రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 04/26/2021 - 07:08

రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: అల్లాహుమ్మ లా తుఆఖిజ్నీ ఫీహి బిల్ అసరాత్, వ అఖిల్నీ ఫిహి మినల్ ఖతాయా వల్ హఫవాత్, వలా తజ్అల్నీ ఫీహి గరజన్ లిల్ బలాయ వల్ ఆఫాత్, బి ఇజ్జతిక యా ఇజ్జల్ ముస్లిమీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నేను చేసిన పొరపాటుల పై నన్ను శిక్షించకు. నా తప్పుల మరియు పొరపాటుల పట్ల నా నుండి క్షమాపణను అంగీకరించు. నేను నీ గౌరవాన్ని ఆశ్రయించి (కోరుతున్నాను) నన్ను ఆపద మరియు కష్టం యొక్క బాణపు గురికి గురిచేయకు, ఓ ముస్లిములకు గౌరవాన్ని ప్రసాదించేవాడా!

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్! నన్ను శిక్షించకు
రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను మేము చేసిన పొరపాటుల పై మమ్మల్ని శిక్షించకు అని వేడుకుంటున్నాము. నిజానికి ఈ దుఆ చేయువాడు పరలోక శిక్ష పట్ల భయం కలిగిఉన్నాడు, అందుకనే తన పొరపాట్లను ఉద్దేశించి అల్లాహ్ ను శిక్షించ వద్దనీ వేడుకుంటున్నాడు మరియు అతడికి అల్లాహ్ యొక్క కారుణ్యం పై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటున్నాడు. ఇలాకాకుండా ఉండి ఉంటే మాలో దుఆ చేసే కోరికే ఉండేది కాదు. అయినప్పటికీ కొందరు పాపకార్యములు ఒడిగట్టడానికి కారణం ఖుర్ఆన్ యొక్క సూచనల పట్ల పరధ్యానం కలిగి ఉండడం. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “మా ఆయతులు బోధించబడినప్పుడు సజ్దాలో పడిపోయేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతకు కొనియాడేవారు, గర్వపడనివారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు. వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చుపెడతారు”[సూరయె సజ్‌దహ్, ఆయత్15,16]
నైతిక జ్ఞాన పండితులు ఇలా చెబుతారు: అల్లాహ్ పట్ల భయం మరియు ఆశ, విశ్వాసికి పరిపూర్ణతకు రెండు రెక్కలు లాంటివి. ఎలాగైతే పక్షులు రెండు రెక్కలు సమతూల్యతతో ఉండడం వల్ల ఎగురుతాయో అదే విధంగా విశ్వాసి కూడా తన భయం మరియు ఆశ అనే రెక్కల ద్వార అల్లాహ్ కు చేరగలడు. మరో ఆయత్ లో ఇలా ప్రవచించబడి ఉంది: “ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కట్టేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్నిగ్రహిస్తారు”[సూరయె జుమర్, ఆయత్9]

రెండవ అంశం: ఓ అల్లాహ్! నేను తప్పు చేశాను నన్ను క్షమించు
రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆలో రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మేము చేసిన తప్పుల మరియు పొరపాట్ల పట్ల మా నుండి క్షమాపణను అంగీకరించు అని వేడుకుంటున్నాము. తౌబహ్ మరియు ఇస్తిగ్ఫార్ లలో ఉండవలసిన అతి ముఖ్య విషయం దాసుడు తాను చేసిన తప్పుల పట్ల చింతించడం, అల్లాహ్ ముందు బిడియాన్ని కలిగి వుండడం. అంతేకాకుండా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెంది ఉండడం, అతి పెద్ద పాపం. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: (ఓ ప్రవక్తా! నా తరపున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు”[సూరయె జుమర్, ఆయత్53]

మూడవ అంశం: ఓ అల్లాహ్! నన్ను ఆపద మరియు కష్టం యొక్క బాణాలకు గురిచేయకు
మనిషి చాలా బలహీనుడు, చిన్న చిన్న కష్టాల పట్ల సహనంగా ఉండలేడు, దాసుడికి కలిగే కష్టాలు మరియు ఆపదలు చెడ్డవి కావు ఎందుకంటే నిజానికి అవి దాసుడిని సరిదిద్దుతాయి మరియు అల్లాహ్ వద్దకు చేరేందుకు సహాయపడే స్థానాలు పొందడానికి సహాయపడతాయి, అయిన్నప్పటికీ దుఆ విషయంలో పెద్ద పెద్ద ఔలియాలు మరియు గొప్ప గొప్ప వ్యక్తులు ఆపదలలో అల్లాహ్ ను వేడుకోవడాన్ని చూశాము.

రిఫరెన్స్
అల్ ఇఖ్లాల్ బిల్ అఅమాలిల్ హసనహ్ (తా-అల్ హదీసహ్), బాగం1, పేజీ288
https://btid.org/fa/news/94747

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8