రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆ భావర్ధాలు

ఆది, 05/02/2021 - 18:04

రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహుమ్మఫ్ తహ్‌లీ ఫీహి అబ్వాబల్ జినాని వ అగ్లిఖ్ అన్నీ ఫీహి అబ్వాబన్ నీరాన్, వ వఫ్ఫఖ్ ని ఫీహి లి తిలావతిల్ ఖుర్ఆన్, యా మున్ జిలస్ సకీనతి ఫీ ఖులూబిల్ మొమినీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ స్వర్గపు ద్వారాలను నాపై తెరువు, నరకపు ద్వారాలను నా భాగ్యంలో లేకుండా చేయి. ఖుర్ఆన్ పఠనంలో విజయవంతుడను చేయి, ఓ విశ్వాసుల హృదయాలను శాంతితో నింపేవాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ స్వర్గపు ద్వారాలను నాపై తెరువు
రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ స్వర్గపు ద్వారాలను మాపై తెరువు అని వేడుకుంటున్నాము. ఇరువర్గాలు హదీసు గ్రంథాలలో స్వర్గానికి ద్వారములు ఉంటాయి అని వివరించబడి ఉంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: మరెవయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరువబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశ్యించి, “మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి” అంటారు.[సూరయె జుమర్, ఆయత్73]
మరో ఆయత్ లో ఇలా ఉంది: “శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వాటి ద్వారాలు వారికోసం తెరువబడి ఉన్నాయి”[సూరయె సాద్, ఆయత్51]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం:  స్వర్గానికి ఎనిమిది తలుపులుంటాయి; ఒక ద్వార్గం నుంచి దైవప్రవక్తలూ, సత్యవంతులూ ప్రవేశిస్తారు. ఒక ద్వారం నుంచి అమరులూ, సజ్జనులు ప్రవేశిస్తారు. ఐదు ద్వారముల నుంచి మమ్మల్ని అనుచరించేవారు మరియు ఇష్టపడేవారు(షియాలు) ప్రవేశిస్తారు, నేను పులే సిరాత్ వద్ద నిలబడి వారి కోసం ఇలా దుఆ చేస్తూ ఇలా చెబుతూ ఉంటాను: “ఓ ప్రభూ! నా షియా మరియు నన్ను ఇష్టపడేవారిని మరియు ప్రపంచంలో నా పట్ల ప్రేమ కలిగివున్నవారిని మేలుచేయి, అప్పుడు నింగిలో ఇలా వినబడుతుంది నీ దుఆను స్వీకరించాము మరియు నీ షియాల పట్ల నీ సిఫర్సును అంగీకరించాము”, .... ఒక ద్వారం నుంచి మిగిలిన ముస్లిములు ప్రవేశిస్తారు, వీరు అల్లాహ్ యొక్క తౌహీద్ ను నమ్మేవారు మరియు వారి హృదయాలలో మా పట్ల రవ్వ గింజంత శత్రుత్వం లేనివారై ఉంటారు.[2] ఇవే కాకుండా చాలా రివాయతులలో వివిధ రకాలుగా స్వర్గ ద్వారముల గురించి వివరించబడి ఉంది.

రెండవ అంశం: నరకపు ద్వారాలను మూసి వేయి
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను నరక ద్వారాలను మా భాగ్యంలో లేకుండా చేయి అని వేడుకుంటున్నాము. స్వర్గానికి ద్వారాలు ఉన్నట్లే నరకానికి కూడా ద్వారాలు ఉన్నాయి అని ఆయతులు మరియు రివాయతులు వివరిస్తున్నాయు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “దానికి ఏడు ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది”[సూరయె హిజ్ర్, ఆయత్44]
మరో చోట ఇలా ఉంది: “అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరువబడతాయి...... ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి. మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది.. అని అనబడుతుంది”[సూరయె జమర్, ఆయత్71.72]

మూడవ అంశాలు: ఖుర్ఆన్ పఠనార్హత
రమజాన్ మాసం యొక్క 20వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఖుర్ఆన్ పఠనార్హతను ప్రసాదించమని అని వేడుకుంటున్నాము. ఖుర్ఆన్ పఠనం ద్వార దానిలో ఉన్న ఉపదేశాలు మనకు తెలుస్తాయి మరియు దానిని పాటించడం ద్వార స్వర్గంలో ప్రవేశించవచ్చు మరియు నరకాగ్ని నుంచి విముక్తి పొందవచ్చు. చివరిలో ఈ వాక్యం “ఓ విశ్వాసుల హృదయాలను శాంతితో నింపేవాడా!” తో ఈ దుఆ ముగిస్తుంది.

రిఫరెన్స్
1. అల్ ఇఖ్లాలు బిల్ఆమాలిల్ హసనహ్, భాగం1, పేజీ355
2. అల్ ఖిసాల్(తర్జుమా జాఫరీ), భాగం2, పేజీ115

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21