రమజాన్ మాసం యొక్క 29వ రోజు దుఆ భావర్ధాలు

మంగళ, 05/11/2021 - 10:39

రమజాన్ మాసం యొక్క 29వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 29వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దుఆ: అల్లాహుమ్మ గష్షీని ఫీహి బిర్రహ్మా వర్జుఖ్ని ఫీహితే తౌఫీఖ వల్ ఇస్మహ్, వ తహ్హిర్ ఖల్బీ మిన్ గయాహిబిత్ తుహమహ్, యా రహామమ్ బి ఇబాదిహిల్ మొమినీన్
అనువాదం: ఓ అల్లాహ్! ఈ నెలలో నీ కరుణతో నన్ను నింపివేయి. సామర్థ్యాన్ని మరియు పాపముల నుంచి రక్షణను ప్రసాదించు. సందేహాల చీకటి నుండి నా హృదయాన్ని పవిత్రంగా చేయి, ఓ విశ్వాసం కలిగి ఉన్న దాసుల పట్ల దయచూపువాడా!

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: అల్లాహ్ కారుణ్యం
రమజాన్ మాసం యొక్క 29వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ నెలలో నీ కరుణతో మమ్మల్ని నింపివేయి అని వేడుకుంటున్నాము. రివాయతులలో మరియు ఖుర్ఆన్ ఆయతులలో అల్లాహ్ కారుణ్యం గురించి చాలా చాలా ఎక్కువగా వివరించబడి ఉంది. నిస్సందేహంగా చెప్పవచ్చు ఖుర్ఆన్ లో అల్లాహ్ కారుణ్యం గురించి వివరించని సూరహ్ లేదు, ప్రతీ సూరహ్ లో అల్లాహ్ కారుణ్యం గురించి ఉంది. ఇస్లాం బోధలనుసారం అల్లాహ్ యొక్క కారుణ్యం ఆయన ఆగ్రహానికి మించినది. ఖుర్ఆన్ లో అల్లాహ్ కారుణ్య విస్తరణ గురించి ఇలా ఉంది: “దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి, తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు అని చెప్పు”[సూరయె అన్ఆమ్, ఆయత్54]
ఇస్లాం ధర్మంలో అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం మహాపాపముగా సూచించబడి ఉంది. దీని గురించి ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: “మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు”[సూరయె హిజ్ర్, ఆయత్56]
ఖుర్ఆన్ లో మరో చోట ఇలా ఉంది: (ఓ ప్రవక్తా! నా తరపున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు”[సూరయె జమర్, ఆయత్53]
అల్లాహ్ కారుణ్యం యొక్క విస్తరణ రివాయతులలో:
1. అల్లాహ్ కారుణ్యాన్ని నమ్మేవారం: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “మీకు అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల అవగాహన ఉండి ఉంటే నిస్సందేహంగా కేవలం అల్లాహ్ నే నమ్మేవారు”[1]
2. అల్లాహ్ కారుణ్యం మనిషి విముక్తికి కారణం: జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: “ఈ మూడు విషయాలు ఉండగా విశ్వాసి నాశనం కాలేడు; అల్లాహ్ తౌహీద్ పట్ల సాక్ష్యం, దైవప్రవక్త(స.అ) ఆశ్రయం మరియు అల్లాహ్ యొక్క విశాలమైన కారుణ్యం”[2]
3. అల్లాహ్ కారుణ్యం పట్ల షైతాన్ అత్యాశ: ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “ప్రళయదినాన అల్లాహ్ తన కారుణ్యాన్ని విస్తరించే విధానాన్ని చూసి ఇబ్లీస్ కు ఆయన కారుణ్యం పై ఆశ కలుగుతుంది”[3]

రెండవ అంశం: సామర్థ్యాన్ని మరియు పాపముల నుంచి రక్షణ
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! మా సామర్థ్యాన్ని మరియు పాపముల నుంచి రక్షణను ప్రసాదించు అని వేడుకుంటున్నాము. పాపకార్యం మనిషిని కఠోర హృదయానికి మరియు దౌర్భాగ్యానికి దారితీసే కారణాలలో ఒకటి. ఈ పాపకార్యముల కారణంగానే మనిషి ఇహపరలోక కష్టాలకు మరియు శిక్షలకు గురి అవుతాడు. మనిషి జీవితంలో పాపకార్యానికి మించిన దౌర్భాగ్యం మరోకటి లేదు. ఎందుకంటే ఈ పాపకార్యములే మనిషిని నరకాగ్నికి గురి అవుతారు. ఖుర్ఆన్: “మరెవరయితే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది(అని వారితో అనబడుతుంది)”[సూరయె నమ్ల్, ఆయత్90]
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ ప్రళయదినాన మూడు రకాల వ్యక్తులతో మాట్లాడడూ మరియు వారిపై ఆయన కారుణ్యం చూపడు, వారిలో ఒకడు వ్యభిచరించే ముసలివాడు”[4]
మరో రివాయత్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “అల్లాహ్ ముగ్గురు వ్యక్తులపై తన దయను చూపించడు, వారితో మాట్లడడు, వారిని పవిత్రులుగా మార్చడు మరియు వారి కోసం కఠినమైన శిక్షను నిర్ధారించి ఉంచాడు; వారులో ఒకరు భర్త ఉండగా వ్యభిచరించే స్ర్తీ”[5]

చివరి అంశం: ఓ అల్లాహ్! సందేహాల చీకటి నుండి నా హృదయాన్ని పవిత్రంగా చేయి    
ఓ అల్లాహ్ మా హృదయాలను నీకు అప్పగిస్తున్నాము. ఈ హృదయాన్ని పాపాలు అపవిత్రంగా మారుస్తాయి, ఇతరులను నిందించి హృదయాన్ని మురికిగా మారుస్తున్నాము, సంకోచాల ద్వార దాని జీవితాన్ని తరుగుతున్నాము, అపోహాల ద్వార దాన్ని నాశనం చేస్తున్నాము. ఓ అల్లాహ్ ఒకవేళ మా శరీరాలకు పవిత్రత అవసరమైతే శరీరాన్ని శుభ్రపరుచు, ఒకవేళ ఆత్మకు పవిత్రత అవసరం ఉంటే దాన్ని నీ పవిత్ర గుణం ద్వార పవిత్రంగా తీర్చిదిద్దు. మా హృదయాల పవిత్రత విషయంలో మేము నిన్నే వేడుకుంటున్నాము. నీవే అందరి విన్నపాలను ఆలకించి ప్రసాదించేవాడవు.
రిఫరెన్స్
1. కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖియె హిందీ, హదీస్10387
2. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ159
3. అమాలీ, షేఖ్ సదూఖ్, పేజీ205, హదీస్3
4. బిహారుల్ అన్వార్, భాగం76, పేజీ24
5. బిహారుల్ అన్వార్, భాగం76, పేజీ25
6. సీనాయె నియాజ్, జవాదె ముహద్దిసీ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13