ఇస్లాం పదం యొక్క వివరణ

బుధ, 05/26/2021 - 16:19

ఇస్లాం, ముస్లిం మరియు దీన్ యొక్క అర్ధాలు మరియు వాటి గురించి కొన్ని అంశాలు సంక్షిప్తంగా...

ఇస్లాం పదం యొక్క వివరణ

మానవులకు మరో దారి లేదు, వారు ఒకేఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించాలి లేదా (యదార్థం లేని) రకరకాల దేవుళ్లను ఆరాధించాలి.[1] కాని అల్లాహ్ తనకు తప్ప వేరే వారిని ఆరాధ్యదైవంగా భావించడానికి అనుమతించలేదు. ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “పరిపాలనాధికారం అల్లాహ్ కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ”[సూరయె యూసుఫ్, ఆయత్40]

దీన్ యొక్క అర్ధం
అల్లాహ్ యొక్క ఆరాధన కోసం ముందుగా దీన్ మరియు ఇస్లాం యొక్క పదార్ధాలు తెలుసుకుందాం.
దీన్ అనగా ఫలితం మరియు అలాగే విధేయత అని ఉంది. ఈ రెండు పదాల అర్ధాల మధ్య ఒక రకంగా సంబంధం కూడా ఉందని చెప్పవచ్చు: “అల్లాహ్ తన విధేయులకు పుణ్యఫలితాన్ని ప్రసాదిస్తాడు”[2]
అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని తన దాసుల కొరకు నియమించెను. ఇలా అని వివిధ ఆయతులలో వివరించెను[3] ఇస్లాం అనగా అల్లాహ్ ఆజ్ఞ పట్ల లోబడి ఉండడం అనగా అల్లాహ్ ఆజ్ఞను పాటించడం. అల్లాహ్ ఈ సృష్టి యొక్క సృష్టికర్త; ముసల్మాన్ అనగా ఆయన ఆజ్ఞను పాటించేవాడు అని అర్ధం[4] ఖుర్ఆన్ ఇలా ఉపదేశించెను: “ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నవారంతా – తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉన్నాయి”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్83]

రెండు రకాల ఇస్లాం:
భూమ్యాకాశాలలో ఉన్న సృష్టితాలన్నీ, ముస్లిములు మరియు అల్లాహ్ ఆజ్ఞకు లోబడి ఉంటాయి, వాటిలో కొన్ని ఇష్టానుసారంగా ముస్లిములైతే మరి కొన్ని అసంకల్పితంగా., అంటే నిజానికి సృష్టితాలు రెండు రకాలుగా ఇస్లాం(అల్లాహ్ ఆజ్ఞ పాలన)ను కలిగివున్నాయి. ఒకటి "తక్వీనీ ఇస్లాం" అంటే అసంకల్పిత ఇస్లాం (అంటే సృష్టి కోసం అల్లాహ్ యొక్క సహజ నిబంధనలు) అంటే సృష్టితాలలో కొన్ని సృష్టితాలు అల్లాహ్ ఆజ్ఞను పాటించడంలో నిస్సహాయులు అవి తప్పకుండా పాటించాల్సిందే, ఉదాహారణకు సూర్యుని కాంతి సముద్రంపై పడడం, దాని నీరు ఆవిరై మబ్బు రూపం దాలించడం, మబ్బులు పరస్పరం కలవడం, వర్షం పడడం, సూర్యకాంతి మరియు వర్షపు నీటి చక్కలతో మొక్కలు మొలవడం మొ.. ఇవన్నీ అసంకల్పితాలు ఇవన్నీ తనకు తానుగా జరగవు అల్లాహ్ ఆదేశం ప్రకారం జరుగుతాయి. ఇవన్నీ కూడా ముస్లిములే అనగా అల్లాహ్ అదేశాలకు లోబడి ఉంటాయని అర్థం. దీనినే “తక్వీనీ ఇస్లాం” అంటారు.
రెండో రకం ఇస్లాం, ఇందులో ఇష్టానికి చోటు వుంది, దీనిని “తష్‌రీయి ఇస్లాం” అంటారు.
అల్లాహ్ తన ప్రవక్త(స.అ)ల ద్వార అవతరింపజేసిన ఆదేశాలనూ, నిబంధలనూ, చట్టాలనూ తమ ఇష్టానుసారంగా స్వీకరిస్తారు, వాటికి లోబడి ఉంటారు; వీరిని “ముసల్మాన్” అంటారు.
తక్వీనీ మరియు తష్‌రీయీ చట్టాలను పాటించకపోవడం, వెనకబడిపోవడానికి లేదా నాశనానికి కారణం అవుతుంది.
ఈ “తక్వీనీ మరియు తష్ రీయీ ఇస్లాం” కు వేరే అర్ధాలు కూడా ఉన్నాయి[5]. ఇప్పటికి పై వివరణ చాలు అని భావిస్తున్నాము.

పూర్వపు ప్రవక్తల ధర్మం
పూర్వపు ప్రవక్తల ధర్మం కూడా ఇస్లాం ధర్మం అని వివరించాడానికి ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతుల నిదర్శనం:
అల్లాహ్ ఆదేశం ప్రకారం, “ఇస్లాం” మరియు “ముస్లిం” పదాలను ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి, హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స). ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “ఇది(ఇస్లామీయ ఏకేశ్వరవాదం) మీ పితామహుడైన ఇబ్రాహీమ్(అబ్రహం) ధర్మం. దీనికి(ఖుర్ఆన్) పూర్వం కూడా ఆయన(అల్లాహ్) మిమ్మల్ని ‘ముస్లింలు’గానే నామకరణం చేశాడు”[సూరయె హజ్, ఆయత్78] “ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు, అతడు నిజమైన ముస్లిం(అల్లాహ్ యొక్క విధేయుడు), ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్67]. కేవలం ప్రవక్త ఇబ్రాహీమ్(అ.స) మాత్రమే తన ధర్మం ఇస్లాం అని చెప్పలేదు, ప్రవక్త ఇబ్రాహీమ్(అ.స) తరువాత ప్రవక్తలు కూడా తన ధర్మం ఇస్లాం అని చెప్పారు. ప్రవక్త యూసుఫ్ ఉల్లేఖనం, ఖుర్ఆన్ యొక్క “యూసుఫ్” అనబడే అధ్యాయంలో ఇలా ఉంది: “నా ప్రభూ! నీవు నాకు రాజ్యంలో అధికారాన్ని ప్రసాదించావు. ఇంకా నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణం వొసగు. నన్ను సజ్జనులలో చేర్చు”[సూరయె యూసుఫ్, ఆయత్101].

సంపూర్ణ మరియు అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం
అల్లాహ్ ఖుర్ఆన్ లో ప్రకటించెను: “నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్19].

రిఫరెన్స్
1. సూరయె యూసుఫ్, 39వ ఆయత్ యొక్క భావం
2. ఖామూసె ఖుర్ఆన్, భాగం2, పేజీ380
3. ఉదాహారణకు: సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్19,85 మరియు మాయిదహ్ ఆయత్3, సూరయె సఫ్, ఆయత్7
4. తఫ్సీరె నమూనహ్, భాగం2, పేజీ643
5. తఫ్సీరె నమూనహ్, భాగం2, పేజీ643, 644

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12