ఎదుటివారిని కష్టపెట్టకు...

ఆది, 04/04/2021 - 06:21

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఎవరైతే ఒక విశ్వాసిని అవమానిస్తాడో అల్లాహ్ అతడిని అవమానానికి గురి చేస్తాడు!...

ఎదుటివారిని కష్టపెట్టకు...

నా భర్త యొక్క అన్నయ్యకు 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. నేను ఆ ఇంటి చిన్న కోడల్ని, నా పెళ్లి అయ్యి ఒక సంవత్సరం అయ్యింది అప్పుడు నేను కడుపుతో ఉన్నానని మావారి కుటుంబ సభ్యులకు చెప్పాను, ఆ ఇంటి పెద్ద కోడలికి పిల్లలు లేరు; దాంతో వారు నేను కడుపుతో ఉన్నాను అన్న వార్త విని చాలా సంతోషించారు. మొదటి పిల్లాడు పుట్టిన మూడు సంవత్సరాల తరువాత అల్లాహ్ రెండవ పిల్లాడ్ని ప్రసాదించాడు, రెండవ సారి పుట్టింది కూడా మగపిల్లాడు కావడంతో నేను గర్వంపడ్డాను. నేను పెద్దకోడలి మాదిరి గొడ్రాలు కాదు అని సంతోష పడ్డాను. 

నాలో అహంభావం ఎక్కువయ్యింది, పెద్ద కోడలు నా పిల్లల్ని ఎత్తుకోవాలని వస్తే నేను వ్యంగ్యంగా మాట్లాడి అడ్డుకునే దాన్ని, నీకు పిల్లలు లేరు వారిని ఎలా చూసుకోవాలో నీకెలా తెలుస్తుంది అని చెప్పేదాన్ని. నిత్యం ఆమెను నిరాశ పరిచేదాన్ని కాని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చేది. ఆమెను అవమానించాలని అనుకునే దాన్ని ఒకరోజు అందరూ ఉండగా నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు పుట్టే భాగ్యం లేదు అని అన్నాను, నా మాటలు ఆమెకు చాలా కష్టం కలిగించాయి. కొన్ని నెలలు గడిచాక నేను మూడవసారి గర్భవతిని అయ్యాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆరు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు నా భర్త నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ఘోర ప్రమాధానికి గురయ్యాము, ఆ ప్రమాధంలో నా భర్తా, నా పిల్లలూ మరణించారు. ఆత్మక్షోభకు గురి అయ్యాను, మూడు నెలల తరువాత జన్మించే పిల్లాడిని ఏమి చేయాలో తెలియని పరిస్థితి, చివరికి ఆ రోజు వచ్చింది, కాన్పు జరిగింది, ఈ సారి కూడా అల్లాహ్ నాకు మగపిల్లాడే ప్రసాదించాడు కాని పిల్లాడు అంగవైకల్యంతో పుట్టాడు....
నాకు తెలిసొచ్చింది, ఇవన్నీ పెద్ద కోడలి పట్ల నా ప్రవర్తన ఫలితాలు అని. కొంతకాలం తరువాత పెద్ద కోడలికి అల్లాహ్ ఒక బాబూ ఒక పాపాను ప్రసాదించాడు.

ఎదుటివారిని కష్టపెట్టకూడదు అని వివరిస్తున్న కొన్ని హదీసులు:
దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “ఎవరైతే ఒక పదం ద్వార ఒక విశ్వాసిని కష్టం కలిగిస్తాడో, అతడు ప్రళయదినాన అలాహ్ ను కలిసేటప్పుడు అతడి రెండు కళ్ళ మధ్య ఇలా లిఖించబడి ఉంటుంది “నా దయతో నిరాశ!” (అల్లాహ్ కరుణించడు అని అర్ధం)[1] మరో చోట ఇలా ఉంది: ఎవరైతే ఒక విశ్వాసిని అవమానిస్తాడో అల్లాహ్ అతడిని అవమానానికి గురి చేస్తాడు!”[2]

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “ప్రజల పై దుర్మార్గం పరలోకపు చెడు సామాగ్రీ” అలాగే మరో చోట ఇలా ప్రవచించారు: ప్రతీ దుర్మార్గుడి పట్ల పగతీర్చుకునేవాడు ఉంటాడు”[3]
మనిషి తాను చేస్తున్న పనులు లేదా చెప్పే మాటలు ఎదుటివారికి కష్టం కలిగించకూడదు అని ఆలోచించి అడుగు వేస్తే మన సమాజం వేరేలా ఉంటుంది. గుర్తుంచుకోండి మనం కష్టం కలిగించిన వ్యక్తి హృదయం విరిగి అతడు ఆ విరిగిన హృదయంతో దుఆ చేస్తే అల్లాహ్ అతడి దుఆను రద్దు చేయడు, ఎందుకంటే అల్లాహ్ ఇలా ఆదేశించెను, నీ మనసు విరిగినపుడు నాతో మాట్లాడు.
ఇప్పటి వరకు మనం ఎవరినైనా కష్టపెట్టి ఉంటే అల్లాహ్ క్షమించుగాక మరియు ఇక ముందు ఇలాంటి చర్యలకు గురికాకుండా మనల్ని కాపాడుగాక!

రిఫరెన్స్
1. జామివుల్ అఖ్బార్, పేజీ72. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ150
2. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ142
3. అల్ హుక్ముజ్జాహిరహ్, తర్జుమా అన్సారీ, పేజీ591 తరువాత, బాబె ఆజార్ వ అజియతె మొమిన్       

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir baig on

Elahiameen, Allah protect us from this kind of sins.
Than you qibla. Jazakallah.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16