రమజాన్ మాసం యొక్క 15వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 04/26/2021 - 14:32

రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 15వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 14వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: అల్లాహుమ్మర్ జుఖ్నీ ఫీహి తాఅతల్ ఖాషియీన్, వష్రహ్ ఫీహి సద్రీ బి ఇనాబతిల్ ముఖ్ బితీన్, బి అమానిక యా అమానల్ ఖాయిఫీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో వినయవిధేయతలు కలిగి ఉన్న దాసుల మాదిరి విధేయతను నా భాగ్యంగా చేయి. నీ శరణు ద్వార నా హృదయాన్ని ధర్మనిష్ఠకలిగి ఉన్నవారి విధేయత మాదిరి విశాలంగా మార్చు, ఓ భయభక్తులుగల వారి యొక్క శరణు!

దుఆ వివరణ:
“ఖుషూ”(అణుకువ): ఖుషూ ఒక స్థితిని ఉద్దేశానికి ప్రతీక. అది రెండు భావనలతో కూడి ఉంటుంది. అల్లాహ్ యొక్క గొప్పతనం, ఆయన సార్వభౌమత్వం మరియు దాసుడి బలహీనతా, అల్పతనాల భావన. అల్లాహ్ దృష్టిలో నమాజులో అణుకువ కలిగి ఉన్న విశ్వాసులు సాఫల్యం పొందుతారు.[1]
అణుకువ, ఆరాధనకు ప్రాణం లాంటిది. అణుకువ లేని ఆరాధన, ప్రాణం లేని హస్తిపంజరం లాంటిది. అణుకువతో ఉన్న హృదయం అల్లాహ్ గృహం. నమాజ్ లో అణుకువగా ఉండడం అల్లాహ్ సన్నిధిలో ఉన్నామన్న ఆలోచనకు నిదర్శనం.
ఒక హృదయంలో ఎంతమంది ఉండగలరు, ఎంతమందిని ఒకేసారి ప్రేమించగలము? నిజమైన ప్రేమ ఒక్కటే అది అల్లాహ్ పట్ల ప్రేమ.
షర్హె సద్ర్:
అల్లాహ్ ను షర్హె సద్ర్ ప్రసాదించమని ఈ రోజు దుఆ యొక్క రెండవ వాక్యంలో వేడుకుంటున్నాము. ఈ షర్హె సద్ర్ అనగానేమి? షర్హె అనగా విశాలహృదయం. ఇది కూడా మనిషి యొక్క భావన మరియు స్వభావానికి సంబంధించిన స్థితి. ఈ స్థితి సాటిలేని విశ్వాసం, సంపూర్ణ నమ్మకం, ప్రజల పై ఆధారపడకుండా ఉండడం, సహన అగ్రస్థానం, ఆలోచన పటిష్ఠత, ఉత్తమ ఆశ లాంటి వాటి నుండి సొంతమౌతుంది.
షర్హె సద్ర్ కలిగి ఉన్నవాడికి భయం గాని నిరాశ గాని కలిగి ఉండడు. కష్టాలలో విచ్చిన్నానికి గురికాడు, ఆపదల సముద్రాలలో మునిగిపోడు, దుఖ్ఖం అతడి హృదయం పై దాడి చేయలేదు, ఇష్టం లేని విషయాలు అతడి నిర్ణయాలను బలహీనతకు గురి చేయవు, అపజయాలు అతడిని నిరాశపరచవు, సహాయం చేయువారి తక్కువ సంఖ్య అతడికి బాధకలిపించదు, శత్రువుల మిక్కిలి సంఖ్య అతడికి భయపెట్టదు.
విశ్వాసం, సత్కార్యాలు, విధేయత మరియు ఆరాధనలు హృదయాన్ని విశాలం చేస్తాయి, మనశాంతి కలుగుతుంది. అదే పాపాలు చేస్తే హృదయం పై ఒత్తిడి పెరుగుతుంది. ఆ పాపముల ఒత్తిడి, మనిషి దృష్టిలో ప్రపంచాన్ని ఇరుకు మరియు చీకటిగా చేస్తుంది. పాపాత్ములకు ఈ ప్రపంచం ఇరుకుగా మారుతుంది అని ఖుర్ఆన్ లో పటుల చోట్లు ప్రవచించబడి ఉంది; ఉదాహారణకు హజ్రత్ యూసుఫ్(అ.స) పట్ల చేసిన చర్య విషయంలో వారి సోదరుల స్థితి, అలాగే దైవప్రవక్త(స.అ) కాలంలో జిహాద్ కు వెళ్లకుండా పట్టణంలోనే ఉండిపోయిన ముగ్గురు వ్యక్తులు. వీరు గురించి గుర్ఆన్ ఇలా సూచించెను: “భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ పట్టు నుంచి తమను కాపాడుకోవటానికి ఆయన వైపుకు మరలటం తప్ప మార్గాంతరం లేదుని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఆ విధంగా మరలి వచ్చేటందుకుగాను అల్లాహ్ వారి వైపుకు మరలాడు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడూను”[సూరయె తౌబహ్, ఆయత్118]
హృదయాన్ని ఇరుకుగా గ్రహించేవాడు తప్పకుండా తౌబహ్ మరియు ఇస్తిగ్ఫార్ ద్వార షర్హె సద్ర్ ను పొందె అవకాశం ఉంది.
యా అమానల్ ఖాయిఫీన్: ఓ భయభక్తులుగల వారి యొక్క శరణు!
ఆయతులలో, దుఆలలో, మునాజాతులలో, జౌషనె కబీర్ మొదలగు దుఆలలో అల్లాహ్ ను “అమానల్ ఖాయిఫీన్” గానే గుర్తు చేయబడి ఉంది. అల్లాహ్ యే భయానికి గురి అయిన హృదయాల శరణు, దుఖ్కాలకుక గురి అయిన వారికి ఆశరా. మార్గం లేని వారికి మార్గం, అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, మనశాంతి కలిపించేవాడు, మన సంరక్షకుడు...

రిఫరెన్స్
1. قَد أفلَحَ المُؤمِنُونَ، الّذينَ هُم فى صَلاتِهِم خاشِعُونَ
https://btid.org/fa/news/94893

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9