ఇమామ్ అలీ(అ.స) సామాజిక నైతికం

ఆది, 03/28/2021 - 05:03

ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క జీవిత కోణాలలో అత్యంత అందమైన కోణం వారి సామాజిక జీవితం...

ఇమామ్ అలీ(అ.స) సామాజిక నైతికం

ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క జీవిత కోణాలలో అత్యంత అందమైన కోణం వారి సామాజిక జీవితం, వారు ప్రజలతో ఎలా ఉండేవారు అన్న విషయం. వారు ఇస్లాం యొక్క ఉపదేశాలను తన జీవితంలో చేసి చూపించారు. మన ప్రవర్తన మిత్రులతో ఎలా ఉండాలీ, శత్రువులతో ఎలా ఉండాలీ, ముసలివాళ్లతో ఎలా ఉండాలీ, పొరుగువారితో ఎలా ఉండాలీ మొ.. ఇక్కడ వారి ప్రవర్తనల గురించి సంక్షిప్తంగా మీకోసం వివరిస్తున్నాము.

1. ఇతర మతాలను విశ్వాసించేవారితో వారి ప్రవర్తన:
ఇమామ్ అలీ(అ.స) ఎవరైనా సరే వారిని గౌరవించేవారు. మరో విధంగా చెప్పాలంటే వారు మనవతావాది. వారి ప్రవర్తన ఒక యూధుడితో ఎలా ఉండేది అనే విషయాన్ని ఈ సంఘటన మనకు వివరిస్తుంది. ఒకరోజు ఒక యూధుడు గాడిద మీద గోదుమ బస్తాలను వేసుకొని షామ్ నుండి కూఫాకు బయలుదేరాడు, కాని కూఫా పట్టణానికి దగ్గరలో అతడు తన గాడిద మరియు గోదుమ బస్తాలను కనబడకుండా పోయాయి. ఎప్పుడైతే ఆ వ్యక్తికి సంభవించిన కష్టం గురించి ఇమామ అలీ(అ.స)కు తెలిసిందో వారు అవి దొరికేంత వరకు వెతికి ఆ రోజు రాత్రి అతనితో పాటు ఉండి రాత్రంత అతడికి రక్షణ కలిపించారు, వారు కేవలం ఉదయం ఫజ్ర్ నమాజ్ సమయంలో కొద్దిచేపు అతడిని విడిచి వెళ్లారు, ఆ తరువాత బజారుకు తీసుకొని వెళ్లి అక్కడ అతడు తీసుకొచ్చినవాటిని అమ్మకానికి పెట్టారు.[1] ఉల్లేఖించబడి ఉంది, ఆ వ్యక్తి ఇమామ్ అలీ(అ.స) యొక్క ఈ ప్రవర్తన మరియు సహాయరీతిని చూసి ఇస్లాంను స్వీకరించి ముస్లిముగా మారి వారి విలాయత్ పట్ల ఇలా సాక్ష్యాన్ని ప్రదర్శించాడు: “నేను సాక్ష్యమిస్తున్నాను నీవు ఇస్లామీయ ఉమ్మత్ యొక్క జ్ఞానివి, నీవు మానవుల మరియు జిన్నాతుల పై దైవప్రవక్త(స.అ) ఉత్తరాధికారివి” [2]

2. నిస్సహాయుల మరియు రోగుల వ్యవహారాల పట్ల వారి ప్రవర్తన:
ఇమామ్ అలీ(అ.స) యొక్క సామాజిక నైతికంలో ప్రముఖ రీతి; వారు నిస్సహాయుల మరియు రోగుల వ్యవహారాలను స్వయంగా చూసుకునేవారు. ఇమామ్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించెను: “అల్లాహ్ తన ధనాన్ని పేదవారికి తగిన విధంగా సహాయం చేయడాన్ని శ్రీమంతుల పై విధిగా నిర్దారించెను, ఎందుకంటే ఒకవేళ పేదవారు ఆకలితో ఉన్నారంటే లేదా వారు దుస్తులు లేకుండా ఉన్నారంటే వీటికి కారణం ఆ శ్రీమంతులే, అల్లాహ్ వారి నుండి లేక్క తీసుకుంటాడు మరియు తగిన శిక్ష వేస్తాడు”[3]
ఇలా ఉల్లేఖించబడి ఉంది; ఒకరోజు ఇమామ్ అలీ(అ.స) కళ్లులేని ఒక ముసలివాడిని అడ్డుక్కుంటూ ఉండగా చూశారు. అక్కడున్నవారితో ఇతనెవరు? అని ప్రశ్నించారు. వారు ఇతడొక క్రైస్తవుడు అని అన్నారు. అప్పుడు ఇమామ్ వారితో “అతడితో పనులు చేయించుకొని ఇప్పుడు ముసలివాడైయ్యాడని వదిలేస్తారా!” అని చెప్పి ఇతడికి బైతుల్ మాల్ నుండి సహాయం చేయమని ఆదేశించారు. 
మరో ఉల్లేఖనం ప్రకారం; సాసా ఇబ్నె సౌహాన్ అనారోగ్యంతో బాధ పడుతున్నారని ఇమామ్ అలీ(అ.స)కు తెలిసింది, వెంటనే వారిని పరమర్శించడానికి వెళ్లారు, వారితో కూర్చొని మాట్లాడారు, వారిని ఓదార్చారు, వారి సాధారణ జీవిన విధానాన్ని పొగుడ్తూ ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా ప్రజలలో సాధారణంగా జీవించిన మరియు మంచి కార్యములలో సహాయం చేసిన వ్యక్తిగా నాకు నీవు తప్ప మరొకరు తెలియదు”[4]

3. బంధువులతో మంచి, నైతిక సంబంధం:
ఇమామ్ అలీ(అ.స) తమ బంధువులతో చాలా ప్రేమగా ఉండేవారు. వారు వారి బంధువుల పట్ల బాధ్యతగా ఉండేవారు, బంధువుల పట్ల వారి ప్రవర్తన అహంభావంతో గానీ లేదా అసభ్యంగా గానీ ఉండేదికాదు. వారు బంధువులను విందుకు ఆహ్వానించేవారు, వారిలో ఎవరైనా అనారోగ్యానికి గురయితే వారిని పరామర్శించడానికి వెళ్లేవారు, అతిధుల చేతులను భోజనం తరువాత కడిగించేవారు, వారిలో ఎవరయినా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియపరిచేవారు[5]

చివరిమాట: ఇమామ్ అలీ(అ.స) వారి కుమారుల ఇంట్లో వారి అనుమతి లేకుండా ప్రవేశించేవారు కాదు, ముందు తలుపు తట్టేవారు, అనుమతి తీసుకొని ప్రవేశించేవారు.

రిఫరెన్స్
1. ఉల్గూయె రఫ్తారీ ఇమామ్ అలీ(అ.స), మొహమ్మద్ దష్తీ, నఖ్ల్ అజ్ మజాలిసుల్ వాయిజీన్, భాగం1, పేజీ281
2. మౌసూఅతుల్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్, మొహమ్మద్ మొహమ్మదీ రైషహ్రీ, భాగం4, పేజీ204
3. మజల్లయె హుకూమతె ఇస్లామీ, షుమారహ్ 18, పేజీ89
4. తారీఖె యాఖూబీ, యాఖూబీ, భాగం2, పేజీ193
5. ఉల్గూయె రఫ్తారీ ఇమామ్ అలీ(అ.స), మొహమ్మద్ దష్తీ, పేజీ241     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11