రమజాన్ మాసం యొక్క 30వ రోజు దుఆ భావర్ధాలు

గురు, 05/13/2021 - 00:50

రమజాన్ మాసం యొక్క 30వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా...

రమజాన్ మాసం యొక్క 30వ రోజు దుఆ భావర్ధాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రమజాన్ మాసం యొక్క 30వ రోజు దుఆలో ఉన్న భావర్థాలు మరియు బోధనల గురించి సంక్షిప్తంగా:
దుఆ: అల్లాహుమ్మజ్ అల్ సియామీ ఫీహి బిష్షుక్రి వల్ ఖబూలి అలా మా తర్‌జాహు వ యర్‌జాహుర్రసూలు ముహ్‌కమతన్ ఫురూఉహు బిల్ ఉసూలి బి హఖ్ఖి సయ్యిదినా ముహమ్మదివ్ వ ఆలిహిత్తాహిరీన్, వల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
అనువాదం: ఓ అల్లాహ్! ఈ రోజున నా ఉపవాసదీక్షను నీ సన్నిధిలో మంచి ప్రతిఫలం మరియు స్వీకరించబడినదిగా నిర్ధారించు, దానిని నీకూ మరియు నీ ప్రవక్తకు నచ్చే విధంగా తీర్చిదిద్దు, దాని శాఖలను(ఫురూ) దాని మూలంశాల(ఉసూల్) ద్వార పటిష్ఠం చేయి, మన నాయకుడు హజ్రత్ ముహమ్మద్(స.అ) మరియు వారి పవిత్ర అహ్లెబైత్(అ.స) ద్వార, ప్రశంసలూ పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు

ఈ దుఆ యొక్క వివరణ:
మొదటి అంశం: ఓ అల్లాహ్! నా చర్యలను నీవు స్వీకరించు
రమజాన్ మాసం యొక్క 30వ రోజు దుఆ యొక్క మొదటి వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఈ రోజు(ఈ నెలలో)న నా ఉపవాసదీక్షను నీ సన్నిధిలో మంచి ప్రతిఫలం మరియు స్వీకరించబడినదిగా నిర్ధారించు., దానిని నీకూ మరియు నీ ప్రవక్తకు నచ్చే విధంగా తీర్చిదిద్దు అని వేడుకుంటున్నాము. అంటే ప్రసాదించే పూణ్యం ప్రత్యేకమైనది అయి ఉండాలి అని. మేము చేస్తున్న ఆరాధనలు స్వీకరించబడాలి అంటే అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స.అ) సమ్మతం కలిగివుండాలి అని ఈ దుఆ ద్వార తెలుస్తుంది.
مَا تَرْضَاهُ  وَ  يَرْضَاهُ الرَّسُولُ నీకు మరియు నీ ప్రవక్త(స.అ)కు నచ్చే(వారికి సమ్మతమైన). ఈ వాక్యం ఖుర్ఆన్ మరియు ఇస్లామీయ బోధనల అనుకూలమైనది. ఎందుకంటే దైవప్రవక్త(స.అ) సమ్మతం మరియు ఇష్టంలోనే అల్లాహ్ యొక్క ఇష్టం ఉంది. ఆయతులలో కూడా వారి పట్ల విధేయత గురించి ఇలా ఉంది: ఇంకా వారికి చెప్పు: “మీరు అల్లాహ్ కూ మరియు ప్రవక్తకూ విధేయులై ఉండండి” ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏమాత్రం ఇష్టపడడు.[సూరయె ఆలి ఇమ్మాన్, ఆయత్32] ఇదే సూరహ్ లో మరో ఆయత్ లో ఇలా ఉంది: “అల్లాహ్ కూ, ప్రవక్తకూ విధేయత చూపండి – తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది”[సూరయె ఆలి ఇమ్మాన్, ఆయత్32]

రెండవ అంశం: ఉసూలె దీన్ మరియు ఫురూయె దీన్ మధ్య గల సంబంధం
రెండవ వాక్యంలో మేము అల్లాహ్ ను ఓ అల్లాహ్! ఫురూయె దీన్ ను ఉసూలె దీన్ ద్వార పటిష్ఠం చేయి అని వేడుకుంటున్నాము. పరిశోధకులు ఈ విషయం తెలుసు ఉసూలె దీన్ ఎరుక మరియు పటిష్ఠతలో కొరత ఫురూయె దీన్ ను పాటించే విషయంలో బలహీనతను తీసుకొస్తుంది అని. ఎవరైతే మొదలు మరియు అంతం పట్ల నమ్మకం కలిగివుంటారో వారు ఫురూయె దీన్ అమలులో ఎటువంటి కొరతకు గురికారు.
ఇస్లాం ధర్మం యొక్క వ్యవహారాలు ఒక రకంగా రెండు భాగాలుగా విభజించబడతాయి
1. ఉసూలె దీన్: ఇవి ఐదు, ఇందులో తౌహీద్, నుబువ్వత్ మరియు ఖియామత్ ఇవి దీన్ యొక్క మూలాలు మరియు అద్ల్ మరియు ఇమామత్ ఈ రెండు ఉసూలె మజ్ హబ్(వర్గ మూలాలు).
2. ఫురూయె దీన్: ఇవి పది ఉంటాయి; నమాజ్, రోజా, హజ్స జకాత్, ఖుమ్స్, జిహాద్, అమ్ర్ బిల్ మఅరూఫ్, నహ్యి అనిల్ మున్కర్, తవల్లా మరియు తబర్రా.
చివరిలో మన నాయకుడు హజ్రత్ ముహమ్మద్(స.అ) మరియు వారి పవిత్ర అహ్లెబైత్(అ.స) ద్వార మా దుఆను స్వీకరించు అని వేడుకొని ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి ఆయన సమస్త లోకాలకు పోషకుడు అనే నమ్మకాన్ని వ్యక్తి చేస్తూ దుఆను పూర్తి చేస్తాము.

రిఫరెన్స్
https://btid.org/fa/news/95541

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18