ఖుర్ఆన్ మరియు దాని వ్యాఖ్యానం

శుక్ర, 06/04/2021 - 11:56

ఖుర్ఆన్ మరియు దాని వ్యాఖ్యానం షియా మరియు అహ్లెసున్నత్‌ల దృష్టిలో...

ఖుర్ఆన్ మరియు దాని వ్యాఖ్యానం

“ఖుర్ఆన్” అల్లాహ్ తరపు నుండి దైవప్రవక్త‎(స.అ)‎ పై అవతరింపబడ్డ గ్రంథం. అందులో ఎటువంటి అసత్యానికి చోటు లేదు. “ఖుర్ఆన్” ముస్లిములకు తమ జీవిత ఉపదేశాలలో, ప్రార్ధనలలో, విశ్వాసాలలో పెద్ద మూలం. అందులో ఉన్న విషయాలను నిరాకరించినా, సందేహించినా లేదా ధిక్కారించిన వాడు ముస్లిమే కాదు. ఖుర్ఆన్ పట్ల ఆదరణ, పవిత్రత మరియు “వుజూ” లేకుండా దానిని తాకకూడదనే అంశాలలో ముస్లిములందరు(షియా మరియు సున్నీయులు) ఏకాభిప్రాయం కలిగివున్నారు.
కాని ఖుర్ఆన్ వ్యాఖ్యానం మరియు అంతర్ధాలను తెలుసుకునే పద్ధతులలో ఇరు వర్గాల వాళ్ళలో అభిప్రాయభేదం కలదు. షియా ముస్లింలు “ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం మరియు అంతర్ధాలను తెలుసుకోవడానికి అహ్లెబైత్(అ.స)లను ఆశ్రయిస్తారు”.
అహ్లె సున్నత్‌లు “సహాబీయులను లేదా ఆయిమ్మయే అర్బఅ(అబూ హనీఫా, అహ్మద్ బిన్ హంబల్, షాఫెయి, మాలిక్)ను ఆశ్రయిస్తారు”. ఈ విధంగా చూసినట్లైతే వాళ్ళ ఆదేశాలలో ముఖ్యంగా ఫిఖా ఆదేశాలలో అభిప్రాయభేదం ఉండడం సహజం. ఇలా స్వయంగా అహ్లెసున్నతుల ఆ నాలుగు వర్గాల వారిలోనే అభిప్రాయభేదం ఉంది అని స్పష్టం అయినప్పుడు ఇక ఆ నాలుగు వర్గాల మరియు షియా ముస్లిముల వర్గంలో అభిప్రాయభేదం ఉండడం అనేది చాలా స్పష్టమైన విషయం.
“దైవప్రవక్త‎(స.అ)‎, ఖుర్ఆన్ యొక్క ఉపదేశాలన్ని ముస్లిములకు ప్రవచించారు మరియు ఆయతులన్నీంటిని వివరించారు” అనే అంశం పై ముస్లిములందరు(షియా మరియు అహ్లెసున్నతులు) ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాని వాళ్ళ మధ్య గల అభిప్రాయభేదం “దైవప్రవక్త‎(స.అ)‎ మరణాంతరం ఖుర్ఆన్ వ్యాఖ్యానం మరియు అంతర్ధాల కోసం ఎవరిని ఆశ్రయించాలి?” అని. అందుకు అహ్లెసున్నత్‌లు ఖుర్ఆన్ వ్యాఖ్యానం గురించి ఇలా అన్నారు: “ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం తెలుసుకోవాలంటే, అందుకు అందరి కన్నా ముందుగా సహాబీయులందురు అర్హులు, ఆ తరువాత ఉలమాలు అర్హత గలవారు”. మరియు అంతర్ధాల గురించి చెప్పాలంటే అహ్లె సున్నత్‌లలో ఎక్కువ మంది ఇలా అన్నారు: “అల్లాహ్ తప్ప ఖుర్ఆన్ అంతర్ధాలు తెలిసినవాడు లేడు”.
అహ్లెసున్నతులందరూ “ఖుర్ఆన్ యొక్క పరమార్ధం అల్లాహ్ తప్ప మరెవ్వరికీ తెలియదు” అని నమ్ముతారు. కాని షియా ముస్లింలు “ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స), ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం మరియు అంతరర్ధాన్ని చెప్పడానికి అర్హులు” అని నమ్ముతారు, ఎందుకంటే అహ్లెబైత్(అ.స)లు పరిపక్వ జ్ఞానం గలవారు మరియు దైవ స్మరుణులు కాబట్టి. మరియు అల్లాహ్, ఖుర్ఆన్ అంతరర్ధాల కోసం వాళ్ళనే ఆశ్రయించమని ఆదేశించాడు: “(ఓ ప్రవక్తా) వాళ్ళతో ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసినవారిని అడిగి తెలుసుకోమని చెప్పండి”[సూరయె నహ్ల్, ఆయత్:43]
అల్లాహ్ చేత ఎన్నుకో బడ్డ మరియు ఖుర్ఆన్ గ్రంథం యొక్క జ్ఞానం ప్రసాదింపబడ్డ వాళ్ళు వీరే. ఈ విషయాన్నే ఖుర్ఆన్‌లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: “ఆ తరువాత మేము ఈ గ్రంథానికి వారసులుగా మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే నిర్ధారించాము”(సూరయె ఫాతిర్, ఆయత్:32]
అందుకే దైవప్రవక్త‎(స.అ)‎ అహ్లెబైత్‌(అ.స)లను ఖుర్ఆన్‌తో సమానులుగా నిర్ధారిస్తూ ఆ రెండు భారి విలువైన వాటిలో ఒకటిగా ప్రకటించి ముస్లిములందరిని వారితో కలిసి ఉండమని ఆదేశించారు. ఆ హదీస్: “నేను రెండు అమూల్యమైన వస్తువులను మీ మధ్య వదిలి వెళ్తున్నాను, అల్లాహ్ గ్రంథం మరియు నా ఇత్రత్, అహ్లెబైత్(అ.స). నా తరువాత వాటిని ఆశ్రయించినంత వరకు ఎప్పటికీ మార్గభ్రషులు కాలేరు” [1]
“సహీ ముస్లిం”లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స), నా అహ్లెబైత్(అ.స) గురించి ప్రత్యేకంగా చెబుతున్నాను”[2]
ఖుర్ఆన్‌కు బాహ్యభాగం మరియు అంతర్భాగం, వ్యాఖ్యానం మరియు అంతరార్థం తప్పకుండా ఉంటాయి. మరి అహ్లెబైత్(అ.స)లకు వాటన్నీంటి జ్ఞానం కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్, ఖుర్ఆన్‌ను అన్ని విధాలుగా తెలుసుకునే జ్ఞానాన్ని అందరికి ప్రసాదించడం అనే విషయం అవివేకమైనది అందుకే అల్లాహ్ స్వయంగా ఇలా ప్రవచించెను: “అసలు అర్ధాన్ని అల్లాహ్ మరియు పరిపక్వ జ్ఞానం గల వారు తప్ప మరెవ్వరికి తెలియదు”[సూరయె ఆలిఇమ్రాన్, ఆయత్:7]
అందుకే  ٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ(పరిపక్వ జ్ఞానం గలవారు) తప్ప ఉలమాలు ఖుర్ఆన్ వ్యాఖ్యానంలో అభిప్రాయభేదానికి గురి అవుతారు. ఎందుకంటే అల్లాహ్ ప్రవచనం ప్రకారం ఖుర్ఆన్ యొక్క అంతరార్ధం వాళ్ళకు తెలుసు అందుకే వాళ్ళు దాని వ్యాఖ్యానంలో అభిప్రాయభేదానికి గురి కారు. అహ్లెబైత్(అ.స)లు ప్రజలందరిలో అందరి కంటే జ్ఞానులు, ఉత్తములు, అల్లాహ్ భీతిగల వారు, పవిత్రులు.

రిఫరెన్స్
1. సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ329. అలాగే నిసాయి మరియు ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ కూడా ఈ రివాయత్‌ను వ్రాశారు.
2. సహీ ముస్లిం, భాగం2, పేజీ362, బాబొ ఫజాయిలి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)) ఈ వాక్యాన్ని మూడు సార్లు చెప్పారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14