రమజాన్ మాసం యొక్క 5వ రోజు దుఆ భావర్ధాలు

గురు, 04/15/2021 - 14:48

ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను క్షమాపణ కోరే మరియు అస్తగ్ఫార్ చేసే వారిలో నిర్ధారించు...

రమజాన్ మాసం యొక్క 5వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 5వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహు మ్మాజ్ అల్నీ ఫీహి మినల్ ముస్తగ్ ఫిరీన్, వజ్అల్నీ ఫీహి మిన్ ఇబాదికస్ సాలిహీనల్ ఖానితీన్, వజ్అల్ని ఫీహి మిన్ ఔలియాయికల్ ముఖర్రబీన్, బి ర’ఫతిక యా అర్ హమర్ రాహిమీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను క్షమాపణ కోరే మరియు అస్తగ్ఫార్ చేసే వారిలో నిర్ధారించు. నీ పట్ల సద్గుణ మరియు విధేయత కలిగి ఉన్న దాసులలో నిశ్చయించు. అలాగే నీ ఉత్తమత్వం ద్వార ఈ రోజు(నెల)లో నన్ను నీ సామిప్యం పొందిన ఔలియాలలో నిర్ధారించు, ఓ కరుణామయులలోనే ఉత్తమ కరుణామయుడా!   

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: క్షమించి అస్తగ్ఫార్ చేసే వారిలో నిర్ధారణ.
రమజాన్ మాసం యొక్క 5వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఈ రోజు(ఈ నెల)లో మమ్మల్ని క్షమాపణ కోరే మరియు అస్తగ్ఫార్ చేసే వారిలో నిర్ధారించమని వేడుకుంటున్నాము. అల్లాహ్ సమక్షంలో తౌబహ్ చేసి క్షమాభిక్ష కోరే వారికి ప్రముఖ స్థానం ఉంది. వారికోసం అనుగ్రహాలు కూడా ఉన్నాయి. ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించబడి ఉంది: “క్షమాపణకై మీ ప్రభవును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”[సూరయె నూహ్, ఆయత్10-12].
అల్లాహ్ ఈ ఆయతులలో ఆయన సన్నిధిలో తౌబహ్ చేసేవారికి ఐదు మంచి విషయాలు కలిపిస్తానని ప్రమాణాలు చేశాడు:
1. పాపముల పట్ల క్షమాభిక్ష ప్రసాదించబడుతుంది: “ إِنَّهُ كانَ غَفَّاراً”
2. ఆకాశ అనుగ్రహాలు ప్రసాదించబడతాయి: “ يُرْسِلِ السَّماءَ عَلَيْكُمْ مِدْراراً”  
3. సిరిసంబదలలో పురోభివృద్ధి: “ وَيُمْدِدْكُمْ بِأَمْوالٍ” 
4. పుత్ర సంతతిలో పురోభివృద్ధి: “ وَ يُمْدِدْكُمْ بِأَمْوالٍ وَ بَنينَ” 
5. ఇహపరలోకాల అభివృద్ధి: “ وَ يَجْعَلْ لَكُمْ جَنَّاتٍ وَ يَجْعَلْ لَكُمْ أَنْهاراً”     

రెండవ అంశం: సజ్జనత్వం కలిగివున్న దాసులలో మమ్మల్నీ నిర్ధారించు:
రమజాన్ మాసం, 5వ రోజు దుఆ యొక్క రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మమ్మల్ని సజ్జనత్వం మరియు విధేయత కలిగి ఉన్న దాసులలో నిశ్చయించు అని వేడుకుంటున్నాము.
సజ్జనులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి
అరబీ భాషలో సజ్జనుడు అనగా సాలెహ్ మరియు సజ్జనులు అనగా సాలెహీన్. ముస్లిములందరూ నిత్యం రోజుకు ఐదు సార్లు తమ నమాజును సజ్జనత్వం కలిగివున్న అల్లాహ్ యొక్క దాసులపై ఈ విధంగా “అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్” అని సలాములు పంపుతారు. మనం మని జీవితాన్ని ఇలాంటి దాసుల మాధిరి గడపాలి.
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క ఆలిఇమ్రాన్ సూరహ్ 113, 114 ఆయతులలో సజ్జనుల ప్రత్యేకతలను ఇలా వివరించెను: “వారంతా ఒకలాంటివారు కారు. ఈ గ్రంథవహులలో ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. అల్లాహ్ ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్113,114]
ఈ ఆయతుల ద్వార సజ్జనులు ఐదు ప్రత్యేకతలు కలిగివున్నారు:
1. అల్లాహ్ ఆరాధన మరియు ఆయన పట్ల దాసోహం,
2. అల్లాహ్ పట్ల విశ్వాసం,
3. ప్రళయదినం మరియు మరణానంతరం నిత్యజీవితం పట్ల విశ్వాసం కలిగివుండడం,
4. అమ్ర్ బిల్ మఅరూఫ్ వ నహ్యి అనిల్ మున్కర్(మంచి కార్యాల పట్ల ప్రోత్సాహం మరియు చెడు నుండి ఆపవేయడం),
5. మంచి చేయడంలో త్వరపడడం.
మూడవ అంశం: ఔలియాలకు ప్రసాదించబడ్డ సామిప్యం:
రమజాన్ మాసం, 5వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దాసుల(ఔలియా)కు ప్రసాదించబడ్డ సామిప్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము.
అల్లాహ్ సామిప్యం పొందిన వారు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?
1. ప్రజల మధ్య సంధి చేయిస్తారు, 2. చేసే కార్యంలో స్వచ్చతా మరియు నమ్మకం కలిగివుంటారు, 3. ఉత్తమ విశ్వాసం కలిగివుంటారు, 4. సత్యవంతులై వుంటారు, 5. ఉత్తమ నైతికం కలిగివుంటారు, 6. వినయవిధేయతలు కలిగి వుంటారు.

రిఫరెన్స్
https://btid.org/fa/news/94102

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7