జీవనశైలి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) దృష్టిలో

మంగళ, 06/01/2021 - 15:40

నిజమైన షియా యొక్క ప్రత్యేకతలు వారి జీవనశైలి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) దృష్టిలో...

జీవనశైలి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) దృష్టిలో

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) గురించి సంక్షిప్త వివరణ:
పదవీ: దైవప్రవక్త[స.అ] 6వ ఉత్తరాధికారి.
పేరు: జాఫర్[అ.స].
కున్నియత్: అబూ అబ్దిల్లాహ్.
బిరుదు: సాదిఖ్.
తండ్రి పేరు: ముహమ్మద్ బాఖిర్[అ.స]
తల్లి పేరు: ఉమ్మె ఫర్వా[అ.స]
జన్మదినం: రబీవుల్ అవ్వల్ నెల 17వ తారీఖు, హిజ్రీ యొక్క 83వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 114వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
వయస్సు: 65 సంవత్సరాలు.
ఖాతిల్: మన్సూరె దవానెఖీ.
మరణం: హిజ్రీ యొక్క 147వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: జన్నతుల్ బఖీ.[1]

పవిత్ర ఇమాముల ద్యార వారి అనుచరుల జీవనశైలిని వివరిస్తూ చాలా రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి వాటి నుండి ఒక రివాయత్ ఆధారంగా వారి నిజమైన షియా యొక్క ప్రత్యేకతలు ఏమిటి అని ఇక్కడ వివరిస్తున్నాము.

మొదటి ప్రత్యేకత: దాతృత్వం ధర్మగణం
నైతిక గుణాలలో ప్రత్యేక గుణం ధర్మగుణం ఇది నిజమైన షియా జీవితంలో కనబడాలి. ఇటువంటి జీవితంలో దైవత్వప్రభావం ఉంటుంది. నిజమైన షియా ఖుర్ఆన్ ను పాటిస్తూ వాటిలో ఉన్న ఉపదేశాలను అనుచరించడంలో ముందుగా ఉంటాడు. ఖుర్ఆన్ యొక్క ముఖ్యమైన ఉపదేశాలలో ఒకటి సమాజం పట్ల బాధ్యత కలిగివుండడం అనగా పేదవారిని సహాయం చేయడం, ఎదుటివారి కష్టాలను దూరం చేయడం. “వారి ధనంలో యాచించేవారికి, యాచించని పేదవారికి కూడా హక్కుండేది”[సూరయె జారియాత్, ఆయత్19] దీనిని మీరు ఈ కరోనా రోజుల్లో తిలకించే ఉంటారు.

రెండవ ప్రత్యేకత: అల్లాహ్ ఆరాధన మరియు నవాఫిల్ పట్ల ప్రాధాన్యత
నిజమైన షియాల మరో ప్రత్యేకత అల్లాహ్ ఆరాధన మరియు నవాఫిల్ పట్ల ప్రాధాన్యత కలిగి వుండడం. రోజుకు వాజిబ్ మరియు నవాఫిల్ నమాజులు 51 రక్అతులు, వాటి నుండి 17 రక్అతులు మాత్రమే వాజిబి నమాజుకు సంబంధించినవి మిగిలినవి నవాఫిల్ నమాజులు. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: “రోజుకు 51 రక్అతుల నమాజులు చదవండి”[2]

3 మరియు 4వ ప్రత్యేకతలు: మంచి మాట మరియు దూకుడూ, అత్యాశలకు దూరం
సాధారణంగా కొన్ని మంచి మరియు చెడు లక్షణాలు జంతువుల కోసం ప్రత్యేకిస్తూ ఉంటారు. ఉదాహారణకు కుక్క తెలియని వ్యక్తి చూడగానే దాడి చేస్తుంది లేదా మొరుగుతుంది, ఇది దానిలో ఉన్న దూకుడుకు నిదర్శనం. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఒక రివాయత్ లో ఇలా ఉల్లేఖించారు: “మా షియాలు, కుక్కలా మొరగరు మరియు కాకిలా అత్యాశ పడరు”[3] ఈ హదీస్ లో ఇమామ్ చెప్పాలనుకున్న విషయమేమిటంటే నిజమైన షియా ఎదుటివారిని కష్టపెట్టరు మరియు అలాగే ఇతరుల సొప్పుపై ఆశపడరు.

5 మరియు 6వ ప్రత్యేకతలు: శత్రువుల ముందు ఆత్మ గౌరవం మరియు వారి నుండి దూరం
మనిషి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కలిగివుండడం ద్వార సమాజంలో తల ఎత్తుకొని తిరగగలడు. దీని వల్ల మనిషి జీవితంలో అత్యాశ అనేది రాదు. దాంతో ఒకరి ముందు చేతులు చాచరు వారు అల్లాహ్ కు మరియు ఆయన ఔలియాలకు తప్ప ఎవరినీ ఆశ్రయించరు. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “మా షియా లు ఆకలితో తమ ప్రాణాలను వదిలేస్తారు కాని మా శత్రువుల ముందు సహాయం కోసం చేతులు చాచలు”[4]

రిఫరెన్స్
1. సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, పేజీ95, దారుల్ ఇల్మ్, 1388.
2,3,4. తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ303       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16