రమజాన్ మాసం యొక్క రాత్రుళ్లలో పాటించ వలసిన కొన్ని ముఖ్యాంశాలు...
1. మగ్రిబ్ సమయం అయిన తరువాత ఇఫ్తార్ చేయడం. మగ్రిబ్ నమాజ్ చదివిన తరువాత ఇఫ్తార్ చేయడం ముస్తహబ్, కాని ఒకవేళ బలహీనతకు గురి అయి నమాజ్ లో ధ్యానం తగ్గుతుంది అనే భయం ఉంటే, లేదా కొందరు మీ కోసం వేచివుంటే మగ్రిబ్ సమయం తరువాత మరియు నమాజ్ కు ముందు ఇఫ్తార్ చేయవచ్చు.
2. ఇఫ్తార్ కోసం తీసుకునే పదార్థాలు అది అన్నం కానివ్వండి లేదా పానియాలు కానివ్వండి, అవి హరామ్ మరియు హరామ్ అన్న సందేహంతో కూడి ఉండకూడదు. హలాల్ ఖర్జురంతో ఇఫ్తార్ చేయడం మంచిది, దైవప్రవక్త(అ.స) ఇలా ఉపదేశించారు: “ఎవరైతే హలాల్ ఖర్జూరంతో ఇఫ్తార్ చేస్తారో, వాడి నమాజ్ యొక్క పుణ్యం పెరుగుతుంది.
ఇమామ్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించారు: పాలుతో ఇఫ్తార్ చేయడం ముస్తహబ్ నీళ్లతో, తీపితో, గోరువెచ్చని నీటితో, వీటిలో ఏదైనా సరే ఇఫ్తార్ చేయాలి. దైవప్రవక్త(స.అ) వీటితో ఇఫ్తార్ చేసేవారు.
3. ఇఫ్తార్ సమయంలో ఈ దుఆను చదవాలి: “అల్లాహుమ్మ లక సుమ్తు, వ అలా రిజ్ఖిక అఫ్తర్తు, వ అలైక తవక్కల్తు; ఓ అల్లాహ్ నేను నీ కోసం ఉపవాస దీక్షను నిర్వర్తించాను, నీవు నాకు ప్రసాదించినవాటి ద్వార ఇఫ్తార్ చేశాను, నిన్నే నమ్ముకున్నాను”
4. ఇఫ్తార్ సమయంలో “ఇన్నా అన్జల్నా” నూరహ్ ను పఠించడం ఉత్తమ పుణ్యానికి కారణం.
5. ఇఫ్తార్ కోసం తీసుకునే మొదటి ముద్ద, తినే టప్పుడు ఇలా చెప్పాలి: “బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, యా వాసిఅల్ మగ్ఫిరతి, ఇగ్ఫిర్లీ” ఇమామ్ హసన్(అ.స) ఇలా ప్రవచించారు: “ఎవరైతే దీన్ని చదువుతారో, అల్లాహ్ అతడిని (పాపాములను) క్షమిస్తాడు”
6. ఇఫ్తార్ సమయంలో దుఆ చేయడం కూడా చాలా మంచిది. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఉపవాసం ఉన్నవాడు, ఇఫ్తార్ సమయంలో ఒక స్వీకరించబడ్డ దుఆ కలిగి ఉంటాడు”
7. ఇఫ్తార్ సమయంలో, సద్ఖా ఇవ్వాలి, ఉపవాసం ఉన్నవారికి మన వద్ద ఎంత లేకున్నా సరే కొన్ని ఖర్జూరాలు మరియు ఒక గ్లాసు నీళ్లతోనైనా ఇఫ్తార్ చేయించాలి. ఇఫ్తార్ చేయించడం అత్యుత్తమ ముస్తహబ్ చర్య. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “రమజాన్ మాసంలో ఒక ఉపవాసం ఉన్న విశ్వాసికి ఇఫ్తార్ చేయిస్తే, అతడికి ఒక విశ్వాసిని బానిసత్వం నుంచి విడివించినంత పుణ్యం దక్కుతుంది మరియు అతడి పాపాలు క్షమించబడడానికి కారణం అవుతుంది” అప్పుడు సహాబీయులు “ఇలా చేసే స్థోమత లేకపోతే ఏమి చేయాలి'' అని ప్రశ్నించినపుడు దైవప్రవక్త(స.అ) ఇలా సెలవిచ్చారు: “స్థోమత లేనివారు కొన్ని పాలూ, లేదా నీళ్ళు, లేదా కొన్ని ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేయించినా, అల్లాహ్ వారికి అదే పుణ్యన్ని ప్రసాదిస్తాడు”
8. ప్రతీ రాత్రి మగ్రిబ్ నమాజ్ తరువాత “దుఆయె హజ్”ను చదవాలి. ఈ దుఆ మఫాతీహ్ లో రమజాన్ యొక్క ప్రతిరోజు చేయాల్సిన ఆమల్(ఆమాలె ముష్తరికా) క్రమంలో ఉంది.
9. సయ్యద్ ఇబ్నె తావూస్ తన గ్రంధం ఇఖ్బాల్ లో రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “రమజాన్ మాసంలో ప్రతీ రాత్రి ఈ దుఆను చదివేవారి చాలా పాపములు క్షమించబడతాయి”
దుఆ: అల్లాహుమ్మ రబ్బ షహ్రి రమజాన్ లజీ అన్ జల్ త ఫీహిల్ ఖురఆన్, వఫ్ తరజ్ త అలా ఇబాదిక ఫీహిస్సియామ్, స్వల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్, వర్ జుఖ్ని హజ్జ బైతికల్ హరామ్, ఫీ ఆమి హాజా వ ఫీ కుల్లి ఆమ్, వగ్ ఫిర్లీ తిల్కజ్ జునూబల్ ఇజామ్, ఫ ఇన్నహు లా యగ్ఫిరుహ గైరుక యా రహ్మాను యా అల్లాం.
అనువాదం: ఓ అల్లాహ్! నీవు ఖుర్ఆనును అవతరించినటువంటి రమజాన్ మాసం యొక్క స్వామి. అందులో నీవు ఉపవాస దీక్షను విధిగా నిర్ధారించావు. ముహమ్మద్ మరియు ఆలె ముహమ్మద్ పై కరుణను కురిపించు. మమ్మల్ని నీ గృహదర్శనం, హజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించు, ఈ సంవత్సరం మరియు అలాగే ప్రతీ సంవత్సరం కూడానూ. మా అతి పెద్ద పాపములను క్షమించు, వాటిని నీవు తప్ప మరెవ్వరూ క్షమించలేరు. కరుణామయుడవు నీవే. అన్ని స్థితిగతులు తెలిసినవాడవు కూడా నీవే.
10. రమజాన్ మాసం యొక్క ప్రతీ రాత్రి “దుఆయె ఇఫ్తితాహ్” ను పఠించాలి.
11. రమజాన్ మాసం రాత్రుళ్లలో రెండు రక్అతుల నమాజ్ చదవాలి. ఆ నమాజ్ యొక్క రక్అతులలో ఒకసారి అల్ హంద్ సూరహ్ మరియు మూడు సార్లు ఖుల్ హువల్లాహ్ సూరహ్ ను చదవాలి, నమాజ్ పూర్తయిన తరువాత ఈ దుఆను చదవాలి: “సుబ్హాన మన్ హఫీజున్ లా యగ్ఫల్, సుబ్హాన మన్ హువ రహీమున్ లా యఅజల్, సుబ్హాన మన్ హువ ఖాయిమున్ లా యస్ హూ, సుబ్హాన మన్ హువ దాయిమున్ లా యల్ హూ” ఆ తర్వాత ఏడు సార్లు “సుబ్హానల్లాహి వల్ హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్” చదవాలి, ఆ తర్వాత “సుబ్హానక సుబ్హానక సుబ్హానక, యా అజీము ఇగ్ఫిర్ లియజ్జంబల్ అజీమ్” అని చదివి చివరిలో 10 సార్లు “సలవాత్” పఠించాలి. ఈ రెండు రక్అత్లు చదివినవారి చాలా పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు.
12. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మాసం యొక్క రాత్రుళ్లలో ముస్తహబ్ నమాజులలో “ఇన్నా ఫతహ్నా” సూరహ్ ను పఠించేవాడు, ఆ సంవత్సరంలో సంభవించే ఆపదల నుండి రక్షించబడతాడు.
13. రమజాన్ మాసం పొడుగునా, రాత్రి సమయంలో వెయ్యి రక్అత్లు చదవడం.
రిఫరెన్స్
https://btid.org/fa/news/32229
వ్యాఖ్యలు
Mashaallah qibla
Jazakallah khair
Jazakallah Qibla...Allah jjh Aap ko Salaamat rakkhe...Akre Azeem Ata kare...kaayenaat ki har jaayez khushiyo se aap ka daaman bharde...ilaahi Aameen ya rabbal Aalameen
వ్యాఖ్యానించండి