హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స]

శుక్ర, 05/28/2021 - 08:33

హజ్రత్ ఇమామ్ అలీనఖీ(అ.స) అనుచరులైన హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ(అ.స) గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స]

పవిత్ర ఇమాముల ప్రముఖ సహాబీయులలో ఒకరు హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స]. ఇతను ఇమామ్ అలీ రిజా[అ.స], ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] మరియు ఇమామ్ అలీ నఖీ[అ.స]ల సహాబీయులలో లెక్కించబడతారు. వారు ఇతనిని చాలా ప్రశంసించేవారు. హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] ఇమామ్ హసన్[అ.స] యొక్క మనమల నుండి ఒకరు. ఇతను హిజ్రీ యొక్క 173వ సంవత్సరంలో రబీవుల్ అవ్వల్ యొక్క 4వ తారీఖున మదీనహ్ పట్టణంలో జన్మించారు. ఇతను ధర్మనిష్ట, విధేయత కలిగిఉండటంతో పాటు మంచి జ్ఞానం గలవారు. ఇతను ఇమామ్ అలీ నఖీ[అ.స] కాలంలో ఇమామ్ యొక్క ఆజ్ఞానుసారం ఇరాన్ ప్రజల హిదాయత్ కోసం వలసపోయి ఇప్పటి టహ్రాన్ పట్టణానికి దగ్గర ఉన్న “రయ్” పట్టణాన్ని నివాసంగా ఎంచుకున్నారు. “రయ్” పట్టణానికి హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] యొక్క రాక ద్వార ఆ పట్టణంలో షియాలు ఉండేవారని మరియు షియా విశ్వాసాల ప్రచారం కోసం మంచి అవకాశం లభించిందని తెలుస్తుంది. దాదాపు హిజ్రీ యొక్క 250వ ఏట హజ్రత్ అబ్దుల్ అజీమె హసనీ[అ.స] దుర్మార్గుల చేత చంపబడ్డారు. ఇప్పుడు అతని సమాధి రయ్ పట్టణంలోనే ఉంది. పవిత్ర మాసూమ్[అ.స] వచనానుసారం “అతని సమాధి దర్శనం ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనంతో సమానం”.

ముహద్దిస్
షాహ్ అబ్దుల్ అజీమె హసనీ(అ.స) ఒక గొప్ప ముహద్దిస్ కూడాను. ఇబ్నె తబాతబాయి వారి గురించి ఇలా అన్నారు: “هو المحدث الزاهد”[1] ఆయన ముహద్దిస్ అని చెప్పడంతో పాటు వారు జాహిద్ అని కూడా తాకీద్ చేశారు. వారి జియారత్ పత్రంలో ఇలా ఉంది: “అస్సలాము అలైక అయ్యుహల్ ముహద్దిసుల్ కరీమ్”. పన్నెండు మంది మాసూముల తర్వాత ఎక్కువగా సంప్రదించబడ్డ ముహద్దిసీనులలో ఈ ముగ్గురి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి; 1. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) 2. సల్మానె ఫార్సీ 3. అబ్దుల్ అజీమె హసనీ(ఇమామ్ అలీనఖీ(అ.స) నుండి).[2]
ఒక వ్యక్తి ఇలా ఉల్లేఖించెను: నేను ఇమామ్ అలీనఖీ(అ.స) వద్దకు వెళ్లాను ఆయనతో హలాల్ హరామ్ గురించి ప్రశ్నించాడు వారు సమాధానం ఇచ్చారు. స్వస్థాలానికి తిరిగి వెళ్లడానికి బయలుదేరుతుండగా వారు ఇలా అన్నారు: అబా హిమాద్! ధర్మజ్ఞానంలో ఏదైనా సందేహం వస్తే రయ్ పట్టణంలో వున్న అబ్దుల్ అజీమ్ ఇబ్నె అబ్దుల్లాహ్ హసనీను ప్రశ్నించి తెలుసుకో, వారికి నా సలాములు తెలియపరుచు.[3]
అబ్దుల్ అజీమె హసనీకి ఇమాములతో దగ్గర సంబంధం ఉండడం, దౌర్జన్యులతో పోరాడడం వంటి విషయాల వల్ల ముతవక్కిల్ దృష్టిలో వచ్చారు దాంతో వారిని మదీనహ్ నుండి సామెరహ్ కు బహిష్కరించబడ్డారు, అక్కడ వారిపై గట్టి నిఘా ఉండేది[5] కొంతకాలం తరువాత ఇమామ్ అలీ నఖీ(అ.స) ఆజ్ఞానుసారం రయ్ పట్టణానికి వెళ్లి అక్కడే రహస్యంగా జీవితాన్ని కొనసాగించారు.[6] రయ్ పట్టణానికి చేరిన తరువాత ఒక ప్రదేశంలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉండేవారు, పగలు ఉపవాస దీక్ష మరియు రాత్రుళ్లు నమాజ్ లో గడిపేవారు.[7] కొద్దిరోజుల్లోనే వారి గురించి అందరికి తెలిసింది, అహ్లెబైత్(అ.స) అనుచరులు అక్కడకి వచ్చి చేరారు.[8]

రిఫరెన్స్
1. మన్తఖలతుత్తాలిబియహ్, పేజీ157
2. అల్ రవాషిహ్ అస్మావియహ్, పేజీ50
3. రౌజాతుల్ జన్నాత్, భాగం4, పేజీ208
4. బిహారుల్ అన్వార్, భాగం3, పేజీ41
5. మురవ్విజ్ అల్ జహబ్, భాగం2, పేజీ11
6. జన్నతున్నయీమ్, పేజీ328
7. జామిఅర్ర్ రువ్వాత్, పేజీ461       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15