రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆ భావర్ధాలు

శుక్ర, 04/09/2021 - 05:37

రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మజ్ అల్ సియామీ ఫీహి సియామస్ సాయిమీన్, వ ఖియామీ ఫీహి ఖియామల్ ఖాయిమీన్, వ నబ్బిహ్ నీ  ఫీహి అన్ నౌమతిల్ గాఫిలీన్, వ హబ్ లీ జుర్మీ ఫీహి యా ఇలాహల్ ఆలమీన్, వ’ఫు అన్నీ యా ఆఫీయన్, అనిల్ ముజ్రిమీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు (ఈ నెల)లో నా ఉపవాసాలను, నిజమైన ఉపవాసుల ఉపవాసాలలో ఖరారు చేయి. నా ఆరాధనలను, సరైన ఆరాధన చేసే వారి ఆరాధనగా నిర్ధారించు. ఈ రోజు (ఈ నెల)లో పరధ్యానుల నిద్ర నుండి నన్ను మేలుకొలుపు. నా పాపములను క్షమించు ఓ సర్వలోకముల ప్రభూ! నన్ను మన్నించు ఓ పాపాత్ములను మన్నించు వాడా!.[1]
1. నిజమైన ఉపవాసుల ప్రత్యేకతలు:
రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను మా ఉపవాసాన్ని నిజమైన ఉపవాసుల ఉపవాసాలలో నిర్ధారించు అని కోరుతున్నాము. నిజమైన ఉపవాసుల ప్రత్యేకతలు ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం; ఇక్కడ ఖుర్ఆన్ మరియు రివాయతుల ప్రకారం నిజమైన ఉపవాసుల ప్రత్యేకతలు తెలుసుకుందాం:
ధర్మనిష్ఠ మరియు తఖ్వా:
ఖుర్ఆన్ యొక్క ఆయతులను పరిశీలిస్తే ఉపవాసం యొక్క కారణాలలో ఒకటి ధర్మనిష్ఠ అని తెలుస్తుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “ఓ విశ్వాసులారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది... దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది”[బఖరహ్:183].
అల్లాహ్ ఈ ఆయత్ లో ఉపవాసం దీక్ష విధిగా నిర్ధారించబడినది అని ఆదేశించిన వెంటనే దీని యొక్క ఫీలసఫీ మానవుని శిక్షణ అని చిన్న వాక్యంతో వివరించేను; ఆ వాక్యం “ల అల్లకుమ్ తత్తఖూన్; దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది” నిజంగానే ఉపవాస దీక్షలు మనిషి యొక్క ఆత్మను శిక్షణ ఇస్తుంది, పరిస్థితులను ఎదురుకునే బలాన్ని ఇస్తుంది...[2]
రివయత్ గ్రంథాలలో కూడా దీని గురించి వివరించబడి ఉంది: ఇమామ్ అలీ(అ.స) దైవప్రవక్త(స.అ)తో ఇలా ప్రశ్నించారు: “ఓ దైవప్రవక్త(స.అ) ఈ మాసంలో అత్యుత్తమ చర్య ఏమిటి? దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానం ఇచ్చారు: “ఓ అబుల్ హసన్! అల్లాహ్ తరపు నుండి నిషేధించబడ్డ (హరామ్) చర్యల నుండి దూరంగా ఉండం, ఈ మాసంలో అత్యుత్తమ చర్య”[3] ఈ హదీస్ ద్వార తెలిసే విషయం నిజమైన ఉపవాసి యొక్క ప్రత్యేకత ధర్మనిష్ట ను కలిగి వుండడం లేదా దాన్ని పొందడానికి ప్రయత్నించడం.
శరీరమంతా ఉపవాసం ఉండడం:
ఉపవాసం అంటే కేవలం అన్నపానియాలకు దూరంగా ఉండడం కాదు. నిజమైన ఉపవాసం అంటే పూర్తి శరీరం అన్ని విధాలుగా ఉపవాసాన్ని పాటించాలి; అంటే ఎటువంటి చెడును చేయకూడదు. ఉపవాసంతో ఉండి చాడీలు చెప్పేవాడు, పాపముల నుంచి దూరం కానివాడు నిజమైన ఉపవాసి కాలేడు. రివాయత్ ఇలా ఉల్లేఖిస్తుంది: “ఉపవాస దీక్షను నిర్వర్తిస్తున్నప్పుడు నీ చెవులు కూడా ఉపవాసం ఉండాలి(అంటే వాటితో జరిగే పాపములకు దూరంగా ఉండాలి) నీ కళ్ళు కూడా ఉపవాసం ఉండాలి, నీ తల వెంట్రుకలు కూడా ఉపవాసం ఉండాలి చివరికి నీ శరీర చర్మం కూడా ఉపవాసం ఉండాలి”[4]
2. నా జాగారాన్నీ, నమాజును నిజమైన జాగారం మరియు నమాజ్ చేయువారిలో నిర్ధారించు:
రమజాన్ మాసం యొక్క మొదటి రోజు దుఆ యొక్క రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మా జాగారాలను మరియు నమాజులను నిజమైన జాగారం మరియు నమాజ్ చేసేవారిలో నిర్ధారించు అని కోరుతున్నాము. నమాజ్ మరియు అల్లాహ్ ఆరాధన కోసం రాత్రంతా జాగారం చేయడం చాలా ప్రాముఖ్యమైన మరియు చాల అముల్యమైన చర్య, దీని ద్వార మనిషి అగ్ర స్థానాలు పొందుతాడు.
అల్లాహ్ సూరయె మఆరిజ్ లో నమాజీయుల లక్షణాలను చాలా అందంగా వివరించెను:
1. నిత్యం నమాజు చదవడం: వారు తమ నమాజుల(వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు[సూరయె మఆరిజ్, ఆయత్23]
2. ఆర్థిక హక్కుల చెల్లింపు: “వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది” [సూరయె మఆరిజ్, ఆయత్24]
3. ప్రళయదినం మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడం: “వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు”[సూరయె మఆరిజ్, ఆయత్27]
4. పవిత్రత: “వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు”[సూరయె మఆరిజ్, ఆయత్29]
5,6. అప్పగింతలు మరియు మాటపై నిలబడి ఉండడం: “వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు”[సూరయె మఆరిజ్, ఆయత్32]
7. తమ సాక్ష్యాల పై నిలకడ కలిగివుండడం: “వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు”[సూరయె మఆరిజ్, ఆయత్33]
3. నన్ను పరధ్యానం, నిర్లక్ష్యం గలవారిలో నిర్ధారించకు:
రమజాన్ మాసం యొక్క రెండవ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను మమ్మల్ని పరధ్యానం, నిర్లక్ష్యం గలవారిలో నిర్ధారించకు అని కోరుతున్నాము. పరధ్యానం మరియు నిర్లక్ష్యం ఘోరమైన ప్రమాధం, ఒక సమాజం లేదా ఒక సమూహం వీటికి గురి అయితే, వారు గందరగోళానికి లోనౌతారు, వారి మతపరమైన నైతికం దెబ్బతింటుంది దాంతో వారు తమ జీవితాన్ని చాలా సులువుగా పాపముల ద్వార నాశనం చేసుకుంటారు.
పరధ్యానం మరియు నిర్లక్ష్యం మాట మధ్యలో వస్తే ఎదురుకునే ప్రశ్న; మనిషి తన జీవితంలో దేని పట్ల పరధ్యానం మరియు నిర్లక్ష్యం కలిగి ఉంటాడు? దేని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు అన్న విషయం చాలా స్పష్టమైన విషయం; వాటి గురించి క్రింద సూచించబడి ఉంది:
1. అల్లాహ్ ఆరాధన మరియు ఆయన పట్ల తన దాసోహం విషయంలో నిర్లక్ష్యం
2. ప్రళయం మరియు నిత్యజీవితం పట్ల నిర్లక్ష్యం
3. పేదవారి మరియు నిస్సహాయుల సహాయం పట్ల నిర్లక్ష్యం
4. అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల నిర్లక్ష్యం
5. మన మత మరియు సమాజ పరమైన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం మొ...
పరధ్యానం మరియు నిర్లక్ష్యం యొక్క ఉత్తమ చికిత్స ఖుర్ఆన్ ఉపదేశాలనుసారం:
1. అల్లాహ్ స్మరణ [సూరయె కహఫ్, ఆయత్24]
2. ఖుర్ఆన్ పఠించడం [సూరయె ముద్దస్సిర్, ఆయత్54,55]
3. అనుగ్రహాలు మరియు వాటిని ప్రసాదించినవాడి స్మరణ [సూరయె జిన్, ఆయత్16,17]
4. గతించినవారి చరిత్ర గుణపాఠం [సూరయె తాహా, ఆయత్128]
5. మృత్యువు స్మరణ [సూరయె నిసా, ఆయత్78]
అల్లాహ్ మనకు తమ ఉత్తమ దాసులలో నిర్ధారించుగాక!     

రిఫరెన్స్
1. అల్ మిస్బాహుల్ కఫ్అమీ, పేజీ612
2. తఫ్సీరె నమూనహ్, భాగం1, పేజీ624
3. ఉయూను అఖ్బార్ అల్ రిజా(అ.స), భాగం1, పేజీ297
4. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం4, పేజీ87

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12