.షైఖ్ తూసీ[ర.అ] రచించిన మొదటి పుస్తకం మరియు షియా హదీసుల మూల గ్రంథాలలో ఒకటైన గ్రంథం “తహ్జీబుల్ అహ్కామ్”.
“తహ్జీబుల్ అహ్కామ్” గ్రంథాన్ని షైఖ్ తూసీ[ర.అ] రచించారు. ఇది షియా హదీస్ నాలుగు మూల గ్రంథాల నుండి ఒకటి. ఈ గ్రంథం యొక్క పూర్తి పేరు “తహ్జీబుల్ అహ్కామ్”, కాని సంక్షిప్తంగా కేవలం “తహ్జీబ్” అని కూడా అంటూ ఉంటారు. ఈ గ్రంథం షైఖ్ తూసీ[ర.అ] బగ్దాద్కు వచ్చిన మొదట్లో మరియు వారి ఉపాద్యాయులైన మర్హూమ్ “షైఖ్ ముఫీద్”[ర.అ] గారి జీవితంలోనే రచించిన మొదటి గ్రంథం. వాస్తవానికి ఈ గ్రంథం వారి ఉపాద్యాయులైన మర్హూమ్ “షైఖ్ ముఫీద్”[ర.అ] గారి ఫిఖా పుస్తకం అయిన “అల్ ముఖ్నెఅహ్” వ్యాఖ్యానం.
తహ్జీబుల్ అహ్కామ్ గ్రంథం యొక్క రివాయతున్ని ఫిఖాకు సంబంధించినవి. దాని శీర్షికలు “అల్ ముఖ్నెఅహ్” గ్రంథ శీర్షికల ప్రకారంగానే ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రంథం “కితాబ్ అల్ తహారత్” నుండి మొదలౌతుంది మరియు “కితాబ్ అల్ దియాత్” (పరిహారాలకు సంబంధించిన అహ్కాముల కితాబ్)తో అంతమౌతుంది. గ్రంథం చివరిలో “మషీఖా” అను శీర్షికతో హదీస్ రావీయుల క్రమాన్ని అక్కడ వివరించారు. తహ్జీబుల్ అహ్కామ్ గ్రంథంలో 14000 రివాయత్లు ఉన్నాయి.
వ్యాఖ్యానించండి