రమజాన్ మాసం యొక్క 8వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 04/19/2021 - 10:57

తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు...

రమజాన్ మాసం యొక్క 8వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 8వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్, అల్లాహు మ్మార్ జుఖ్ నీ ఫీహి రహ్మతల్ ఐతామ్, వ ఇత్ఆమత్ తఆమ్, వ ఇఫ్ షాఅస్సలామ్, వ సొహ్బతల్ కిరామ్ బి తౌలిక యా మల్ జా అల్ ఆమిలీన్.
అనువాదం: ఓ అల్లాహ్! నీ  దీవెనతో, నాకు అనాధుల పట్ల ప్రేమా, భోజనం పెట్టే, బహిరంగంగా సలాము చేసే, దయాగుణం ఉన్నవారితో కలిసి కూర్చునే సామర్థ్యాన్ని ప్రసాదించు, ఓ అభిలాషుల ఆశ్రయమా!

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: అనాధుల పట్ల ప్రేమా, సహాయం చేసే భాగ్యం
రమజాన్ మాసం యొక్క 8వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను అనాధుల పట్ల ప్రేమా, సహాయం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఈ వాక్యాన్ని కొంచె దృష్టి పెట్టి చూసినట్లైతే ఇది ఒక దుఆ మరియు విన్నపానికి మించినది అని తెలుస్తుంది; ఎందుకంటే ఈ దుఆలో నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి అనాధులకు సహాయం మరియు వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం. ఇస్లాం అనాధుల గురించి చాలా తాకీదు చేస్తుంది, ఈ విషయంలో కొరత లేక నిర్లక్ష్యం చేస్తే అల్లాహ్ ఆగ్రహంతో పాటు పరలోక భయంకర శిక్ష కు గురి అయ్యే అవకాశం ఉంది.
ఇస్లాంలో అనాథాశ్రయం:
ప్రతీ మనిషి ఇతరుల నుండి గౌరవించబడాలని, ప్రేమించబడాలని భావిస్తాడు, ఇది మానవ స్వభావం. ఈ స్వభావం మనిషి యొక్క చిన్నతనంలో ఎక్కువగా ఉంటుంది, అదే చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే అలాంటి పిల్లలలో ఈ స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇస్లాం ఇలాంటి పిల్లల పట్ల మన బాధ్యతలను వివరించింది: “మీరు మీ ముకాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించేవారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం – ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే”[సూరయె బఖరహ్, ఆయత్177]
అనాధల పట్ల బాధ్యతారహితం:
అనాధల పట్ల బాధ్యతారహితంగా ఉండేవారి గురించి ఖుర్ఆన్ ఇలా  హెచ్చరిస్తొంది: “తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా!?, వీడే అనాధను గెంటివేసేవాడు[సూరయె మాఊన్, ఆయత్1,2]. అనాధల సొమ్ముతో కడుపు నింపుకునే వారి యొక్క పరిణామలను దైవగ్రంధం ఈ విధంగా ప్రస్థావిస్తుంది: “తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు”[సూరయె నిసా, ఆయత్10]
అనాధల పట్ల బాధ్యతగా ఉండడం:
అనాధల పట్ల బాధ్యతగా ఉండేవారి గురించి దైవప్రవక్త ఈ విధంగా ఉల్లేఖించారు: ఎవరైతే అనాధలను పోషించి వారి అవసరాలను తీరుస్తారో నేను మరియు ఆ అనాధ పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం, “అప్పుడాయన తన చూపుడు వ్రేలిని మరియు మధ్య వ్రేలిని కలిపి ఉంచి చూపించారు”(అంటే స్వర్గంలో ఇద్దరం ఒకే చోట ఉంటాము అని అర్ధం)[1]

రెండవ అంశం: ఉదారత్వాన్ని ప్రసాదించు:
ఇస్లాం విశ్వాసులకు భోజనం చేయించడం, వారికి వసతి కల్పించడం లాంటి విషయాల గురించి ఉపదేశిస్తుంది. ఇది మనుషులలో ప్రేమను పెంచుతుంది. ఇస్లాం ఇలాంటి స్వభావం కలిగి ఉన్న వారికి చాలా గౌరవిస్తుంది. హజ్రత్ అలీ ఇబ్నుల్ హుసైన్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “ఒక విశ్వాసి యొక్క ఆకలిని తీర్చినవాడికి అల్లాహ్ స్వర్గపు ఫలాలను తినిపిస్తాడు. ఒక విశ్వాసి యొక్క దాన్ని తీర్చినవాడికి అల్లాహ్ స్వర్గపు అమృతాన్ని ప్రేమతో త్రాగిస్తాడు”[2]

మూడవ అంశం: బహిరంగంగా సలాము చేయడం:
విశ్వాసులు ఒకరినొకరు కలిసినపుడు సలాములు తెలియపరుచుకుంటారు. దీన్ని పాటించేవారే ప్రళయదినాన దైవప్రవక్త(స.అ)కు అతి సమీప వ్యక్తులు అని రివాయతులు సూచిస్తున్నయి. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ప్రజలలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స.అ)కు అతి సామిప్యం కలిగి ఉన్న వారు, సలామ్ చేయడంలో త్వరపడినవాడు”[3]
దైవప్రవక్త(స.అ) నైతిక స్వభావం గురించి హదీస్ గ్రంథాలలో ఈ విధంగా ఉల్లేఖించబడి ఉంది: దైవప్రవక్త(స.అ) ఎదురుగా వచ్చేవారు, వారు పెద్దవారు కానివ్వండి లేదా పిల్లాడు కానివ్వండి, ధనికుడు కానివ్వండి లేదా పేదవాడు కానివ్వండి; వారే స్వయంగా సలాము చేసేవారు. వారు తన జీవితాన్ని చాలా తక్కువ ఖర్చుతో గడిపేవారు. వారు గొప్ప వ్యక్తిత్వం గలవారు. ప్రజలతో నవ్వుతు కలిసేవారు. వినయవిధేయతలు కలిగివుండేవారు. ముస్లిములందరి పట్ల ప్రేమగా ఉండేవారు[4]
నాలుగొవ అంశం: దయాగుణం ఉన్నవారితో కలిసి కూర్చోవడం:
కలిసి ఉండడం వల్ల అది మంచి మనిషితో కానివ్వండి లేదా చెడు మనిషితో కానివ్వండి వారి ప్రభావం మనపై పడుతుంది. అందుకనే ఇస్లాం మంచి వారితో కలిసి కూర్చోవడానికి ప్రోత్సాహిస్తుంది. రమజాన్ మాసం యొక్క 8వ రోజు దుఆలో మేము అల్లాహ్ ను దయాగుణం ఉన్నవారితో కలిసి కూర్చునే సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాము. ఇమామ్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించెను: “మంచి వారితో కలిసి బ్రతకండి, వారి మాధిరి అవ్వడానికి. చెడ్డవారి నుండి దూరంగా ఉండండి, వారిలా అవ్వకూడదని”[5]
అల్లాహ్ మనందరికి ఇస్లాం నైతికాన్ని ప్రసాదించుగాక!

రిఫరెన్స్
1. ఖుర్బుల్ అస్నాద్,పేజీ నం:45,సవాబుల్ ఆమాల్,పేజీ నం:237
2. అల్ కాఫీ, భాగం2, పేజీ201, హదీస్5
3. బిహారుల్ అన్వార్(తా-బీరూత్), భాగం73, పేజీ12, హదీస్50
4. ఇర్షాదుల్ ఖులూబ్(దైలమీ), భాగం1, పేజీ115
5. నెహ్జుల్ బలాగహ్,(సుబ్హీ సాలెహ్), నామా31, పేజీ402

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17