దైవప్రవక్త(స.అ) తరువాత అత్యుత్తమ వ్యక్తి

గురు, 04/01/2021 - 04:48

దైవప్రవక్త(స.అ) తరువాత అత్యుత్తమ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు ఇరువర్గాల వారి హదీస్ గ్రంథాల నుండి హదీస్ నిదర్శనం... 

దైవప్రవక్త(స.అ) తరువాత అత్యుత్తమ వ్యక్తి

మత పరమైన సంభాషణలలో ఇమామ్ అధ్యాయంలో, దైవప్రవక్త(స.అ) తరువాత వారి ఉమ్మత్ లో ఉత్తములు ఎవరు? అన్న విషయం చాలా ముఖ్యమైనది. ఇస్లామీయ చరిత్ర మొదటి దశ మరియు ఇరువర్గాల వారి హదీసులను పరిశీలించి చూస్తే ఇస్లామీయ ఉమ్మత్ లో దైవప్రవక్త(స.అ) తరువాత అతి ఉత్తమ మరియు ప్రతిష్టాత్మకం కలిగి ఉన్న వారు అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) అని తెలుస్తుంది. వారు ఇస్లామీయ ఉమ్మత్ లో ఎవరికీ లేనీ మరియు వారిని ఇష్టపడే వారితో పాటు వారి శత్రువులు కూడా సమ్మతించేటువంటి చాలా ప్రత్యేకతలు కిలిగివున్న వ్యక్తి.
వారి విజ్ఞానం గురించి దైవప్రవక్త(అ.స) ఈ హదీస్ చాలు., దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “నేను విజ్ఞాన పట్టణాన్ని మరియు అలీ ఆ పట్టణానికి ద్వారము(లాంటివారు)”[1] ఈ హదీస్ అహ్లె సున్నత్ హదీస్ మూల గ్రంథాలలో కూడా ప్రసిద్ధిగల హదీస్, ఈ స్థానం అమీరుల్ మొమినీన్(అ.స)కు ప్రత్యేకించబడినది, ఇలాంటి స్థానం మరొకరు కలిగిలేరు.
అలాగే అమీరుల్ మొమినీన్ హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రతిష్టత ఇస్లామీయ ఉమ్మత్ కు మించినది అని వివరించే చాలా రివాయతులు అహ్లె సున్నత్ మరియు షియాల ద్వార దైవప్రవక్త(స.అ) నుండి ఉల్లేఖించబడి ఉన్నాయి. కేవలం ఇస్లామీయ ఉమ్మత్ మాత్రమే కాదు మానవులందరిలో చివరికి ప్రవక్తలకు మించి ప్రతిష్టత కలిగివున్నవారు అని ఆ రివాయతులు నిదర్శిస్తున్నాయి. ఇక్కడ సంక్షిప్తంగా కొన్నింటిని వివరిస్తున్నాము:
షేఖ్ హాఫిజ్ సులైమాన్ ఇబ్నె ఇబ్రాహీమ్ ఖందూజీ హనఫీ, సయ్యద్ అలీ షాఫెయీ రచించిన గ్రంథం “మువద్దతుల్ ఖుర్బా” నుండి ఇలా ఉల్లేఖించారు: అలా ఇలా అనెను: నేను ఆయిషహ్ ను అలీ గురించి అడిగాను; ఆమె “అలీ మానవాళిలో కల్లా అత్యుత్తమవారు మరియు ఈ విషయం పట్ల ఎవరికీ సందేహం కలగదు కేవలం అవిశ్వాసికి తప్ప”[2]
అలాగే ఆమె స్వయంగా అమీరుల్ మొమినీన్ ద్వార రివాయత్ ను ఉల్లేఖించెను; దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించెను: “ఓ అలీ, నువ్వు మానవులందరిలో ఉత్తముడవు, ఇందులో కాఫిరుకు తప్ప మరొకరికి ఎటువంటి సందేహమూ కలగదు”
మరో రివాయత్ ను హుజైఫహ్ ద్వార ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: “అలీ మానవులందరిలో ఉత్తములు, ఎవరైతే ఇలా అని నిరాకరిస్తాడో అతడు అవిశ్వాసి”
హుజైఫహ్, అబూతాలిబ్ కుమార్తె ‘ఉమ్మె హానీ’ ద్వార ఇలా ఉల్లేఖించెను: దైవప్రవక్త ఇలా ఉల్లేఖించెను: అలీ మరియు వారి సంతానం మానవులందరిలో అత్యుత్తములు అనే విషయంలో సందేహం లేకుండా సమాధిలో పుడుకునేవాడు(మరణించేవాడు) అల్లాహ్ దృష్టిలో మంచివాడు, ఉత్తముడు”[3]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) తన తండ్రి ద్వార ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త(స.అ)తో మానవులలో అత్యుత్తమ వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు. వారు “ప్రజలలో అత్యుత్తమ వ్యక్తి వారిలో మించిన ధర్మనిష్ఠ, ప్రతిష్టత కలిగివున్నవాడు,  స్వర్గానికి చాలా దగ్గరగా ఉన్నవాడు, నాకు అతి దగ్గర వ్యక్తి, నా దృష్టిలో మిక్కిలి ధర్మనిష్ట, ప్రతిష్టత కిలిగివున్నవాడు అలీ ఇబ్నె అబీతాలిబ్ తప్ప మరొకరు లేరు” అల్లామా అమీనీ(ర.అ) వివిధ సనద్(రావియుల క్రమం) ద్వార అహ్లె సున్నత్ గ్రంథాల నుండి ఈ హదీసును ఉల్లేఖించారు.[4]
అహ్లె సున్నత్ కు చెందిన కొందరు ఉమ్మత్ లో అత్యుత్తమ వ్యక్తి అబూబక్ర్ అని చెబుతారు., కాని ఇది యదార్థం కాదు, ఈ మాటను స్వయంగా అబూబక్ర్(ర.అ) వారే వ్యతిరేకించారు, వారు చాలా సార్లు “నేను ఉమ్మత్ లో అత్యుత్తమ వ్యక్తిని కాను” అని. సఖీఫహ్ లో బైఅత్ ప్రమాణం తరువాత రోజు అబూబక్ర్ మస్జిదున్నబీ(స.అ)లో దైవప్రవక్త(స.అ) పీఠం ఎక్కి ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: “ప్రజలారా నేను మీ బాధ్యతలను స్వీకరించాను, మరియు నేను మీలో ఉత్తముడను కాను, ఒకవేళ నేను నా నాయకత్వంలో మంచి పనులు చేస్తే నన్ను సహకరించండి అలాగే ఒకవేళ ఏదైనా చెడు కార్యం చేస్తే మీరు నన్ను సవరించండి... నేను అల్లాహ్ పట్ల విధేయతగా ఉన్నంత వరకు మీరు నా పట్ల విధేయత కలిగివుండండి, అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)ను వ్యతిరేకిస్తే, నా పట్ల విధేయత చూపకండి”[5]
తబరీ ఇలా అనెను: అబూబక్ర్ ప్రజలలో ఉపన్యాసం ఇవ్వడం మొదలెట్టారు, వారు ఇలా అన్నారు: “.....నాకు సంబంధించి ఒక షైతాన్ ఉన్నాడు, వాడు నన్ను మోసానికి గురి చేస్తాడు, వాడు నావద్దకు వస్తే మీరు నానుండి దూరంగానే ఉండండి”[6]

రిఫరెన్స్
1. వసాయిల్ అల్ షియా, భాగం27, పేజీ34
2,3. యనాబీవుల మవద్దహ్, పేజీ246
4. అల్ గదీర్, భాగం5, పేజీ368
5. తారీఖె యాఖూబీ, భాగం2, పేజీ127. షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం2, పేజీ8.
6. తారీఖె తబరీ, భాగం2, పేజీ460

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9