స్వపరీక్ష ఇమామ్ మూసా కాజిమ్(అ.స) దృష్టిలో

మంగళ, 05/18/2021 - 17:28

స్వపరీక్ష(మనిషి తన ఆత్మను పరీక్షించుకోవడం) ఇమామ్ మూసా కాజిమ్(అ.స) దృష్టిలో

స్వపరీక్ష ఇమామ్ మూసా కాజిమ్(అ.స) దృష్టిలో

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
మేము మన జీవితాన్ని గడుపుతున్న ఈ ప్రపంచంలో చాలా విషయాలు లెక్కలతో కూడి ఉంటాయి. ఈ ప్రపంచంలో లెక్కలు లేకుండా జీవితాన్ని గడపలేము. ఎలాగైతే మన భౌతిక జీవితంలో మన నిత్యం లెక్కలు వేసుకుంటు ఉంటామో అలాగే మన ఆత్మ నుంచి కూడా లెక్క తీసుకోవాలి, స్వపరీక్ష చాలా అవసరం. ఈ స్వపరీక్ష యొక్క అర్ధం చాలా లోతైనది, ఇది మన ధర్మం ఉపదేశిస్తున్న అన్ని ఉపదేశాలతో సంబంధం కలిగి ఉన్నటువంటి అంశం. దీని ప్రభావం అన్నింటి పై పడుతుంది. కాని ప్రజలు స్వపరీక్ష పట్ల అశ్రద్ధత కలిగివున్నారు. స్వపరీక్ష వల్ల కలిగే లాభాలూ, ఫలితాలు చాలా ఎక్కువ. దీని ద్వార పొందె లాభాలు మన ధర్మం యొక్క ఇతర బోధనలతో పొందలేము. అహ్లె బైత్(అ.స) యొక్క ఉపదేశాలలో స్వపరీక్ష గురించి చాలా తాకీదు చేయబడివుంది, దాంతో దీనికి ఉన్న ప్రాముఖ్యత స్పష్టమౌతుంది. ఇమామ్ కాజిమ్(అ.స) ఉల్లేఖనం: “ఎవరైతే ప్రతీరోజు స్వపరీక్ష నిర్వర్తించరో వారు మా నుండి కాదు(మేము వారిని ఇష్టపడము) మరియు ఆ రోజు సత్కార్యాలు చేసినట్లైతే అల్లాహ్ ను సత్కార్యాలను చేసే సామర్థ్యం పెంచమని వేడుకొని అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవాలి మరియు అదే ఒకవేళ చెడు కార్యములు చేసినట్లైతే అల్లాహ్ నుంచి క్షమాపణ చేసి తౌబహ్ చేయాలి”[1]
ఈ హదీస్ అంతర్దృష్టిని పెంచేటువంటి హదీస్. ఈ హదీస్ నుంచి చాలా అముల్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యమైన విషయం స్వపరీక్ష పై ఇస్లాం చాలా తాఖీదు చేస్తుంది.
పై చెప్పబడిన ఇమామ్ కాజిమ్(అ.స) యొక్క హదీస్ నుంచి కొన్ని ముఖ్యాంశాల:
1. స్వపరీక్ష ఎంత ముఖ్యమైనది అంటే దానిని పాటించని వారు అహ్లెబైత్(అ.స) యొక్క నిజమైన అనుచరుల నుంచి కారు
2. స్వపరీక్ష ప్రతీరోజు నిర్వర్తించాలి
3. స్వపరీక్ష ద్వార మంచి మరియు చెడు కార్యములను తెలుసుకోవచ్చు
4. మంచి కార్యములు చేయడం పట్ల అల్లాహ్ కు కృతజ్ఞత తెలపడం మరియు ఆయన నుంచి సత్కార్యములను చేసే సామర్థ్యత కోరడం
5. సత్కార్యములు చేసినందుకు అల్లాహ్ కు కృజ్ఞత తెలుపుకోవాలి అంతేగాని మనిషి తాను చేసిన మంచి పనుల వల్ల అంకారభావనకు గురి కాకూడదు
6. చెడు కార్యములు చేయడం వల్ల అల్లాహ్ సన్నిధాన ఇప్పటి నుంచి మరలా ఆ పాపాన్ని చేయను అని క్షమాపణ కోరాలి
7. ఇమామ్ సత్కార్యముల పట్ల రెండు ఆదేశాలు ఇచ్చినట్లే చెడు కార్యముల పట్ల కూడా రెండు ఆదేశాలు ఇచ్చారు., ఇంకా సత్కార్యములు చేయాలనే దుఆ మరియు అల్లాహ్ పట్ల కృతజ్ఞత తెలపడం. చెడు కార్యములలో ఇస్తిగ్ఫార్ మరియు తౌబహ్ చెయడం.
స్వపరీక్ష ఖుర్ఆన్ దృష్టిలో
స్వపరీక్ష ప్రోత్సాహం: అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు”[సూరయె హష్ర్, ఆయత్18]
స్వపరీక్ష బహిరంగంగా మరియు గోప్యంగా: ఖుర్ఆన్: “ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ కు అన్నింటిపై అధికారం ఉంది”[సూరయె బఖరహ్, ఆయత్284]
స్వపరీక్షలో త్వరపడడం: ఖుర్ఆన్: “ఆపైన అందరూ తమ యజమాని అయిన అల్లాహ్ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి! నిర్ణయాధికారం అల్లాహ్ దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు”[సూరయె అన్ఆమ్, ఆయత్62]
స్వపరీక్ష రివాయతుల దృష్టిలో:
స్వపరీక్ష గురించి చాలా హదీసులు ఉల్లేఖించబడి ఉన్నాయి వాటి నుండి కొన్ని హదీసు మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తున్నాము:
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నీ నుండి లెక్క తీసుకోకముందే నిన్ను నీవు పరిశీలించుకో పరీక్షించుకో”[2]
దైవప్రవక్త(స.అ) మరో చోట ఇలా ఉల్లేఖించారు: “ఓ అబూజర్! నీ నుండి లెక్క తీసుకోకముందే నిన్ను నువ్వు పరీక్షించుకో, ఇలా చేయడం వల్ల రేపు (ప్రళయందినాన) నీ నుండి తీసుకునే లెక్క తెలిక అవుతుంది”[4]
హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “ఎవరైతే స్వపరీక్ష నిర్వర్తిస్తారో, వారు భాగ్యవంతులవుతారు”[5]
మరో రివాయత్ లో ఇలా ఉల్లేఖించారు: “స్వపరీక్ష యొక్క ఫలితం ఆత్మ సవరణం”[6]
చివరి మాట: ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క ఈ హదీస్ ద్వార తెలిసే విషయమేమిటంటే స్వపరీక్ష నిర్వర్తనం ప్రతీ మనిషికి చాలా అవసరం. ఇలా చేయని వారు అహ్లెబైత్(అ.స) ఇష్టపడని వారిగా నిర్ధారించబడతారు.

రిఫరెన్స్
1. అల్ ఇఖ్తిసాస్, పేజీ26
2. బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం70, పేజీ73
3. వసాయిలుష్ షియా, షేఖ్ హుర్రె ఆములీ, భాగం16, పేజీ98
4. గురరుల్ హికమ్, ఆముదీ, పేజీ585
5. గురరుల్ హికమ్, ఆముదీ, పేజీ329

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14