సైన్యాధిపతి హజ్రత్ హంజా(అ.స)

ఆది, 05/30/2021 - 18:00

దైవప్రవక్త(స.అ) యొక్క పిన తండ్రి అయిన హజ్రత్ హంజా(అ.స) గురించి సంక్షిప్త వివరణ...

సైన్యాధిపతి హజ్రత్ హంజా(అ.స)

మనిషి యొక్క చర్య మరియు వాటి ప్రభావం ఇస్లాం యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకొని పోయేటట్లు ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగివున్న వారిలో దైవప్రవక్త(స.అ) యొక్క పిన తండ్రి హజ్రత్ హంజా(అ.స) ఒకరు. ఇక్కడ వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం:

జీవితాంతం ధర్మనిష్ట మరియు పవిత్రత.,
అరేబీయుల అజ్ఞాన కాలంలో అలాగే ఇతర వర్గాలలో కూడా సాధారణంగా ఒకరిని కారణం లేకుండా గౌరవనీయులుగా, శక్తివంతులుగా, ప్రభావితులుగా అంగీకరించరు. హజ్రత్ హంజా(అ.స) దైవప్రవక్త(స.అ) బేసత్(దౌత్య ఎన్నిక)కు ముందు నుంచే అరేబీయు వర్గాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగివుండేవారు. వారి ఈ స్థానం వారి యొక్క వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది.
వారి యొక్క నైతిక లక్షణాలు
కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, ఆథిత్యం, మాటలో సత్యం, పవిత్రత, పేదవారి మరియు అనాధుల పక్షం, అన్యాయానికి గురి అయిన వారికి సహాయం లాంటి లక్షణాలు హజ్రత్ హంజా(అ.స)లో ఉండేవి. అరేబీయులు తమ అజ్ఞాన కాలం అనగా షిర్క్, విగ్రాహారాధనలలో గడుపుతున్న కాలంలో హజ్రత్ హంజా(అ.స)లో ఈ నైతిక లక్షణాలు ఉండేవి.[1][2] అందుకనే దైవప్రవక్త(స.అ) తమ పినతండ్రి పట్ల ప్రత్యేక గౌరవం కలిగివుండేవారు. దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నా సోదరులలో అలీ ఇబ్నె అబీతాలిబ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం మరియు నా పినతండ్రులలో హంజా అంటే నాకు ఎక్కువ ఇష్టం”[3]
హజ్రత్ హంజా(అ.స) యొక్క విశ్వాసం
వారి ప్రతిష్టతలలో ఒకటి ఇస్లాం స్వీకరించడంలో ముందుగా ఉండడం. వారి ముస్లిముల సంఖ్య తక్కువ మరియు శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడే, వారు ఇస్లాంను స్వీకరించారు. ఇది దీన్ పట్ల వారికి ఉన్న జ్ఞానం మరియు ప్రతిష్టత ఎరకకు నిదర్శనం. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: “ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధంచేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు గొప్ప సాఫల్యం అంటే ఇదే”[సూరయె తౌబహ్, ఆయత్100]
హజ్రత్ హంజా మరియు హజ్రత్ అబూతాలిబ్(అ.స)లు ఇస్లాం ముందు దశలోనే విశ్వసించి తమ విశ్వాసాన్ని గుప్తంగా ఉంచినవారిలో ఉండేవారు, దైవప్రవక్త(స.అ) సహాయంలో ఎటువంటి హద్దులను లెక్క చేసేవారు కాదు.
వారు అబూజహ్ల్ ద్వార దైవప్రవక్త(స.అ) పట్ల జరిగే దౌజ్ఞన్యం ముందు తన మౌనాన్ని విడిచి దైవప్రవక్త(స.అ) పట్ల ఉన్న వారి విశ్వాసాన్ని వ్యక్తం చేసి అబూజహ్ల్ తో ఇలా అన్నారు: “నువ్వు ముహమ్మద్ ను దూషిస్తున్నావు, నీకు తెలియదా నేను అతడి ధర్మాన్ని విశ్వసిస్తున్నానని. అతడు ఏది చెపుతున్నాడో నేను అదే చెబుతున్నాను. దమ్ముంటే ఇప్పుడు నన్ను దూషించు!”[4] ఆ తరువాత వారు దైవప్రవక్త(స.అ) ముందు వెళ్లి తన విశ్వాసాన్ని ఆయన ముందు వ్యక్తం చేశారు.

విలాయత్ అనుచరణ
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఆయన పట్ల ఆయన ప్రవక్త పట్ల మరియు ఔలియాల పట్ల విధేయత కలిగివుండమని ఆదేశిస్తున్నాడు: “ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు విధేయత చూపండి. ప్రవక్త(స.అ)కు విధేయత చూపండి. మరియు మీలోని విలాయత్ కలిగివున్న అధికారులకు కూడా”[సూరయె నిసా, ఆయత్59]
హజ్రత్ హంజా(స.అ) విలాయత్ పట్ల విధేయత కలిగివుండే విషయంలో ఉత్తమ నమూనా. వారిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, ఖురైషీయులలో గొప్ప స్థానం కలిగివున్నప్పటికీ దైవప్రవక్త(స.అ) ఆజ్ఞనను వినయంగా స్వీకరించి దానిని అమలు పరిచేవారు.
వారి విలాయత్ పట్ల విధేయత గురించి తెలుసుకోవాలంటే హజ్రత్ అలీ(అ.స) వారి ఖిలాఫత్ ను వారి నుంచి కొంతమంది చేదించుకున్నప్పుడు హజ్రత్ హంజా(అ.స) గుర్తు చేస్తూ ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా ఒకవేళ హంజా మరియు జాఫర్ గనుక ప్రాణాలతో ఉండి ఉంటే ఖిలాఫత్ ను పొందాలని దౌర్జన్యులు ఆశపడేవారు కాదు, కాని మేము జయీఫ్ మరియు బలహీన ప్రజలు కలిగివున్నాము”[5]

వీరమరణం
వారి వీరత్వం మరియు శౌరత్వం చరిత్రలో ప్రసిద్ధత చెందిన విషయమే. ఇస్లాం యొక్క మొదటి యుద్ధం హజ్రత్ హంజా(అ.స) ఆధిపత్యంలో జరిగింది.[6] ఒక విశ్వాసుడికి అత్యుత్తమ గౌరవ పతకం, అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలను అర్పించుకోవడం అయితే హజ్రత్ హంజా(అ.స) కు దక్కిన గౌరవ పతకం అంతకు మించినది. వారి గౌరవ పతకం పేరు “సయ్యదుష్ షుహదా”(అమరుల నాయకుడు).
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) సూరయె అహ్జాబ్ యొక్క 23వ ఆయత్ వ్యాఖ్యానం క్రమంలో ఇలా ప్రవచించారు: “విశ్వాసులలో కొందరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపినవారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా, మరి కొందరు (అవకాశం కోసం) ఎదురు చూస్తున్నారు. వారు (తమ పోరాట స్పూర్తిలో ఎలాంటి మార్పు రానివ్వలేదు” فَمِنْهُمْ مَنْ قَضى‏ نَحْبَهُ అనగా హంజా మరియ జాఫర్ ఇబ్నె అబీతాలిబ్ وَ مِنْهُمْ مَنْ يَنْتَظِرُ అనగా అలీ(అ.స) అని అర్ధం”[7]
చరిత్ర ప్రకారం హజ్రత్ హంజా(అ.స) శక్రవారం మరియు శనివారం యుద్ధంలో వీరమరణం పొందే సమయంలో ఉపవాసదీక్షలో ఉన్నారు.[8]    

రిఫరెన్స్
1. హంజా సయ్యదుష్ షుహదా, గులామ్ రిజా గులీ జవ్వారెహ్, పాస్దారె ఇస్లాం, 401, 402, షుమారెహ్34, 1394, పేజీ58-62
2. అల్ మున్మిఖ్ ఫీ అఖ్బారి ఖురైష్, ఆలముల్ కుతుబ్, బీరూత్, పేజీ243
3. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాస్ అల్ అరబీ, బీరూత్, భాగం22, పేజీ275, హదీస్23
4. అల్ సీరతున్నుబలా, ఇబ్నె హిషామ్, దారుల్ మారిఫత్, బీరూత్, భాగం1, పేజీ292
5. తొహ్ఫతుల్ అహ్బాబ్, షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, పేజీ120
6. అల్ తబఖాతుల్ కుబ్రా, దారుల్ కుతుబిల్ ఇల్మియహ్, మన్షూరాతె మొహమ్మద్ అలీ బైజూన్, బీరూత్, భాగం3, పేజీ5
7. తఫ్సీరె ఖుమ్మీ, అలీ ఇబ్నె ఇబ్రాహీమె ఖుమ్మీ, దారుల్ కితాబ్, ఖుమ్, 1404, భాగం2, పేజీ188
8. హంజా సయ్యదుష్ షుహదా, గులామ్ రిజా గులీ జవ్వారెహ్, పాస్దారె ఇస్లాం

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3