రమజాన్ మాసం యొక్క 17వ రోజు దుఆ భావర్ధాలు

గురు, 04/29/2021 - 20:32

రమజాన్ మాసం యొక్క 17వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 17వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 17వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: అల్లాహుమ్మహ్ దినీ ఫీహి లి సాలిహిల్ అ’మాల్, వఖ్ జి లీ ఫీహిల్ హవాయిజ వల్ ఆమాల్, యా మన్ లా యహ్తాజు ఇలత్ తఫ్సీరి వస్ సువాల్, యా ఆలిమమ్ బిమా ఫీ సుదూరిల్ ఆలమీన్, సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలిహిత్ తాహిరీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో మంచి పనుల వైపుకు హిదాయత్ చేయి. నా అవసరాలను మరియు నా కోరికలను నెలవేర్చు, ఓ పరిచయం మరియు పశ్నించడం అవసరం లేనివాడా! తన సృష్టితాల హృదయాలలో ఉన్న రహస్యాలు తెలిసినవాడా! ముహమ్మద్[స.అ] మరియు వారి పవిత్ర అహ్లెబైత్[అ.స] పై దురూద్ ను అవతరింపజేయి.

దుఆ వివరణ:
మొదటి అంశం: సత్కార్యములు చేసే సమర్థత ప్రార్ధన
రమజాన్ మాసం యొక్క 17వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజున సత్కార్యములు చేసే విధంగా తీర్చిదిద్దు అని వేడుకుంటున్నాము.
సత్కార్యం అనగానేమి?
సత్కార్యం ఇది అరబీ పదం అయిన “అమలె సాలెహ్” యొక్క తెలుగు అనువాదం.
“సాలెహాత్” అనగా మంచి కార్యములు, మేలైన చర్యలు, లాభకరమైన చర్యలు, ప్రభావితమైన చర్యలు మొ..
ప్రతీ మంచి పని సాలెహ్ చర్య కాదు. అమలె సాలెహ్ అనగా దాని ద్వార సమాజానికి పరిపూర్ణతకు చేరేందుకు తయారు చేసే పని అయి ఉండాలి.
సత్కార్యం(అమలె సాలెహ్) యొక్క కొన్ని ప్రాముఖ్యతలు:
1. ఈమాన్ నుంచి వేరు అయి ఉండదు
2. చేసే పని, పూర్తి బుద్ధివివేకాలతో, తెలుసుకొని చేయాలి
3. ఆలోచనలో అల్లాహ్ కోసం మరియు ఆయన సామిప్యం కోసం అనే భావన కలిగివుంటుంది
4. ప్రభావితమై ఉంటుంది, దాంట్లో వ్యర్ధం ఉండదు
5. చేసేవాడి స్థోమతను బట్టి ఉంటుంది
6. సమయానికి బట్టి చేసే చర్య విలువ ఉంటుంది
7. సమాజం కోరకు మరియు అల్లాహ్ తత్వం అందులో ఉంటుంది, అంటే స్వయప్రీతం కోసం చేయకూడదు అల్లాహ్ కోసం చేయాలి
ఇస్లాం సమర్థించే సత్కార్యం; దాని లాభాలతో పాటు సత్కార్యం చేసేవాడి ఆలోచనను అతడి లక్ష్యాన్ని కూడా చూస్తుంది. అతడి చర్య అల్లాహ్ కోసం అయి ఉంటేనే ఆ చర్యకు విలువ మరియు అదే అమలె సాలెహ్ అయ్యే అర్హత పొందుతుంది.

రెండవ అంశం: ఓ అల్లాహ్! అవసరాలను మరియు కోరికలను నెలవేర్చు
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మా అవసరాలను మరియు కోరికలను నెలవేర్చమని వేడుకుంటున్నాము.

దుఆ యొక్క చివరి అంశాలలో అల్లాహ్ యొక్క రెండు లక్షణాల గురించి ఉంది.
“ఓ పరిచయం మరియు పశ్నించడం అవసరం లేనివాడా!” మనం చెప్పకపోయినా అన్నీ తెలిసినవాడే అల్లాహ్, అంతేకాకుండా మన హృదయాలలో ఉన్న రహస్యాలు తెలిసినవాడు ఆ అల్లాహ్.
దుఆ చేయడం మరియు అల్లాహ్ ను కోరేటప్పుడు నోటితో చెప్పడం అవసరం లేదు, కాని నోటితో వేడుకోవడం మంచిది.
అల్లాహ్ ఎంత దయామయుడంటే ప్రశ్నించే అవసరమే లేదు. వివరణ ఆయనకు అనవసరం.
యదర్థామేమిటంటే అల్లాహ్ మార్గంలో అల్లాహ్ విలాయత్ కాంతిలో నిర్ధారించబడి ఉండాలి అప్పుడు మన చర్యలు అల్లాహ్ మార్గంలో ఉంటాయి.

రిఫరెన్స్
https://btid.org/fa/news/94981

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20