రమజాన్ మాసం యొక్క 18వ రోజు దుఆ భావర్ధాలు

శుక్ర, 04/30/2021 - 19:17

రమజాన్ మాసం యొక్క 18వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 18వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 18వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:

దుఆ: అల్లాహుమ్మ నబ్బిహ్ నీ ఫీహి లి బరకాతి అస్ హారిహ్, వ నవ్విర్ ఫీహి ఖల్బీ బి జియాయె అన్వారిహ్, వ ఖుజ్ బి కుల్లి ఆజాయీ ఇల త్తిబాయి ఆసారిహ్, బి నూరిక యా మునవ్విర ఖులూబిల్ ఆరిఫీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో దీని ఉదయం(సహర్) యొక్క శుభాల గురించి తెలియపరుచు. దాని కాంతి ద్వార నా హృదయాన్ని కాంతింపజేయి. నీ కాంతి ద్వార నా శరీర భాగాలను, దాని ఆచరణ యొక్క శుభల ఆధీనంలో తీసుకో, ఓ మాహాత్ముల హృదయాలను కాంతింపజేయువాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: రమజాన్ మాసం ఉదయం(సహర్) యొక్క శుభాలు
రమజాన్ మాసం యొక్క 18వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! రమజాన్ మాసం ఉదయం(సహర్) యొక్క శుభాల గురించి తెలియపరుచు అని వేడుకుంటున్నాము. ఇస్లాం బొధనల ప్రకారం తెల్లవారుజాముకు ప్రత్యేక స్థానం ఉంది, ఆ సమయంలో చదవవలసిన దుఆలు ప్రత్యేకంగా రచించబడి ఉన్నాయి అలాగే నాఫెలహ్ నమాజులూ, ఇవన్నీ మానవుని నైతిక శిక్షణలో ఆ సమయం యొక్క ప్రాముఖ్యతపై నిదర్శనం.

రాత్రి అల్లాహ్ స్మరణకై జాగరణ:
తహజ్జుద్ నమాజ్ ప్రాముఖ్యత ఉలమాల దృష్టిలో
ఆఖుంద్ మొల్లా హుసైన్ ఖులీ హమెదానీ(ర.అ) ఉల్లేఖనం: “పరలోక కాంక్ష కలిగివున్న వారిలో ఏ ఒక్కరు గొప్ప స్థానానికి చేరలేదు తహజ్జుద్ నమాజ్ చదివేవారు మరియు ఆరాధనలో రాత్రి గడిపేవారు తప్ప”[2] నజఫ్ లో ఒక మద్రసాలో నిలబడివుండగా మర్హూమ్ ఖాజీ(ర.అ) అల్లామా తబాతబాయి(ర.అ) భూజం పై చేయి వేసి ఇలా అన్నారు: “బాబూ! ప్రపంచాన్ని పొందాలనుకుంటే నమాజె షబ్ (తహజ్జుద్) చదువు., పరలోకం కావాలంటే (కూడా) నమాజె షబ్ చదువు”[3]
ఖుర్ఆన్ ఉపదేశం: “నిశ్చయంగా భక్తిపరులు మాత్రం ఉద్యానవనాల, ఊటల మధ్య ఉంటారు. తమ ప్రభువు తమకు ప్రసాదించిన దాన్ని గ్రహిస్తూ ఉంటారు. వారు అంతకుముందు సదాచార సంపన్నులుగా ఉండేవారు. వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి గడియలలో క్షమాపణకై (అల్లాహ్ ను) వేడుకునేవారు. వారి ధనంలో యాచించేవారికి, యాచించని పేదవారికి కూడా హక్కుండేది”[సూరయె జారియాత్, ఆయత్15-19]
మరో చోట ఇలా ఉపదేశించబడి ఉంది: “వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు”[సూరయె సజ్‌దహ్, ఆయత్16,17] మరో ఆయత్ లో ఇలా ఉంది: “వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్17] మరోచోట ఇలా ఉంది: “రాత్రిపూట కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరి నక్షత్రాలు వెను తిరిగే వేళ కూడా”[సూరయె తూర్, ఆయత్49]

రెండవ అంశం: సహర్ కాంతి ద్వార నా హృదయాన్ని కాంతింపజేయి
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను సహర్ కాంతి ద్వార మన హృదయాలను కాంతింపజేయి అని వేడుకుంటున్నాము. ఇస్లాం బోధనలనుసారం హృదయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆత్మకు సంబంధించిన కార్యములన్నీంటిని ఆ హృదయానికి ఆపాదించబడతాయి. ఉదాహారణకు., విశ్వాసం, అవిశ్వాసం, కపటం, ఆలోచన, తర్కం, అంగీకరణ, యదార్థం, రుజుమార్గం, మార్గభ్రష్టత, పవిత్రత, మనశాంతి మొ...[4] మనిషి జీవితం అతడి హృదయం మరియు ఆత్మతో ముడిపడి ఉంటుంది. మనిషి యొక్క మంచి చెడు స్వభావాలు హృదయం యొక్క ఆరోగ్యం మరియు ప్రకాశం ఆధారపడి ఉంటుంది. సహర్ ఆరాధనలు హృదయాన్ని జీవం పోస్తాయి.[5]
చివరి అంశాలు: నీ కాంతి ద్వార నా శరీర భాగాలను, దాని ఆచరణ యొక్క శుభల ఆధీనంలో తీసుకో, ఓ మాహాత్ముల హృదయాలను కాంతింపజేయువాడా!. శరీర భాగాలు తమ తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించాలంటే ధర్మనిష్ట తప్ప మరో మార్గం లేదు.[6]

రిఫరెన్స్
1. ఇఖ్లాలుల్ ఆమాల (తా-అల్ ఖదీమహ్) భాగం1, పేజీ166
2. మలికీ, తబ్రేజీ, మీర్జా జవాద్ ఆగా, పేజీ462, 463
3. తహ్రానీ, సయ్యద్ ముహమ్మద్ హుసైన్ హుసైనీ, మెహ్రె తాబాన్, అల్లామా తబాతబాయి, మష్హద్, 1423ఖ, పేజీ26
4. రహ్ తూషయె రాహియానె నూర్, వీజె మాహె రమజాన్, 1381ష, పేజీ166
5. ఇఖ్లాలుల్ ఆమాల (తా-అల్ ఖదీమహ్) భాగం1, పేజీ166
6. సీనాయె నియాజ్, జవాద్ ముహద్దిసీ
https://btid.org/fa/news/95006

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17