రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆ భావర్ధాలు

ఆది, 05/09/2021 - 00:29

రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహుమ్మజ్ అల్ సయీ ఫీహి మష్కూర, వ జన్ బి ఫీహి మగ్ఫూరా, వ అమలీ ఫీహి మఖ్బూల, వ ఐబీ ఫీహి మస్తూర యా అస్మఅస్ సామెయీన్.
అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నా ప్రయత్నాన్ని కృతజ్ఞతగా, పాపములను క్షమించబడినటువంటిగా, నా చర్యను అంగీకరించబడినటువంటిగా, నా లోపములను గుప్తముగా నిర్ధారించు, ఓ వినేవారికి మించినవాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: ప్రార్థనల స్వీకరణ
రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము ఓ అల్లాహ్! ఈ నెలలో మా ప్రయత్నాన్ని కృతజ్ఞతగా స్వీకరించు అని వేడుకుంటున్నాము. ఇక్కడ “మష్కూర్” పదం యొక్క అర్ధం కృతజ్ఞత తెలుపు, ఈ దుఆలో దాని అర్ధం నా ప్రయత్నాన్ని స్వీకరించు అని అర్ధం[1] సూరయె ఇన్సాన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది (గుర్తించబడింది అని వారితో అనబడుతుంది)”[సూరయె ఇన్సాన్, ఆయత్23]. అనగా అల్లాహ్ తరపు నుంచి కృతజ్ఞతకు అర్హులవుతారు. దీని అసలైన అర్ధమేమిటంటే ఆ ప్రయత్నానికి ప్రతిఫలం స్వర్గం; ఎందుకంటే స్థాయిని బట్టి ప్రతిఫలం ఉంటుంది అంతే గాని కార్యాన్ని నిర్వర్తించేవారిని బట్టి ప్రతి ఫలం ఉండదు. అల్లాహ్ కృతజ్ఞత స్వర్గ కన్నా తక్కువ అయి ఉండదు, స్వర్గం లేదా దానికి మించినది అయి ఉంటుంది.[2] మనిషి ఉపవాసదీక్షలు నిర్వర్తిస్తాడు, ఆకలిగా ఉన్నా దాహం వేసినా వాటిని ఒర్చుకుంటాడు, తక్కువగా నిద్రపోతాడు ఒకవేళ అల్లాహ్ మనిషి యొక్క ఈ ప్రయత్నాన్ని స్వీకరించబకపోతే మనిషి ఏమీ చేయలేడు. అందుకే ఆయన తన దయతో మన ప్రయత్నాన్ని స్వీకరించాలి అని ఈ దుఆలో ప్రార్ధించుకుంటున్నాము.
ఖుర్ఆన్: “తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయి పోతున్నప్పటికీ, తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమ పడేవారే వారు”[సూరయె కహఫ్, ఆయత్104]
పరలోకం కోసం ప్రయత్నించేవారి విశ్వాసి యొక్క ప్రయత్నం కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. దానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు.
మరో చోటు ఇలా వివరించబడి ఉంది: “మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది”[సూరయె బనీ ఇస్రాయీల్, ఆయత్19]

రెండవ అంశం: పాపముల క్షమాపణ
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను మా పాపము పట్ల మా పశ్చాత్తాపాన్ని మరియు తౌబహ్ ను స్వీకరించి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. ఎందుకంటే పాపముల సత్కార్యముల నుంచి అడ్డుకుంటాయి, అదే పాపములు తొలిగిపోతే మన ఆమాల్ అల్లాహ్ సన్నిధిలో స్వీకరించబడతాయి. ఈ రమజాన్ మాసం యొక్క ప్రత్యేకత అందరికి తెలిసినదే ఈ మాసం ఆథ్యాత్మిక లాభాలు పొందడానికి మంచి అవకాశం వున్న మాసం. ఈ మాసంలో నిద్రపోవటం మరియు శ్వాస తీసుకోవడం కూడా ఆరాధనగా లెక్కించబడుతుంది. లాభాలను చేకూర్చే ఇలాంటి మాసంలో పుణ్యాలను దక్కించుకోని వారిని అవివేకులని కాక మరేమంటారు....!
మూడవ అంశం: ఓ అల్లాహ్! నా లోపములను గుప్తంగా ఉంచు  
రమజాన్ మాసం యొక్క 26వ రోజు దుఆ యొక్క మూడవ వాక్యంలో మేము ఓ అల్లాహ్! మా లోపాలను మరియు తప్పులను గుప్తంగా ఉంచమని వేడుకుంటున్నాము. అల్లాహ్ ను సత్తారుల్ ఉయూబ్ అంటారు. అనగా లోపాలను దాచిపెట్టేవాడు అని దాని అర్ధం. హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ కు భయపడు! అల్లాహ్ కు భయపడు! అల్లాహ్ సాక్షిగా ఆయన నిన్ను క్షమించేశాడన్న విధంగా నీ లోపాలను దాచిపెట్టాడు”[3]
దుఆ యొక్క చివరిలో అల్లాహ్ ను విన్నపాలను వినేవారికి మించినవాడిగా సంబోధించడంతో దుఆను పూర్తి అవుతుంది.

రిఫరెన్స్
1,2. తఫ్సీరె నమూనహ్, మకారిమ్ షీరాజీ, భాగం12, పేజీ66
3. నెహ్జుల్ బలాగహ్, సుబ్హీ సాలెహ్, పేజీ472

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13