రమజాన్ మాసం యొక్క 22వ రోజు దుఆ భావర్ధాలు

మంగళ, 05/04/2021 - 18:17

రమజాన్ మాసం యొక్క 22వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 22వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మఫ్ తహ్ లీ ఫీహి అబ్వాబ ఫజ్లిక్, వ అన్జిల్ అలయ్యా ఫీహి బరకాతిక్, వ వఫ్ఫిఖ్ని ఫీహి లి మూజిబాతి మర్జాతిక్, వ అస్ కిన్ని ఫీహి బుహ్ బూహాతి జన్నాతిక్, యా ముజీబ దఅవతిల్ ముజ్ తర్రీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో అనుగ్రహాల ద్వారములను నా పై తెరువు. శుభాలను నా పై కురిపించు. నిన్ను సంతోషపరిచే వాటిని అమలు చేసే విషయంలో నన్ను సామర్థించు. నీ స్వర్గముల మధ్య నాకు చోటు ప్రసాదించు, ఓ కలత చెందినవారి కోరికలను తీర్చేవాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: ప్రతిష్టత ద్వారాలు
రమజాన్ మాసం యొక్క 22వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నీ దయ యొక్క ద్వారాలను మాపై తెరువు అని వేడుకుంటున్నాము. అల్లాహ్ ఖుర్ఆన్ లో తన దయ మరియు కారుణ్యం గురించి చాలా చోట్లు వివరించెను.
దయా దీనిని అరబీ భాషలో “ఫజ్ల్” అంటారు. ఫజ్ల్ అనగా ఎంత అవసరం ఉందో దానికి మించి ప్రసాదించడం.[1]
మొదటి ఆయత్: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: “అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది”[సూరయె యూనుస్, ఆయత్58]
రెండవ ఆయత్: “దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప – అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు”[సురయె నిసా, ఆయత్83]
మూడవ ఆయత్: “...అయినప్పటికీ దైవానుగ్రం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే”[సూరయె బఖరహ్, ఆయత్64]
నాలుగొవ ఆయత్: “అల్లాహ్ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు”[సూరయె నూర్, ఆయత్21]
ఈ ఆయతులను బట్టి అల్లాహ్ కారుణ్యం నష్టాలు మరియు ఆపదల నుంచి విముక్తికి, మనోవాంఛల మరియు షైతాన్ వల నుంచి సురక్షితంగా ఉండడానికి, కారణమని తెలుస్తున్నాయి.
ఖుర్ఆన్ లో 90 సార్లు కన్నా ఎక్కువగా అల్లాహ్ యొక్క కారుణ్యం గురించి చెప్పబడి ఉంది. ఫజ్ల్ యొక్క పదానికి ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు వివధ రకాలుగా నిర్వచించారు. ఈ విధంగా చూసుకున్నట్లైతే ప్రతీ ఆయత్ ను దాని ముందూ వెనక పదాలను చూసి దాని సరైన అర్ధాన్ని తెలుసుకోవడమే సరైనచర్య.

రెండవ అంశం: అల్లాహ్ ప్రసన్నత
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను శుభాలను మాపై కురిపించు. నిన్ను సంతోషపరిచే వాటిని అమలు చేసే విషయంలో నన్ను సామర్థించు అని వేడుకుంటున్నాము.
అల్లాహ్ ప్రసన్నత పొందడానికి చేయు చర్యలు:
1. అల్లాహ్ పట్ల భయభక్తులు మరియు ఆయన పట్ల ఆశ
అల్లాహ్ ఇష్టం మరియు ప్రసన్నత అముల్యమైన స్థానం. దాన్ని పొందడానికి మనం నిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇటువంటి దాసుల గురించి ఉపదేశించెను: “అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఇది తన ప్రభువుకు భయపడేవానికి మాత్రమే”[సూరయె బయ్యనహ్, ఆయత్8] ఈ ప్రసన్నత మరియు ఇష్టం కేవలం అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగివుండే, పాపాలకు దూరంగా ఉండే మరియు ఆయన పట్ల విధేయత కలిగివుండేవారికి మాత్రమే.
2. విశ్వాసం మరియు సత్కార్యాలు
రెండవ కారణం; విశ్వాసం మరియు సత్కార్యాలు. ఒకవేళ ఎవరైనా కేవలం దుఆ ద్వార అల్లాహ్ సామిప్యం మరియు ప్రసన్నత పొందగలరు అని భావిస్తున్నట్లైతే వారు దారి తప్పినట్లే; ఎందుకంటే అల్లాహ్ తన దాసుడి నుండి చర్యను ఆసిస్తాడు. ఈమాన్ మరియు అమలె సాలెహ్(విశ్వాసం మరియు సత్కార్యం) గురించి ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: “అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తముల. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు...”[సూరయె బయ్యనహ్, ఆయత్7,8]
3. ఎక్కువగా ఇస్తగ్ఫార్, వినయం మరియు సద్ఖా దానం
రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: మూడు విషయాలు దాసుడ్ని అల్లాహ్ ప్రసన్నతకు చేరుస్తాయి; ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయడం, ఇతరువ పట్ల వినయంగా ఉండడం మరియు (అల్లాహ్ మార్గంలో) ఎక్కువగా సద్ఖా దానం చేయడం”[2]
4. అల్లాహ్ శత్రువుల పట్ల శత్రుత్వం
రివాయత్ లో ఇలా సూచించబడి ఉంది: “హజ్రత్ ఈసా(అ.స) తన హవారీయుల(సహచరుల)తో ఇలా ప్రవచించారు: “అల్లాహ్ కు ప్రియమైనవారిగా మరియు ఆయన సామిప్యం పొందే కార్యములు చేయండి: సహచరులు “ఓ రూహుల్లాహ్! ఎలా అల్లాహ్ కు ప్రియమైనవారిగా మరియు ఆయన సామిప్యం పొందేవారిలా అవ్వగలం?” అని ప్రశ్నించారు. దానికి హజ్రత్ ఈసా(అ.స) “పాపాలు చేసేవారి పట్ల ద్వేషం మరియు వారి పట్ల శత్రుత్వం ద్వార అల్లాహ్ ఇష్టాన్ని వేడుకోండి” అని సమాధానమిచ్చారు.[3]
5. అల్లాహ్ ఇష్టానికి లోబడి ఉండడం
అల్లాహ్ ఇష్టానికి లోబడి ఉండడం ద్వార అల్లాహ్ ప్రసన్నత దక్కుతుంది. రివాయతె ఖుద్సీలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “నిస్సందేహంగా నా యొక్క ఇష్టం నా విధికి లోబడి ఉన్నవారికే సొంతం”[4] ఈ రివాయత్ ద్వార తెలిసే విషయమేమిటంటే సమ్మతం మరియు ప్రసన్నత కోసం ఇరు తరపుల ఇష్టం అవసరం. అంటే అల్లాహ్ ఇలా చెప్పాలనుకుంటున్నాడు; నీ జీవితంలో నీకు ఏది ప్రసాదించబడినా దానికి ఇష్టంగా స్వీకరించు, దేని పట్ల నిరాశ వ్యక్తం చేయకు, అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను, ఇష్ట పడతాను” వేరే చాలా రివయతులు దీనిని నిదర్శిస్తున్నాయి.[5]

మూడవ అంశాలు: ఓ అల్లాహ్! నీ స్వర్గముల మధ్య నాకు చోటు ప్రసాదించు
రమజాన్ మాసం యొక్క 22వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! నీ స్వర్గముల మధ్య నాకు చోటు ప్రసాదించు అని వేడుకుంటున్నాము. స్వరం ఏదోరకంగా ప్రసాదించేయబడదు, అది కేవలం దుఆ ద్వార మనకు దక్కదు. దాని పొందాలనుకుంటే ఖుర్ఆన్ ఉపదేశాలను పాటించడం అవసరం.
స్వర్గవాసుల ప్రాపంచిక  ముఖ్యలక్షణాలు:
1. ఈమాన్ మరియు సత్కార్యం: ఖుర్ఆన్: “మరెవరు విశ్వసించి, మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు”[సూరయె బఖరహ్, ఆయత్82]
2. మేలు మరియు సజ్జనత్వం: ఖుర్ఆన్: “వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది”[సూరయె మాయిదహ్, ఆయత్85]
3. నమాజ్ మరియు అల్లాహ్ దాసోహానికి కట్టుబడి ఉండడం: ఖుర్ఆన్: “వారు తమ నమాజుల(వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగని వారికి కూడా. వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారే ఉంటారు. వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు. నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు. వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు. అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు. ఇక ఎవరయినా ఇదిగాక ఇంకా ఏవైనా (ఇతరత్రా అడ్డదారులు అవలంబించ) కోరితే, వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు. వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు. ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గవనాలలో సగౌరవంగా ఉండేవారు”[సూరయె మఆరిజ్, ఆయత్23-35]

రిఫరెన్స్
1. అల్ ముఫ్రదాత్, రాగిబె ఇస్ఫెహానీ, దమిష్ఖ్, పేజీ639
2. కష్ఫుల్ గుమ్మహ్ ఫీ మారిఫతిల్ ఆయిమ్మహ్,(తా-అల్ ఖదీమహ్), భాగం2, పేజీ349
3. బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం74, పేజీ147
4. కుల్లియాతె హదీసె ఖుద్సీ, పేజీ158
5. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ104

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19