ఖుర్ఆన్ మరియు ఉపాధి

శని, 04/03/2021 - 15:50

ఉపాధి కోసం లేదా అవకాశాలు రావడం కోసం పని చేయకుండా లేదా దాని కోసం ప్రయత్నించకుండా ఒక మూల కూర్చోని కేవలం దుఆ చేస్తూ ఉంటే, అల్లాహ్ ప్రాపంచిక ఖజానాలను ఇంటి పైకప్పుకు వేలాడిస్తాడు మేము వాటిని తీసుకొని ధనవంతులయిపోవచ్చు అనే ఆలోచనలకు ఇస్లాం నిరాకరిస్తుంది.

ఖుర్ఆన్ మరియు ఉపాధి

ప్రశ్న: ఉపాధి పెరిగేందుకు మరియు అవకాశాలు వచ్చేందుకు ఖుర్ఆన్ యొక్క ఏ ఆయతులు పఠించాలి? నిత్యం ఏ సూరాలను చదవాలి అనే విషయంలో మీ సలహా ఏమిటి?
సమాధానం: ఉపాధి కోసం లేదా అవకాశాలు రావడం కోసం పని చేయకుండా లేదా దాని కోసం ప్రయత్నించకుండా ఒక మూల కూర్చోని కేవలం దుఆ చేస్తూ ఉంటే, అల్లాహ్ ప్రాపంచిక ఖజానాలను ఇంటి పైకప్పుకు వేలాడిస్తాడు మేము వాటిని తీసుకొని ధనవంతులయిపోవచ్చు అనే ఆలోచనలకు ఇస్లాం నిరాకరిస్తుంది.
మేము మన ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తూనే దుఆ మరియు ఖుర్ఆన్ పఠిస్తూ ఉండాలి, అల్లాహ్ తో ఉపాధి మరియు మంచి జీవితం కోసం దుఆ చేస్తూ ఉండాలి, ఆశీర్వాదమైన జీవితం ప్రసాదించమని అల్లాహ్ ను కోరుకోవాలి. అహ్లెబైత్(అ.స) ల నుండి ఉల్లేఖించబడ్డ రివాయతులనుసారం ఉపాధిని పెంచే కొన్ని సూరహ్ లు మీ కోసం:

1. సూరయె వాఖిఅహ్: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించెను “ఎవరైతే ప్రతీ రాత్రి “వాఖిఅహ్” సూరహ్ ని పఠిస్తాడో అల్లాహ్ మరియు ఆయన దాసులందరూ అతనిని ఇష్టపడతారు. ఈ లోకంలో అతడు గతిలేని మరియు బీదతనానికి, ప్రాపంచిన కష్టలకి గురికాడు. అమీరుల్ మొమినీన్ యొక్క ముఖ్యమైన మిత్రులలో లెక్కించబడతాడు”[1].
హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్, దైవప్రవక్త[స.అ] యొక్క నమ్మకస్తులైన సహాబీ, వారు చాలా మర్యాధ మరియు అభిమానం కలిగిఉన్న వ్యక్తి. హజ్రత్ ఉస్మాన్ ఖిలాఫత్ కాలంలో అతడు చాలా అనారోగ్యానికి గురి అయ్యారు, ఆ అనారోగ్యం వలనే వారు ఈ లోకాన్ని విడిచారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు మూడవ ఖలీఫా వారిని పరామర్శించానికి వెళ్ళారు. వారు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గమనించి ఖలీఫా ఇలా అడిగారు: “ఇబ్నె మస్ఊద్! దేని వల్ల నువ్వు కంగారు పడుతున్నావు. అబ్దుల్లాహ్, నా పాపముల వల్ల అని సమాధానమిచ్చారు. ఖలీఫా,  నేను ఏవిధంగా సహాయ పడగలను? అని అడిగారు. అబ్దుల్లాహ్, నేను ఈ సమయంలో అల్లాహ్ యొక్క దయను దర్శించు కోవాలనుకుంటున్నాను అని అన్నారు. ఖలీఫా, మీరు అనుమతిస్తే నేను వైధ్యుడ్ని కబురు చేస్తాను అన్నారు. అందుకు అబ్దుల్లాహ్, నిజమైన వైధ్యుడే నాకు అనారోగ్యాన్ని ప్రసాదించాడు అని అన్నారు. ఖలీఫా, మీరు అనుమతిస్తే నేను బైతుల్ మాల్(భండాగారము) నుంచి మీకు ఆర్థిక సహాయం చేస్తాము(పెన్షన్ ఇస్తాము) అని అన్నారు. దానికి అబ్దుల్లాహ్, నాకు అవసరం ఉన్నప్పుడు నీవు నాకు ఏమీ ఇవ్వలేదు ఇక ఇప్పుడు నాకవసరం లేదు అని అన్నారు. ఖలీఫా, పరవాలేదు, ఈ ఆర్థిక సహాయం నీ కుమార్తెకు ఉపయోగపడుతుంది అన్నారు. ఇబ్నె మస్ఊద్, నా కుమార్తెలకు దీని అవసరం లేదు ఎందుకంటే నేను వారికి “వాఖిఅహ్ సూరహ్” ను నేర్పించాను. నేను దైవప్రవక్త[స.అ]ను ఇలా చెబుతుండగా విన్నాను: “ఎవరైతే ప్రతీ రాత్రి వాఖిఅహ్ సూరహ్ ను చదువుతారో వారు ఎప్పటికీ బీదవారు కారు”.[2]

2. సూరయె హుమజహ్: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: ఈ సూరహ్ ను వాజిబ్ నమాజులలో చదివేవారి నుంచి దరిద్రం, పెదరికం దూరమౌతాయి మరియు ఉపాధి అతడి సొంతమౌతుంది.[3]

3. సూరయె లైల్: దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించెను: సూరయె లైల్ పఠించేవారిని అల్లాహ్ ఎంత ఇష్టపడతాడంటే అతడికి ఉపాధి కలిపిస్తాడు, కష్టాలకు గురి చేయడు మరియు అతడికి సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు.[4]

4. సూరయె ముజమ్మిల్: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: సూరయె ముజమ్మిల్ పఠించేవారి నుంచి ఇహపరలోకాల కష్టాలు దూరం చేయబడతాయి[5]

5. సూరయె జారియాత్, ముమ్తహినహ్, నజ్మ్, ఇబ్రాహీమ్ మొదలగు సూరహ్ లను పఠించడం ద్వార ఉపాధి పెరుగుతుంది.

రిఫరెన్స్
1. వసాయిల్ అల్ షియా, భాగం6, పేజీ112
2. మజ్ముఅల్ బయాన్, భాగం9, పేజీ211
3. వసాయిల్ అల్ షియా, భాగం6, పేజీ150
4. మిస్బాహు కఫ్హమీ, పేజీ444
5. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం4, పేజీ354
https://btid.org/fa/news/10981     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11