రమజాన్ మాసం యొక్క 10వ రోజు దుఆ భావర్ధాలు

శుక్ర, 04/23/2021 - 09:21

రమజాన్ మాసం యొక్క 10వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 10వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహు మ్మాజ్ అల్నీ ఫీహి మినల్ ముతవక్కిలీన అలైక్, వజ్ అల్నీ ఫీహి మినల్ ఫాయిజీన లదైక్, వజ్ అల్నీ ఫీహి మినల్ ముఖర్రబీన ఇలైక బి ఇహ్సానిక యా గాయతత్ తాలిబీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ అనుగ్రహం ద్వార, నన్ను నిన్నే నమ్ముకొని ఉన్నవారిలో నిర్ధారించు. నీ దృష్టిలో సాఫల్యము చెందువారిలో నిర్ధారించు. నీ సామిప్యం కలిగిఉన్నవారిలో నిర్ధారించు, ఓ పరిశోధకుల లక్ష్యం!.

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: అల్లాహ్ పట్ల నమ్మకం కలిగి ఉన్నవారిలో నిర్థారణ
రమజాన్ మాసం యొక్క 10వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఆయన అనుగ్రహం ద్వార, మమ్మల్ని నిన్నే నమ్ముకొని ఉన్నవారిలో నిర్ధారించని వేడుకుంటున్నాము. ముందుగా మనం ఈ దుఆలో ఉన్న “తవక్కుల్” పదానికి అర్థం తెలుసుకుందాం.
తవక్కుల్ అర్ధం:
తవక్కుల్ పదం వికాలత్ అనే పదం నుండి తీసుకోబడింది. ఖుర్ఆన్ మరియు హదీసులనుసారం; తవక్కుల్ అనగా అల్లాహ్ పై నమ్మకం మరియు భరోసా ఉంచడం, ఆయనను మన స్వామి మరియు వకీలుగా నిర్ధారించుకోవడం. తవక్కుల్ అనగా మనిషి తన అన్ని చర్యలలో అల్లాహ్ ను తన వకీల్ గా నిర్ధారించి, ఆయన పై నమ్మకం కలిగి ఉండాలి; ఎందుకంటే శక్తులన్నీంటిలో అల్లాహ్ వి కాబట్టి కేవలం ఆయన మాత్రమే ప్రభావం చూపించడగలడు.[1]
తవక్కుల్ యొక్క అర్థాన్ని స్పష్టంగా వివరిస్తున్న దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) జిబ్రయీల్(అ.స)ను “తవక్కుల్ అనగానేమి?” అని ప్రశ్నించారు. జిబ్రయీల్ ఇలా సమాధానమిచ్చారు: “ఈ విధంగా జ్ఞానం కలిగివుండడం; సృష్టితాలు లాభనష్టాలు కలిపించలేరు, దేన్ని ప్రసాదించలేరు మరియు దేని నుండి దూరం చేయలేరు (అంటే) సృష్టితాల పట్ల నిరాశ చెందడం. ఎప్పుడైతే ఒక దాసుడు ఇలా ఆలోచిస్తాడో, అప్పుడు అల్లాహ్ తప్ప మరెవ్వరి కోసం పని చేయడు, అల్లాహ్ తప్ప మరొకరి పై నమ్మకం ఉంచడు, ఇతరులను లెక్క చేయడు, కేవలం ఆయనను మాత్రమే ఆశిస్తాడు, మరొకరిని తన హృదయంలో చోటివ్వడు. ఇది నిజమైన తవక్కుల్ కు అర్థం”[2]
తవక్కుల్ యొక్క హద్దు:
అబూబసీర్(ర) ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ద్వార రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా అన్నారు: “ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది” నేను “స్వామీ! అల్లాహ్ పట్ల తవక్కుల్(నమ్మకం) కలిగి ఉండడం కు హద్దేమిటి?” అని ప్రశ్నించాను. వారు “యఖీన్”(నిశ్చయత) అని సమాధానమిచ్చారు. యఖీన్ యొక్క హద్దేమిటి? అని ప్రశ్నించాను. దానికి ఇమామ్ “అల్లాహ్ కు తప్ప మరెవ్వరితో భయపడకుండా ఉండడం” అని సమాధానం ఇచ్చారు.[3] ఒకవేళ మనిషి యొక్క యఖీన్ పరిపూర్ణ స్థితిలో ఉంటే అల్లాహ్ పై పూర్తి తవక్కుల్ కలిగి ఉండవచ్చు.

రెండవ అంశం: సాఫల్యము చెందువారిలో నిర్ధారణ
రమజాన్ మాసం యొక్క 9వ రోజు దుఆలో రెండవ వాక్యంలో అల్లాహ్ ను ఆయన దృష్టిలో సాఫల్యము చెందువారిలో మమ్మల్ని నిర్ధారించమని వేడుకుంటున్నాము. నిజమైన సాఫల్యం పొందడం కోసం ప్రాపంచిక చర్యలను అల్లాహ్ ఆదేశాలకు అనుకూలంగా అమలు పరచాలి. అమలు తో పాటు అల్లాహ్ ను వేడుకుంటూ ఉండటం కూడా చాలా అవసరం. ఖుర్ఆన్ యొక్క సూరయె బఖరహ్ లో ఇలా ఉంది: ప్రజల్లోనే మరికొందరు, “ప్రభూ! మాకు ప్రపంచలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు” అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు.[సూరయె బఖరహ్, ఆయత్201,202]

మూడవ అంశం: సామిప్యం కలిగిఉన్నవారిలో నిర్ధారణ
అల్లాహ్ సామిప్యం కలిగివున్న వారు ఎవరు?
1. ప్రజల మధ్య సంధి చేయువారు, 2. ఆజ్ఞ పాలనలో స్వచ్చత మరియు నమ్మకం కలిగివున్నవారు, 3. ఈమాన్ మరియు మంచి విశ్వాసం కలిగి ఉన్నవారు, 4. సత్యవతులు, 5. అత్యుత్తమ నైతికం కలిగివుండేవారు, 6. వినయవిధేయతలు కలిగివున్నవారు.[4]

రిఫరెన్స్
1. ఫర్ హంగె సిపాత్, అబా ఇస్మాయిలీ యజ్దీ, పేజీ301
2. బిహారుల్ అన్వార్, భాగం68, పేజీ138, హదీస్23
3. అల్ కాఫీ, భాగం2, పేజీ57
4. పలు హదీసుల ఆధారంగా ఈ అంశాలు సంక్షిప్తంగా చెప్పబడ్డాయి

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10