రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆ భావర్ధాలు

శుక్ర, 05/07/2021 - 00:30

రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆ భావర్ధాలు

రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఫీహి మా యుర్ జీక వ అవూజు బిక మిమ్మా యూజీక వ అస్ అలుకత్ తౌఫీఖా ఫీహి, లి అన్ వుతీఅక వ లా ఆసియక యా జవాదస్ సాయిలీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నిన్ను ఆనందింపజేసే వాటిని నీ నుండి కోరుతున్నాను. నిన్ను అయిష్టనికి గురి చేసేవాటి నుండి నీ శరణు కోరుతున్నాను. ఈ నెలలో నీ పట్ల విధేయత కలిగి ఉండేటట్లు మరియు అవిధేయత నుండి దూరంగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాను, ఓ లేనివారికి ప్రసాధించే వాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: అల్లాహ్ ప్రన్నత  
రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యం; “ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెల)లో నిన్ను ఆనందింపజేసే వాటిని నీ నుండి కోరుతున్నాను” అల్లాహ్ ప్రసన్నత స్థానం, చాలా గొప్ప స్థానం. ఖురఆన్ లో ఇలా వివరించబడి ఉంది: “విశ్వసించిన ఇలాంటి స్ర్తీ పురుషులకు, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో పరిశుభ్రమైన మేడలు వారి కొరకు ఉంటాయి. వీటన్నింటికన్నా గొప్పదైన అల్లాహ్ ప్రసన్నత వారికి లభిస్తుంది. గొప్ప సాఫల్యం అంటే ఇదే.”[సూరయె తౌబహ్, ఆయత్72] అల్లాహ్ ప్రసన్నత వల్ల మనిషికి కలిగే ఆనందాన్ని, ఆథ్యాత్మిక అభిరుచిని ఏ ఒక్కరు వివరించలేరు. ఖుర్ఆన్ వ్యాఖ్యాతలలో కొంతమంది ప్రవచననుసారం అల్లాహ్ ప్రసన్నత ద్వార మనిషికి కలిగే ఆనందం నుంచి ఒక్క శాతం ఆనందం స్వర్గలూ, అనుగ్రహాలన్నీంటికి మించి ఉంటుంది.

రెండవ అంశం: అల్లాహ్ అయిష్టత నుంచి శరణు
రెండవ వాక్యం; నిన్ను అయిష్టనికి గురి చేసేవాటి నుండి నీ శరణు కోరుతున్నాను. దుఆలో ఉన్న పదం యొక్క అసలైన అర్ధం నిన్ను కష్టపెట్టే పని నుంచి శరణు కోరుతున్నాను అని అయితే కష్టం కలగడం అంటే ప్రభావితుడవ్వడం అల్లాహ్ పై దేని ప్రభావము పడదు మరి ఆయనకు దేని ద్వారానూ కష్టం కలగదు, అందుకని ఇక్కడ కష్టం అనగా అయిష్టం అని అర్ధం.

మూడవ అంశాలు: అల్లాహ్ పట్ల విధేయత కలిగివుండటం
రమజాన్ మాసం యొక్క 24వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యం; ఓ అల్లాహ్ ను ఈ నెలలో నీ పట్ల విధేయత కలిగి ఉండేటట్లు మరియు అవిధేయత నుండి దూరంగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాను. అల్లాహ్ పట్ల విధేయతకు కూడా అర్హత ఉండాలి, కాని ఆ అర్హత మనిషి తన స్వియంతోనే పొందాలి, ముందు తాను తన ఇష్టంతో చర్యను చేయాలి అల్లాహ్ అనుగ్రహంతో. మనాజాతె షాబానియహ్ లో ఇలా ఉంది: “ఓ అల్లాహ్ నన్ను నీ పట్ల విధేయత మరియు నీ ప్రసన్నత యొక్క గొప్ప స్థానానికి చేర్చు, ఎందుకంటే నేను నా నుండి దూరం చేసే శక్తి కలిగిలేను మరియు అలాగె నన్ను నేను లాభం చేకూర్చే శక్తి కలిగివున్నాను”[1]

ఓ అల్లాహ్! నీవు నీ ప్రసాదించేగుణం ద్వార మనందరికి నీ పట్ల విధేయత కలిగి ఉండే అర్హతను ప్రసాదించు.

రిఫరెన్స్
1. ఇఖ్బాలుల్ అఅమాల్, భాగం1, పేజీ216
https://btid.org/fa/news/95266

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35