రమజాన్ మాసంలో అత్యుత్తమ చర్యలు

గురు, 04/08/2021 - 08:10

రమజాన్ మాసంలో అత్యుత్తమ చర్యలు ఏమిటి అన్న విషయంపై సంక్షిప్త వివరణ...

రమజాన్ మాసంలో అత్యుత్తమ చర్యలు

పవిత్ర మాసం రమజాన్ లో, నిర్వర్తించడానికి చాలా ఆమాల్ మరియు చర్యలు చెప్పబడ్డాయి, ఉదాహారణకు ఆ మాసంకు సంబంధించిన ప్రత్యేక దుఆలు, ఖుర్ఆన్ పఠనం, దుఆ చేయడం, సలవాత్ చదవడం, ఇస్తిగ్ఫార్ చేయడం, ఎక్కువగా “లా ఇలాహ ఇల్లల్లాహ్” స్మరించడం, ఇఫ్తెతాహ్ దుఆ చదవడం, ఎంత ఎక్కువగా నమాజులు చదివితే అంత మంచిది; ముఖ్యంగా మఫాతీహ్ లో చెప్పబడిన విధంగా చదవడం, ఇఫ్తారీ చేయించడం, సద్ఖా దానం చేయడం, మొ...[1]
రమజాన్ మాసంలో అత్యుత్తమ చర్య ఏమిటి?
హజ్రత్ అలీ(అ.స) ఇలా ప్రవచించెను: “ఒకరోజు దైవప్రవక్త(స.అ) ఉపన్యాసమిస్తూ ఇలా ప్రవచించారు: “ప్రజలారా! నిస్సందేహంగా పవిత్ర, కారుణ్యంతో కూడిన మరియు పాపములు క్షమించబడేటువంటి మాసం మీకు చేరువౌవుతుంది. ఈ మాసం అల్లాహ్ దృష్టిలో చాలా ప్రత్యేకమైనది. ఈ మాసం యొక్క రోజులు అత్యుత్తమైనవి, దీని రాత్రుళ్ల అత్యుత్తమైనవి (చివరికి) దీని గడియాలు అత్యుత్తమ గడియాలు. ఈ మాసంలో మీరు అల్లాహ్ యొక్క అతిధులు, ఆయన కారుణ్యాన్ని పొందుతారు, ఈ మాసంలో మీ ఊపిరి స్మరణ(తస్బీహ్) మీ నిద్ర ఆరాధన. మీ చర్య మరియు దుఆలు స్వీకరించబడతాయి....
నేను నిలబడి వారితో ఇలా ప్రశ్నించాను: ఓ దైవప్రవక్త(స.అ), ఈ మాసంలో అత్యుత్తమ చర్య ఏమిటి?
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: ఓ అబల్ హసన్, ఈ మాసంలో అత్యుత్తమ చర్య అల్లాహ్ హరామ్ గా నిర్ధారించిన వాటి నుండి దూరంగా ఉండడం(అనగా ధర్మనిష్ఠ కిలిగి ఉండడం)[2]
సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ మాసంలో విధిగా నిర్ధారించబడిన ఆమాల్ మరియు చర్యలు ఉదాహారణకు ఉపవాసం ఉడడం వంటివి, ఉన్నప్పటికీ; చాలా ముస్తహబ్ చర్యలు పాటించడానికి తాకీదు చేయబడి ఉన్నాయి. కాని తెలుసుకోవల్సిన విషయమేమిటంటే రమజాన్ మాసంలో నిత్యం పాపములకు దూరంగా, వాజిబ్ చర్యలను సరిగా, గతంలో చేసిన పాప క్షమపణ మరియు వాటి పరిహారం మొదలగు విషయాలు నిర్వర్తించడాన్ని ప్రాధాన్యత ఇవ్వాడమే ఉత్తమ చర్య.
బహుశ ఇవి కూడా ఉత్తమ చర్యలు అని కూడా చెప్పవచ్చు.. వాజిబ్ చర్యలలో నమాజ్ చదవడం, ఉపవాసం ఉండడం మరియు హలాల్ విధంగా సంపాదించడం మొ..., పాపములకు దూరంగా ఉండే చర్యలలో ఉద్దేశపూర్వకంగా తిన కుండా ఉండడం కూడా ఉత్తమ చర్య అవుతుంది. ఎందుకంటే కొందరు ఒక సంవత్సరం ఎండాకాలమని, మరో సంవత్సరం ఏదో ప్రాబ్లమ్ ఉందని సాకులు చెబుతూ అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని అమలు చేయకుండా చాలా సులువుగా ఉపవాస దీక్షలు నిర్వర్తించరు.
వాజిబ్ చర్యలు నిర్వర్తనం మరియు హరామ్ చర్యల నిషేధం పట్ల అమలు తరువాత రెండవ స్థానంలో ఉన్న అత్యుత్తమ చర్యలు పేదవారికి సద్ఖాదానం ఇవ్వడం, ఖుర్ఆన్ పఠించడం; హదీసులనుసారం ఈ మాసంలో ఒక ఆయత్ పఠిస్తే ఇతర మాసములలో ఒక ఖుర్ఆన్ పూర్తి చేసిన పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.[3]
ఎంత సాధ్యమైతే అంతగా మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు వీటన్నింటి పట్ల నిర్లక్ష్యంగా ఉండి ఉంటే ఈ సంవత్సరం నుండి ఆ నిర్లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి కొంత సమయం అల్లాహ్ ఆదేశాల పట్ల విధేయతను చూపడానికి ప్రయత్నించండి. చివరికి తిరిగి వెళ్ల వలసింది ఆయన వద్దకే. ఆలోచించుకోండి; ఇహలోకమా పరలోకమా...!!!

రిఫరెన్స్
1. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, ఆమాలె మాహె రమజాన్ అధ్యాయంలో.
2. షేఖ్ సదూఖ్, అమాలీ, పేజీ84.
3. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, ఆమాలె మాహె రమజాన్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12