సృష్టికర్త ఉన్నాడు

శుక్ర, 06/04/2021 - 17:35

సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం పై ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) నిదర్శనం మరియు జిందీఖ్ విశ్వాసిగా మారడం...

సృష్టికర్త ఉన్నాడు

షేఖ్ కులైనీ హదీస్ యొక్క అమూల్యమైన గ్రంథం “కాఫీ”లో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క అల్లాహ్ ను నమ్మని వారితో చేసిన వాదన రివాయతులు ఉల్లేఖించారు. అల్లాహ్ ను నమ్మని వారిని ఆ కాలంలో “జిందీఖ్” అని పిలవబడేవారు. జిందీఖులతో జరిగిన చర్చలలో ఒకటి;
ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి అల్లాహ్ ఉన్నాడా అన్న విషయంపై చర్చించడానికి ఇమామ్ సాదిఖ్(అ.స) వద్దకు వచ్చాడు, వారి మధ్య జరిగిన చర్చ:
రివాయత్ ను హిషామ్ ఇబ్నె హకమ్ ఇలా ఉల్లేఖించెను: “ఈజిప్టుకు చెందిన ఒక జిందీఖ్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) చెప్పిన మాటలు విన్న తరువాత, అతడు ఇమామ్ తో వాదించడానికి మదీనహ్ కు వచ్చాడు. అతడు అక్కడికి వచ్చినప్పుడు ఇమామ్ మక్కాలో ఉండడంతో ఇమామ్ ను కలవడానికి అతడు మక్కాకు వచ్చాడు. మేము ఇమామ్ సాదిఖ్(అ.స)తో కలిసి కాబా ప్రదక్షణాలు చేస్తుండగా అతడు అక్కడికి వచ్చాడు. అతడి పేరు ‘అబ్దుల్ మలిక్’ మరియు అతడి కున్నియత్ ‘అబూ అబ్దిల్లాహ్’. మేము కాబా ప్రదక్షణలు చేస్తుండగానే తన భుజాన్ని ఇమామ్ భుజానికేసి కొట్టాడు. ఇమామ్ ‘నీ పేరేంటి?’ అని ప్రశ్నించారు. నా పేరు ‘అబ్డుల్ మలిక్’(సూల్తాన్ దాసుడు) అని అన్నాడు. ఇమామ్ నీ కున్నియత్ ఏమిటి? అని అడిగారు.  అతడు ‘అబూ అబ్దిల్లాహ్’(అల్లాహ్ దాసుడి తండ్రి) అన్నాడు. అప్పుడు ఇమామ్ అతడితో ఇలా అన్నారు: నువ్వు దాసుడిగా ఉన్న ఆ సుల్తాన్ ఎవరు? భూమికి సుల్తానా లేకా ఆకాశానికి సుల్తానా? అలాగే నీ కొడుకు, ఆకాశ ప్రభువుకు దాసుడా లేక భూమి యొక్క ప్రభువుకు దాసుడా?’ దాంతో అతడు మౌనంగా ఉండిపోయాడు.
నేను(హిషామ్) ఆ జిందీగ్ తో ఎందుకు ఇమామ్ కు సమాధానం ఇవ్వడం లేదు? అని అడిగాను. అతడు నా మాట విని కోప్పడ్డాడు. ఇమామ్ సాదిఖ్(అ.స) అతడితో ‘ప్రదక్షణలు పూర్తయిన తరువాత నా వద్దకు రా’ అని అన్నారు. ఆ జిందీఖ్ ఇమామ్ యొక్క ప్రదక్షణలు పూర్తయిన తరువాత వచ్చి ఇమామ్ కు ఎదురుగా కూర్చున్నాడు. మేము కూడా ఇమామ్ కు చ్రుట్టుముట్టి కూర్చున్నాము. ఇమామ్ ఆ జిందీఖ్ తో ఇలా అన్నారు: ‘నువ్వు ఈ భూమికి ఒక పై భాగం ఒక క్రింది భాగం ఉంది అని నమ్ముతావా?’
జిందీఖ్: ఔను (నమ్ముతాను)
ఇమామ్: భూమి లోపలికి వెళ్ళావా?
జిందీఖ్: లేదు (వెళ్ళ లేదు)
ఇమామ్: అయితే భూమిలోపల ఏముందో నీకు ఎలా తెలుసు?
జిందీఖ్: నాకు తెలియదు, కాని భూమిలోపల ఏమి ఉండదు అని భావిస్తున్నాను
ఇమామ్: అనుమానం నిస్సహాయత. ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు: నువ్వు ఆకాశంపైకి వెళ్లావా?
జిందీఖ్: లేదు (వెళ్లలేదు)
ఇమామ్: ఆకాశంలో ఏమున్నాయో నీకు తెలుసా?
జిందీఖ్: లేదు (తెలియదు)
ఇమామ్: ఆశ్చర్యకరం, నువ్వు తూర్పుపడమరలకు ప్రయాణం చేయలేదు, భూమిలో ఏముందో చూడలేదు, ఆకాశంలో ఏముందో తెలుసుకోవడానికి పైకి వెళ్లలేదు, ఇవి చూడకుండానే (వాటిలో ఉన్న క్రమాన్నీ, జ్ఞానాన్ని ఏవైతే సృష్టికర్త ఉన్నాడనే వాటినికి నిదర్శిస్తున్నాయో) సృష్టికర్తను నిరాకరిస్తున్నావు. ఎక్కడైనా బుద్ధిమంతుడు దేనినైతే అర్థం చేసుకోలేదో దానిని నిరాకరిస్తాడా?!
జిందీఖ్: ఇప్పటి వరకు మీరు తప్ప ఎవ్వూర ఇలా మాట్లాడలేదు. అప్పుడు ఇమామ్ ఇలా అన్నారు: అయితే నువ్వు ఈ విషయంలో సందేహం కలిగి ఉన్నావు ఉండవచ్చూ లేదా లేకపోవచ్చు! అని. అతడు ఔను అని సమాధానమిచ్చాడు. దానికి ఇమామ్ ఇలా అన్నారు: ‘చూడూ తెలియని విషయంతో తెలిసిన విషయాన్ని నిదర్శించలేము, తెలియకపోవడం సాక్ష్యం కాదు. ఈజిప్టు సోదరా నేను చెప్పేది విని తెలుసుకో, మేము అల్లాహ్ విషయంలో ఎటువంటి సందేహము కలిగి లేము. ఈ సూర్యచంద్రులను, రాత్రిపగళ్లను చూడడం లేదా అవి ఎలా ఒకటి తరువాత మరొకటి క్రమంగా తిరుగుతున్నాయో, ఇలా తిరగడంలో వారు నిస్సహాయులు, వాటికి శక్తి గనక ఉండి వుంటే వెళ్లిపోయిన తరువాత తిరిగి ఎందుకు వస్తున్నట్లు. నిస్సహాయం లేకపోతే రాత్రి ఎందుకు పగలుగా మారలేకపోతుంది? ఓ ఈజిప్టు సోదరా అల్లాహ్ సాక్షిగా అవి నిస్సహాయులు, అవి ఎవరి ఆజ్ఞ ప్రకారం అలా చేస్తున్నాయే ఆ అధికారి వీటికి మించిన శక్తివంతుడు.
జిందీఖ్: నిజం చెప్పారు.
ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు: ‘ఈజిప్టు సోదరా! నిస్సందేహంగా నీవు ప్రపంచంగా భావిస్తున్న ఈ లోకం, ఒకవేళ ప్రజలను తీసుకెళ్తున్నట్లైతే వారిని ఎందుకు తిరిగి తీసుకొని రావడం లేదు? ....... ఓ ఈజిప్టు సోదరా! ప్రతీదీ నిస్సహాయం కలిగివుంది, ఆకాశం ఎందుకు పైకి మరియు భూమి క్రిందికి ఉంది, ఎందుకు ఆకాశం భూమిపై పడకుండా ఉంది, ఎందుకు భూమి వెళ్ళి ఆకాశానికి అంటుకొని భూమిపై ఉన్న వారు నాశనం కాకుండా ఉన్నారు’
ఇమామ్ యొక్క ఈ మాటుల విని జిందీఖ్ విశ్వాసిగా మారాడు”[1]

రిఫరెన్స్
1. అల్ కాఫీ, షేఖ్ కులైనీ, భాగం1, పేజీ72        

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13