పని, ఉత్పత్తి మరియు వ్యవసాయం ఖుర్ఆన్ లో

శని, 04/03/2021 - 16:00

ఖుర్ఆన్ లో పనీ, ఉత్పత్తీ మరియు వ్యవసాయం లాంటి విషయా గురించి ఒక్క మాట కూడా లేదు. కేవలం జగడం, ఘాతకం మరియు అత్యాచారం గురించి మాత్రమే ఉంది...

పని, ఉత్పత్తి మరియు వ్యవసాయం ఖుర్ఆన్ లో

సందేహం: ఖుర్ఆన్ లో పనీ, ఉత్పత్తీ మరియు వ్యవసాయం లాంటి విషయా గురించి ఒక్క మాట కూడా లేదు. కేవలం జగడం, ఘాతకం మరియు అత్యాచారం గురించి మాత్రమే ఉంది.
సమాదానం: ఇస్లాం విరోధులు ఖుర్ఆన్ ను యొక్క ఆయతులను పరిశీలించకుండానే అందులో పనీ, అత్పత్తి మరియు వ్యవసాయం లాంటివాటి గురించి చెప్పబడి లేదు అని సందేహాలను వ్యక్తం చేసి ఖుర్ఆన్ ను తక్కువ చేయాలని ప్రయత్నిస్తారు. సూరయె యూనుస్ యొక్క 68వ ఆయత్ లో ఇలా ఉపదేశించబడి ఉంది: అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని వారంటున్నారు. సుబ్హానల్లాహ్! (అల్లాహ్ పరమ పవిత్రుడు). ఆయన ఏ అవసరమూ లేనివాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయన సొత్తే. దీనికిగాను (మీరు ఆపాదించే అసత్యానికి గాను) మీవద్ద ఏ ఆధారమూ లేదు. అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా?[సూరయె యూనుస్, ఆయత్68]
ఈ విధంగా చూసుకున్నట్లైతే సందేహాలు సృష్టించేవాడు అల్లాహ్ మాటలు(ఖుర్ఆన్)ను అపవాదిస్తున్నాడు. లేకపోతే ఖుర్ఆన్ లో చాలా ఆయతులు పనీ, ప్రయత్నం మరియు ఉత్పత్తి గురించి ఉన్నాయి.
మనిషిని పని చేయాలి, ప్రయత్నించాలి, అతడు తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి(ఇందులో ఉత్పత్తి, వ్యవసాయం లాంటివి అన్నీ ఉన్నాయి) అని ఆహ్వానించే అతి ప్రసిద్ధి చెందిన ఆయత్ సూరయె అన్ఫాల్ యొక్క 53వ ఆయత్: “అల్లాహ్ ఏ జాతివారికైనా అనుగ్రహాన్ని ప్రసాదించిన తర్వాత వారు స్వయంగా తమకు తామై స్థితిని మార్చుకుంటేనే తప్ప అల్లాహ్ తాను ప్రసాదించిన అనుగ్రహాన్ని మార్చడు”[సూరయె అన్ఫాల్, ఆయత్53]
అలాగే సూరయె జుముఅహ్ యొక్క 5వ ఆయత్ లో ఇలా ఉపదేశించబడి ఉంది: “మరి నమాజు ముగిసిన తరువాత(తిరిగి మీ పనుల మరియు ఉపాది కొరకు) భూమిలో విస్తరించండి. దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”[సూరయె జుముఅహ్, ఆయత్10]
ఖుర్ఆన్ కొన్ని ఆయతులలో వ్యవసాయం గురించి కూడా సూచించెను. సూరయె యూసుఫ్ లో ఇలా ఉంది: యూసుఫ్ ఇలా అన్నారు: “రాజ్యంలోని ఖజానాలపై నన్ను (పర్యవేక్షకునిగా) నియమించండి. నేను వాటిని కాపాడతాను. ఆ పరిజ్ఞానం నాకున్నది”[సూరయె యూసుఫ్, ఆయత్55] ఈ ఆయత్ లో హజ్రత్ యూసుఫ్(అ.స) రాజుతో వ్యవసాయ వ్యవహారాలు వారికి అప్పగించమని కోరారు.
అలాగే ఖుర్ఆన్ లో మరికొన్ని ఆయతులలో వర్షం మరియు మొక్కలు పెరిగే(వ్యవసాయం మరియు చెట్లు) అంశాల గురించి సూచించబడి ఉంది. సూరయె అన్ఆమ్ 99వ ఆయత్ లో ఇలా ఉంది: ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు అల్లాహ్ యే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దానిద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూన్ (ఆలీవ్ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు....[సూరయె అన్ఆమ్, ఆయత్99]
మరి కొన్ని ఆయతులలో వాటి ప్రస్తావన ఉంది ఉదాహారణకు.. సూరయె ఇబ్రాహీమ్ 32వ ఆయత్ లో, సూరయె యూనుస్ 24వ ఆయత్ లో, సూరయె జుమర్ 21వ ఆయత్ లో, ఇలాగే వేరే ఆయతులలో కూడా వీటి ప్రస్థావన ఉంది.    

రిఫరెన్స్
   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5