉన్న 40 «బాబ్» లు ఉన్నాయి.
4. «కితాబుల్ హుజ్జత్» ఇందులో ఇంచుమించు 130 «బాబ్» లు ఇమామత్ మరియు విలాయత్‏కు సంబంధించిన అంశాలను రచించి చివరిలో 20 «బాబ్« లలో పవిత్ర ఇమాముల చరిత్రను «అబ్వాబ్ అల్ తారీఖ్» టాపిక్ ద్వార సంగ్రహించారు.
5. «కితాబుల్ ఈమాన్ వల్ కుఫ్ర్» ఇందులో ఇంచుమించు 220 «బాబ్» లు ఈమాన్, సద్గుణం, ఆత్మపవిత్రత మరియు సంపూర్ణత్వాన్ని చేరే మార్గానికి సంబంధించిన వాటిని రచించారు.
6. «కితాబ్ అల్ దుఆ» ఇందులో ఇంచుమించు 60 «బాబ్» లు ఉన్నాయి.
7. «కితాబొ ఫజ్లిల్ ఖుర్ఆన్» ఇందులో 13 «బాబ్» లు ఉన్నాయి అందులో ఖుర్ఆన్ పఠన మరియు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.
8. «కితాబుల్ అషిరహ్(అల్ ముఆషిరహ్)» ఇందులో 30 «బాబ్» లు ఉన్నాయి ఇందులో మంచి జీవనానికి మరియు ముస్లిం సంఘాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.
“ఫురూయే కాఫీ” అధ్యాయంలో కూడా 26 «కితాబ్» లు ఉన్నాయి. ఇందులో ఉన్న «బాబ్» లు, అన్నీ ఇస్లామీయ ఫిఖా అహ్కాములకు చెందినవి.
“రౌజతుల్ కాఫీ” అధ్యాయంలో ఉపన్యాసాలు, చరిత్ర, మరియు వివిధ సందర్భాలలో ప్రవచించబడిన వివిధ హదీసులు ఉన్నాయి. ఇంచుమించు 600 హదీసులు ఈ అధ్యాయంలో ఉన్నాయి.
పూర్తి “అల్ కాఫీ” గ్రంథంలో 34 «కితాబ్» లు, 326 «బాబ్» లు ఉన్నాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35