రమజాన్ మాసం యొక్క మూడవ రోజు దుఆ భావర్ధాలు

ఆది, 04/11/2021 - 04:48

ఓ అల్లాహ్! ఈ మాసంలో నాకు బుద్ధిని, జాగృతిని ప్రసాదించు. బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుండి దూరంగా ఉంచు...

రమజాన్ మాసం యొక్క మూడవ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క మూడవ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహుమ్మార్ జుఖ్ ని ఫీహిజ్ జెహ్న వత్తంబీహ్ వ బాయిద్నీ ఫీహి మినస్ సఫాహతి వత్తంవీహ్, వజ్ అల్లీ నసీబమ్ మిన్ కుల్లి ఖైరిన్ తున్ జిలు ఫీహి బి జూదిక యా అజ్వదల్ అజ్వదీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ మాసంలో నాకు బుద్ధిని, జాగృతిని ప్రసాదించు. బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుండి దూరంగా ఉంచు. ఓ ప్రసాదించడంలో ఉత్తముడా, నీ ఔదార్యం మరియు మహాత్మ్యము ద్వారా ఈ మాసంలో నీవు అవతరించే ప్రతీ మంచి నుండి నాకూ భాగం ప్రసాదించు.

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: బుద్ధి మరియు జాగృతి
రమజాన్ మాసం యొక్క మూడవ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను బుద్ధివివేకాలు మరియు జాగృతిని ప్రసాదించమని కోరుతున్నాము. అంటే మనిషి పరధ్యానం మరియు నిర్లక్ష్యంగా ఉండ కూడదు, నిత్యం బుద్ధివివేకాలను ఉపయోగించాలి, జాగృతి కలిగి ఉండాలి. ఈ దుఆ ద్వార వాటి విలువ తెలిసి వస్తుంది.
బుద్ధి మరియు జాగృతి, అమృతం లాంటివి, ఇస్లాం భాషలో దీనిని వివిధ రకాలుగా వివిధ సందర్భాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనినే బసీరత్ (అంతర్ దృష్టి) అంటారు. ఇమామ్ అలీ(అ.స) నెహ్జుల్ బలాగహ్ లో ఇలా ప్రవచించారు: “జాగృతి కాంతితో కళ్లు, చెవులు మరియు హృదయాన్ని కాంతిపజేశారు”[2]
మరో చోట ఇలా ఉపదేశించారు: “నీపై ఆపద వచ్చి పడుతుంది అన్న భయం రాత్రి నిన్ను నిద్ర నుంచి ఎందుకు లేపలేదు? నీవు అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు, పాపాలలో మునిగి ఉన్నావు, నీవు అల్లాహ్ అధికారంలో లేవా? అయితే నీ హృదయానికి పట్టిన పరధ్యానం మరియు నిర్లక్ష్య రోగాలను నీ గట్టి నిర్ణయం మరియు ఆలోచనతో చికిత్స చేయి. నీ కళ్లను మూసేసిన ఈ నిర్లక్ష్యాన్ని జాగృతితో తెరిచివేయి, అల్లాహ్ విధేయుడిగా మారు, ఆయన స్పరణతో పరిచయాన్ని పెంచుకో”[3]
పరధ్యానం మరియు నిర్లక్ష్యం ప్రాణాలను హరించే రోగం అని అల్లాహ్ ఖుర్ఆన్ లో చాలా ఆయతులలో సూచించెను: “ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయిన్నప్పటికీ వారు పరధ్యనంలో పడి, విముఖత చూపుతున్నారు. వారి వద్దకు వారి ప్రభువు తరపునుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు(ఆషామాషీగా తీసుకుంటారు). అసలు వారి హృదయాలు పరధ్యానంలో పడి ఉన్నాయి”[సూరయె అంబియా, ఆయత్1-3]

రెండవ అంశం:  బుద్దిహీనత, అజ్ఞానం మరియు తప్పుడు చర్యల నుంచి దూరం
రమజాన్ మాసం, మూడవ రోజు దుఆ యొక్క రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మనల్ని బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుంచి దూరంగా ఉంచమని వేడుకుంటున్నాము. కొంచెం దృష్టి పెట్టి చూసినట్లైతే ఇహపరలోకాల కష్టాలకు మూలకారణం అజ్ఞానమే అని తెలుస్తుంది; అందుకే అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలందరూ ఈ హానికరమైన అజ్ఞానం అనబడే రోగం నుండి విముక్తి పొందాలని జ్ఞానాన్ని పంచేవారు.
అజ్ఞానంలో ఉన్న చెడును దైవప్రవక్త(అ.స) ఇలా వివరించారు: “ఇహపరలోకాల మంచి జ్ఞానంతో పాటు ఉంది, ఇహపరలోకాల చెడు అజ్ఞానంతో పాటు ఉంది”[4]
మరో రివాయత్ లో ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “అజ్ఞానం అతి పెద్ద ఆపద”[5] మరో రివాయత్ లో వారు అజ్ఞానాన్ని చెడుకార్యములన్నీంటిని యొక్క మూలం అని సూచించారు.[6]

మూడవ అంశం: అత్యుత్తమ మంచి
ఇస్లాం శిక్షణాల ప్రకారం మంచి కి పలు అర్థాలు మరియు పలు ఉదాహారణాలు ఉన్నాయి. అవి:
1. జ్ఞానం మరియు విద్య: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “జ్ఞానం, మంచివాటన్నీంటికి మూలం మరియ అజ్ఞానం, చెడ్డవాటన్నీంటికి మూలం”[7]
2. మంచి నైతికం, మంచి స్వభావం: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “విశ్వాసునికి ప్రసాదించబడ్డ అత్యంత మంచి విషయం ఉత్తమ నైతికం, మనిషికి ప్రసాదించబడ్డ అత్యంత చెడు విషయం వికార హృదయం మరియు అందమైన ముఖం”[8]
నీ ఔదార్యం మరియు మహాత్మ్యము ద్వారా ఈ మాసంలో నీవు అవతరించే ప్రతీ మంచి నుండి మాకూ భాగాన్ని ప్రసాదించు. మా హృదయాలను ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్(అ.స) కాంతితో కాంతిపజేయి.

రిఫరెన్స్
1. ఇఖ్బాలుల్ ఆమాల్, భాగం1, పేజీ123
2. ఇర్షాదుల్ ఖులూబ్(తర్జుమా తబాతబాయి), భాగం68, పేజీ192
3. నెహ్జుల్ బలాగహ్,(సుబ్హీ సాలెహ్), పేజీ344
4. నెహ్జల్ ఫసాహ, పేజీ466
5,6. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ73
7. బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం74, పేజీ175
8. నెహ్జల్ ఫసాహ, పేజీ474, హదీస్1529

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7