దైవప్రవక్త(స.అ) 12వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) ఉన్నారు అన్న విషయాన్ని నిరూపించడానికి దైవప్రవక్త(స.అ) యొక్క “పన్నెండు ఖలీఫాహ్”ల రివాయత్ చాలు...

దైవప్రవక్త(స.అ) 12వ ఉత్తరాధికారి అయిన హజ్రత్ ఇమామ్ మహ్దీ(అ.స) ఉన్నారు అన్న విషయాన్ని నిరూపించడానికి దైవప్రవక్త(స.అ) యొక్క “పన్నెండు ఖలీఫాహ్”ల రివాయత్ చాలు. ఈ రివాయత్ అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ హదీస్ గ్రంథాలలో మరియు అలాగే షియా గ్రంథాలలో కూడా ఉంది. ఈ రివాయత్ లో దైవప్రవక్త(స.అ) నా ఉమ్మత్ లో నా ఉత్తరాధికారులు ప్రళయదినం వరకు 12 మంది, ఎక్కుతక్కువలు లేకుండా.
కొన్ని రివాయతులు మీ కోసం:
1. జాబిర్ ఇబ్నె సుమరహ్ కథనం: ఒకరోజు నేను నా తండ్రితో పాటు దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్ళాను, అక్కడా వారు ఇలా ప్రవచించడాన్ని విన్నాను: ఈ ఆదేశం(ఇస్లాం) నా పన్నెండు ఖలీఫాలు మరియు ఉత్తరాధికారులు, మీ మధ్య రానంతవరకు అంతం కాదు. నేను అప్పుడు దైవప్రవక్త(స.అ) చెప్పిన చివరి వాక్యం వినలేకపోయాను. తర్వాత ఆ వాక్యాన్ని మా తండ్రి గారి నోట విన్నాను: వారందరూ ఖురైషీయులై ఉంటారు. అని[1]
2. సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ ఇలా అనెను: నేను జాబిర్ ఇబ్నె సమురహ్ కు ఉత్తరం వ్రాసి నువ్వు దైవప్రవక్త(స.అ) నుంచి విన్న కొన్ని హదీసులు నాకు తెలియపరుచు అని కోరాను. అతడు నాకోసం ఇలా లిఖించెను: శుక్రవారం రోజు సాయత్రం అస్లమీ వద్ద ఉన్నప్పుడు దైవప్రవక్త(స.అ)ను ఇలా చెబుతుండుగా విన్నాను: “దీన్ ఖియామత్ ప్రళయదినం వచ్చే వరకు స్థిరంగా ఉంటుంది మరియు మీకోసం పన్నెండు ఖలీఫాలు ఉంటారు, వారందరూ ఖురైష్ కు చెందిన వారు అయి ఉంటారు”[2]
3. “ఇస్లాం ధర్మం ప్రళయదినం వరకు సాగుతుంది మీ కొరకు పన్నెండు ఖలీఫాలతో, వారందరూ ఖురైష్ వంశానికి చెందినవారై ఉంటారు”[3]
ఈ హదీసులు సరైనవి అని ఇరువర్గాల వారు భావిస్తారు; ఈ హదీసులు సరైనవని, అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ఉలమాలు ఈ పన్నెండు ఖలీఫాల హదీసులను న్యాయంచేయటానికై, ఖలీఫాల గణణాన్ని మొదలు పెట్టారు; ప్రతీ ఒక్కడు ఒక రకంగా లెక్కపెట్టసాగాడు, కొందరు అబ్బాసీ దుర్మార్గపు ఖలీఫాలను ఆ పన్నెండు ఖలీఫాలలో నిర్ధారించారు, ఉలమాలలో చాలా మంది “ముఆవియహ్”ను ఈ ఖలీఫాల నుండి అని భావించారు; కాని యదార్థమేమిటంటే వీటిలో ఏ ఒక్కటీ నిజం కాదు, ఇవన్నీ ప్రజలకు దారి తప్పించడానికి మాత్రమం; ఈ రివాయతులు షియా విశ్వాసానికి అనుకూలమైనది, ఎందుకంటే షియా ఇస్నా అషరీ వర్గానికి చెందినవారు దైవప్రవక్త(స.అ)కు పన్నెండు మంది ఉత్తరాధికారులనీ, మరి వారందరూ పవిత్రులనీ, నిజమైన ఉత్తరాధికారులూ అనీ నమ్ముతారు.
అహ్లెసున్నత్ ఉలమాలు వివరించిన దైవప్రవక్త(స.అ) యొక్క పన్నెండు ఉత్తరాధికారులు, వారు కారు అని సూచించె ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆ సూచనలు:
మొదటి సూచన: దైవప్రవక్త(స.అ) యొక్క పన్నెండు మంది ఖలీఫాల ఖిలాఫత్ అధికారం ఒక ప్రత్యేక కాలానికి ప్రత్యేకించబడినది కాదు. రివాయతుల ప్రకారం వారి ఖిలాఫత్ ప్రళయదినం వరకు సాగుతుంది, అందుకని ఒక కాలానికి ప్రత్యేకించబడినది కాదని తెలుస్తుంది., ఈ విధంగా చూసుకుంటే ఈ కాలంలో కూడా ఒక ఖలీఫా తప్పకుండా ఉండాలి. ఈ విషయం షియా నమ్మకానికి అనుకూలమైనది.
రెండవ సూచన: ఇస్లాం యొక్క గొప్పతనం, పన్నెండు ఖలీఫాల ఉనికి. రివాయతలను దృష్టిపెట్టి చూసినట్లైతే; కొన్ని రివాయతులలో “దీన్ ప్రళయదినం వచ్చే వరకు స్థిరంగా ఉంటుంది మరియు మీకోసం పన్నెండు ఖలీఫాలు ఉంటారు” అని ఉంది, అనగా ఖలీఫా, ఇస్లాం యొక్క గొప్పతనం మరియు స్థిరత్వం. దానిని నాశనం చేసేవాడు ఖలీఫా కాలేడు. ఇస్లామీయ చరిత్రను చూస్తే ముఆవియహ్ మరియు అతడి తరువాత వచ్చిన ఖలీఫాలందరూ కేవలం అధికారం దక్కించుకోవడానికి పోటీ పడ్డారు, దుర్మార్గంతో ఖిలాఫత్ ను దక్కించుకున్నారు; ఇలాంటి వారు ఇస్లాం యొక్క స్థిరత్వానికి మరియు గొప్పతనానికి ఎలా కారణం అవ్వగలరు?
మూడవ సూచన: దైవప్రవక్త(స.అ) అంతిమ ఖలీఫా హజ్రత్ మహ్దీ(అ.స). రివాయతులను పరిశీలిస్తే అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలలో స్పష్టంగా దైవప్రవక్త(స.అ) అంతిమ ఖలీపా హజ్రత్ మహ్దీ(అ.స) అని సూచించబడి ఉంది.
ఇది అహ్లె సున్నత్ యొక్క నమ్మకానికి అనుకూలంగా లేని విషయం.
నాలుగొవ సూచన: చాలా రివాయతులలో “వారందరూ ఖురైషీయులకు చెందిన వారు” అయి ఉంటారు. అంటే ఖురైషీయుల కానివారు ఖలీఫా కాలేడు. అహ్లె సున్నత్ సూచించిన ఖలీఫాలలో కొందరు ఖురైషీయులకు చెందినవారు కారు.[4]
రిఫరెన్స్
1. సహీముస్లిం, భాగం6, పేజీ3, ఫీ కితాబిల్ ఇమారహ్ ఫీ బాబిన్నాస్. సహీ బుఖారీ, హదీస్7223
2. సహీ ముస్లిం, భాగం3, పేజీ1453, హదీస్1822, తహ్ఖీఖ్.. ముహమ్మద్ ఫూఆద్ అబ్దుల్ బాఖీ
3. సహీ అబీ దావూద్, భాగం2, కితాబుల్ మహ్దీ పేజీ207., అల్ గైబహ్, షేఖ్ తూసీ, పేజీ128
4. http://www.pajoohe.com/fa/index.php?Page=definition&UID=39238
వ్యాఖ్యానించండి