రమజాన్ మాసం యొక్క 16వ రోజు దుఆ భావర్ధాలు

మంగళ, 04/27/2021 - 09:34

రమజాన్ మాసం యొక్క 16వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 16వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మా వఫ్పిఖ్ ని ఫీహి లి మువాఫఖతిల్ అబ్రార్, వ జన్నిబ్ ని ఫీహి మురాఫఖతల్ అష్రార్, వ ఆవినీ ఫీహె బి రహ్మతిక ఇలా దారిల్ ఖారార్, బి ఇలాహియతిక యా ఇలాహల్ ఆలామీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నన్ను సజ్జనులతో పాటు కలిసిఉండే విధంగా అనుగ్రహించు. నన్ను చెడ్డవారి స్నేహం నుండి కాపాడు. నీ దయ ద్వార, నీ ఆరాధన ఆశ్రయంగా నాకు శాంతినిలయం(స్వర్గం)లో స్థానాన్ని ప్రసాదించు, ఓ సర్వలోకాల చేత ఆరాదించుబడేవాడా!

ఈ దుఆ ద్వార మనం అల్లాహ్ ను వేడుకునే అంశాల వివరణ:
మొదటి అంశం: సజ్జనులతో సహవాసం
రమజాన్ మాసం యొక్క 16వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు మమ్మల్ని సజ్జనులతో పాటు కలిసిఉండే విధంగా అనుగ్రహించు అని వేడుకుంటున్నాము. ఈ దుఆ యొక్క మొదటి వాక్యంలో ఉన్న సజ్జనులు(అబ్రార్) ఎవరు? మరియు వారు కలిగివున్న ప్రత్యేకతలేమిటి?
అబ్రార్(సజ్జనులు) ఎవరు?
అబ్రార్ పదం, అరబీ పదం. దాని అర్థం సజ్జనులు, మంచివారు మరియు సత్కార్యములు చేయువారు అని[2]. వీరు విశ్వాసపరంగా అగ్ర స్థానంలో ఉన్నవారు, స్థాయి పరంగా ఊలుల్ అల్బాబ్(వివేకులు)కు ఎక్కువ మరియు ముఖర్రబాన్(అల్లాహ్ కు అతి సామిప్యం కలిగివున్నవారు)కు తక్కువ. ఖుర్ఆన్ లో వారి గురించి చాలా సార్లు సూచించబడి ఉంది: “నిశ్చయంగా సజ్జనులు(విశ్వాసులు) .కాఫూర్. కలుపబడిన మధు పాత్రలను సేవిస్తారు” [సూరయె ఇన్సాన్, ఆయత్5]
ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు, అబ్రార్ పదానికి వివిధ రకాలుగా నిర్వచించారు. ఉదా; అల్లాహ్ పట్ల సంపూర్ణ విధేయత చూపి ఆయనను సంతోషపరిచేవాడు[3] పాపాములకు దూరంగా ఉండేవారు[4] అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ప్రళయదినం పై విశ్వాసం కలిగివుండేవారు[5] తమ విశ్వాసంలో సత్యవంతులైన విశ్వాసులు[6] కేవలం అల్లాహ్ కోసం మాత్రమే సత్కార్యములు చేయు మంచివారు[7] కొందరు సూరయె ఆలెఇమ్రాన్ యొక్క 193వ ఆయత్ యొక్క వ్యాఖ్యానం లో అబ్రార్ అనగా దైవప్రవక్తలు మరియు ఔలియాలు అని వ్యాఖ్యానించారు.[8]

అబ్రార్ యొక్క సంకేతాలు:
1. తమ మొక్కుబడులను చెల్లించడం: ఖుర్ఆన్: “వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్7]
2. ప్రళయదినం పట్ల భయం కలిగి ఉండడం: ఖుర్ఆన్: “ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్7]
3. నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు: ఖుర్ఆన్: “అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు”[సూరయె ఇన్సాన్, ఆయత్8]
4. అల్లాహ్ ప్రసన్నత: ఖుర్ఆన్: “పైగా వారిలా అంటారు.. మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, ధన్యవాదాలనుగానీ ఆశించటం లేదు”[సూరయె ఇన్సాన్, ఆయత్9]
5. అంతిమదినాన అల్లాహ్ పట్ల భయం: ఖుర్ఆన్: “నిశ్చయంగా మేము మా ప్రభువు తరపున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము”[సూరయె ఇన్సాన్, ఆయత్10]
చెప్పబడిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణం లేకపోయిన అబ్రార్(సజ్జనుల) స్థానం పొందకపోవచ్చు.

రెండవ అంశం: ఓ అల్లాహ్! నేను తప్పు చేశాను నన్ను క్షమించు
రమజాన్ మాసం యొక్క 16వ రోజు దుఆలో రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మనల్ని చెడ్డవారి సహవాసం నుండి కాపాడు అని వేడుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం దీనిని పట్టించుకోకపోతే ఇదే మనకు నరకానికి తీసుకెళ్తుంది. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త(స.అ) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుండేది!. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది! నా వద్దకు ఉపదేశం వచ్చన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే![సూరయె ఫుర్ఖాన్, ఆయత్27-29]
ఇస్లాం స్నేహం మరియు స్నేహితుడి ఎన్నిక విషయంలో చాలా సూచనలు వెల్లడించింది. ఎవరితో స్నేహం చేయాలి మరియు ఎవరితో స్నేహం చేయకూడదు, స్నేహానికి హద్దులేమిటి, స్ర్నేహితులతో ఎలా ఉండాలి, వారి పట్ల మన బాధ్యతలేమిటి, వీటంన్నీంటిని వివరిస్తూ ఎన్నో ఆయతులు మరియు రివాయతులు ఉన్నాయి.[9]

మూడవ అంశం: ఈ దుఆ చివరి అంశంలో అల్లాహ్ ను ఆయన దయతో, ఆయన ఆరాధన ఆశ్రయంగా నాకు శాంతినిలయం(స్వర్గం)లో స్థానాన్ని ప్రసాదించు, ఓ సర్వలోకాల చేత ఆరాదించుబడేవాడా! అని వేడుకుంటున్నాము.
ఈ లోకాన్ని కూడా ప్రతీ మనిషి తమ మంచి స్వభావంతో శాంతి నిలయంగా మార్చగలడు. ఈ దుఆలో మాత్రం శాంతినిలయం అనగా స్వర్గం అనే అర్థం. ఎందుకంటే అక్కడ జీవితానికి అంతం లేదు మరియు ఎటువంటి కష్టం ఉండదు.  

రిఫరెన్స్
1. జాదుల్ మఆద్ – మఫాతీహుల్ జినాన్, పేజీ145
2. ఖామూసె ఖుర్ఆన్, భాగం1, పేజీ180. ఫర్‌గంగె మొయీన్, మద్ఖలె అబ్రార్. ఫర్‌హంగె అబ్ జద్, అరబీ-ఫార్సీ, పేజీ180
3. జామెఉల్ బయాన్, మజ్3, భాగం3, పేజీ282. మజ్మవుల్ బయాన్, భాగం2, పేజీ908. అల్ తిబ్యాన్, భాగం3, పేజీ85
4. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ406
5. అల్ మీజాన్, భాగం20, పేజీ124
6. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ318
7. అల్ తిబ్యాన్, భాగం10, పేజీ302
8. కష్ఫుల్ అస్రార్, భాగం10, పేజీ388
9. తఫ్సీరె నూర్, భాగం8, పేజీ244

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12