రమజాన్ మాసం యొక్క 21వ రోజు దుఆ భావర్ధాలు

సోమ, 05/03/2021 - 09:52

రమజాన్ మాసం యొక్క 21వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 21వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మజ్ అల్ లీ ఫీహి ఇలా మర్ జాతిక దలీలా వ లా తజ్అల్ లీష్షైతాని ఫీహి అలయ్యా సబీల, వజ్ అలిల్ జన్నత లీ మన్ జిలవ్ వ మఖీలా, యా ఖాజియా హవాయిజిత్ తాలిబీన్.[1]
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నాకోసం నీ ప్రసన్నతకై మార్గాన్ని నిర్ధారించు. నా వైపుకు వచ్చేందుకు షైతానుకు మార్గం లేకుండా చేయి. స్వర్గాన్ని నా స్థావరం మరియు నిలయంగా ఖరారు చేయి, ఓ ప్రార్థించేవారి కోరికలను ప్రసాదించేవాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: అల్లాహ్ ప్రసన్నత
రమజాన్ మాసం యొక్క 21వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నాకోసం నీ ప్రసన్నతకై మార్గాన్ని నిర్ధారించు అని వేడుకుంటున్నాము. అల్లాహ్ తమ దాసులను పరిపూర్ణ స్థాయికి చేరడం కోసం బాహ్య హుజ్జత్ మరియు అంతర్ హజ్జతులను నిశ్చయించాడు.
హుజ్జత్ అనగానేమి?
హుజ్జత్ అనగా సాక్ష్యం, నిదర్శనం దాంతో ఎదుటివాడిని లోబరుచుకోవచ్చు లేదా వాదించవచ్చు. ఈ పదం యొక్క బహువచనం “హుజజ్” మరియు “హుజ్జాజ్” ఈ పదం ఖుర్ఆన్ లో చాలా సందర్భాలలో ఉపయోగించబడి ఉంది. ఉదాహారణకు; “ رُسُلاً مُبَشِّرينَ وَ مُنْذِرينَ لِئَلاَّ يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ وَ كانَ اللَّهُ عَزيزاً حَكيماً; మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము – ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్ కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని(మేమిలా చేశాము). అల్లాహ్ యే సర్వాధిక్యుడు, మహావివేకి”[సూరయె నిసా, ఆయత్165]
ప్రవక్తలు అవతరింపబడడానికి కారణం, అల్లాహ్ తన తరపు నుంచి సాక్ష్యాలను ప్రదర్శించి ఇక ప్రజలు “మాకోసం మార్గాన్ని చూపించేవారు లేకపోయారు” అని వాదనకు దిగకూడదని. ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: ఇంకా వారికి ఇలా చెప్పు: “పరిపూర్ణమైన వాదన అల్లాహ్‌దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే”[సూరయె అన్ఆమ్, ఆయత్149]
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: “హిషామ్! అల్లాహ్ ప్రజలపై రెండు హుజ్జత్(వాదన, మార్గదర్శకులు) కలిగివున్నాడు: కనిపించే హుజ్జత్ మరియు కనిపించని హుజ్జత్, కనిపించే హుజ్జత్ దైవప్రవక్తలు మరియు ఇమాములు, కనిపించని హుజ్జత్ బుద్ధి”[3] ఈ రెండింటి ద్వార మనిషి అల్లాహ్ తమ దాసుల నుంచి ఆశించే ఆ పరిపూర్ణ స్థితికి చేరగలడు. ఇక ప్రజలకు మాకోసం మార్గదర్శి లేనందు వల్ల మేము పరిపూర్ణ స్థాయికి చేరలేకపోయాము అని వాదించే అవకాశం ఉండదు ఎందకంటే అల్లాహ్ ఒకవైపు మార్గదర్శకులను పంపి మరో వైపు బుద్ధిని ప్రసాదించి తన సహాయాన్ని ప్రజల అందుబాటులో ఉంచాడు.

రెండవ అంశం: షైతాను నుండి రక్షణ
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మా వైపుకు వచ్చేందుకు షైతానుకు మార్గం లేకుండా చేయి అని వేడుకుంటున్నాము. షైతాన్ వల్ల కొందరు ప్రభావితులవుతారు అన్న విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సూచించెను: “నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది”[సూరయె హిజ్ర్, ఆయత్42] మరో ఆయత్ లో ఇలా ఉంది: “అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్ కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి(షైతాన్) అధికారం నడుస్తుంది”[సూరయె అన్ఆమ్, ఆయత్149]
పై ఆయతుల ద్వార షైతాన్ కు మనపై అధికారం చేసే అవకాశాలు ఎలా వస్తాయి అనే కొన్ని అంశాలు తెలుసుకోవచ్చు..
1. అల్లాహ్ యొక్క ప్రముఖ దాసులపై షైతాన్ తన అధికారం చెలాయించలేడు
2. షైతాను ను తమ స్వామిగా నిర్ధారించుకునేవారిపై షైతాన్ అధికారం చెలాయిస్తాడు
3. షైతాన్ ను అల్లాహ్ భాగస్వామిగా నిర్ధారించేవారు; అనగా ఒకసారి అల్లాహ్ ను స్వామిగా మరియు మరో సారి షైతాన్ ను స్వామిగా భావించేవారిపై షైతాన్ తన అధికారాన్ని చెలాయిస్తాడు
ప్రజలు షైతాన్ విషయంలో తప్పుడు భావనలు కలిగివుంటారు. వారు మన ప్రమేయం లేకుండానే షైతాన్ కు లోబడిపోతాము అని భావిస్తారు, నిజానికి ఈ ఆలోచన మిమ్మాటికి అబద్ధం. అల్లాహ్ తన ఆస్తానం నుంచి బయటకు తరిమేసిన షైతాన్ మీ అనుమతి లేకుండా మీ ఆత్మ అనబడే పట్టణంలో ప్రవేశించలేడు. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనంత వరకు షైతాన్ కు మీపై దాడి చేసే శక్తి ఉండదు.
ప్రశ్న: ఏ అంశాలు షైతాన్ కు మనపై దాడి చేసే అనుమతినిస్తాయి?
సమాధానం: చాలా అంశాలు ఉన్నాయి వాటిలో కొన్ని:
1. చెడు సహవాసం షైతాన్ మనపై అధికారం చెలాయించడానికి గల ముఖ్యకారణాలలో ఒకటి
2. పాపాలతో కూడి ఉన్న పార్టీలు
3. చెడు సినిమాలు చూడడం, మార్గభ్రష్టతకు గురి చేసే పుస్తకాలు చదవడం, రెడియోల ద్వార చెడు కార్యక్రమాలు వినడం, ఇంటర్ నెట్ మొ..
4. తెలియని మరియు నామహ్రమ్ స్ర్తీతో ఒంటరిగా ఉండడం
ఇవే కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయి అయితే వాటిలో ఎక్కువ శాతం పైచెప్పబడిన వాటి క్రమంలోనే వస్తాయి. మేము వీటికి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అల్లాహ్ నుండి సహాయం కోరాలి.[3]

మూడవ అంశాలు: స్వర్గం నిత్య నిలయం
రమజాన్ మాసం యొక్క 21వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! స్వర్గాన్ని నా స్థావరం మరియు నిలయంగా ఖరారు చేయి అని వేడుకుంటున్నాము.
స్వర్గం ఎవరి నిత్య నిలయంగా నిర్ధారించబడుతుంది?
1. అల్లాహ్ పట్ల భయం మరియు చెడువాంఛల వ్యతిరేకత
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సూచించెను: “మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో, అతని నివాసం స్వర్గమవుతుంది”[సూరయె నాజిఆత్, ఆయత్40,41]
2. అణుకువ మరియు మంచి నైతికం
హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “స్వర్గవాసులు నాలుగు సంకేతాలు కలిగివుంటారు” ముఖంలో నవ్వు, మంచినోరు, దయగల హృదయం, ప్రసాదించే చెయ్యి కలిగి ఉంటారు[4]
3. బాధితులకు సహాయం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “దుర్మార్గుల నుండి బాధితులకోసం న్యాయాన్ని తీసుకున్నవాడు, స్వర్గంలో నా సహవాసి అయి ఉంటాడు”[5]
4. స్వర్గం దానగుణం కలిగివున్న వారి గృహం
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “దానశీలి అల్లాహ్, ప్రజలు మరియు స్వర్గానికి దగ్గరగా మరియు నరకాగ్నికి దూరంగా ఉంటాడు కాని పీనాసి అల్లాహ్, ప్రజలు మరియు స్వర్గానికి దూరంగా మరియు నరకాగ్నికి దగ్గరగా ఉంటాడు”[7]
5. స్వర్గం ఆనాధలను మరియు పేదవారికి న్యాయం కలిపించేవారి నిలయం
ఖుర్ఆన్ ఉల్లేఖనం: “అది (వాస్తవం) కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు అనాధలను ఆదరించరు. నిరుపేదలకు అన్నం పట్టే విషయంలో ఒకర్నొకరు ప్రోత్సాహించుకోరు”[సూరయె ఫజ్ర్, ఆయత్17,18]
చివరిలో ఓ ప్రార్థించేవారి కోరికలను ప్రసాదించేవాడా! మమ్మల్ని నిజమైన ముస్లిములుగా మరియు అహ్లెబైత్(అ.స) అనుచరులుగా నిర్ధారించి షైతాన్ మనల్ని లోబరుచుకోకుండా చూసి స్వర్గాన్ని మన నిత్యనిలయంగా నిర్ధారించు.  

అల్లాహ్ తమ దాసుల కార్యములు అంగీకరించే మరియు నిరాకరించే విషయాన్ని ఖుర్ఆన్ లో ఇలా వివరించెను: ఓ ముహమ్మద్(స.అ) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు” అని అన్నాడు.[సూరయె మాయిదహ్, ఆయత్27]
చివరిలో ఓ స్పష్టమైన యదార్థం వైపుకు దారి చూపమని అల్లాహ్ ను వెడుకుంటున్నాము.

రిఫరెన్స్
1. అల్ ఇఖ్లాలు బిల్ఆమాలిల్ హసనహ్, భాగం1, పేజీ369
2. లిసానుల్ అరబ్, భాగం2, పేజీ228
3. అల్ కాఫీ(తా-అల్ ఇస్లామియహ్), భాగం1, పేజీ16
4. సరె మష్ఖ్ అజ్ సుఖనానె హజ్రత్ అలీ(అ.స), పేజీ58
5. అమాలీ(తూసీ), పేజీ683, హదీస్1454
6. ఇర్షాదుల్ ఖులూబ్(తర్జుమా రిజాయీ), భాగం1, పేజీ328

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8