దైవప్రవక్త‎(స.అ)‎ యొక్క సున్నత్

ఆది, 06/06/2021 - 16:01

దైవప్రవక్త‎(స.అ)‎ యొక్క సున్నత్ షియా మరియు అహ్లెసున్నత్‌ల దృష్టిలో...

దైవప్రవక్త‎(స.అ)‎ యొక్క సున్నత్

“దైవప్రవక్త‎(స.అ) యొక్క సున్నత్‌” అనగా దైవప్రవక్త‎(స.అ) యొక్క ప్రవచనం, కార్యం మరియు తఖ్రీర్(ఎవరినైనా ఒక పనిని చేస్తుండగా చూసి అతడిని ఆ పనిని చేయకుండా ఆపివేయనటువంటి పని). దీనిని “సున్నతే రసూల్” లేదా “సున్నతే నబవీ” అని అంటారు. ఇస్లాం యొక్క ఉపదేశాలలో, ప్రార్ధనలలో మరియు విశ్వాసాలలో “సున్నత్” యొక్క స్థానం రెండవ స్థానం. ఖుర్ఆన్ యొక్క స్థానం మొదటి స్థానం.

అహ్లెసున్నత్‌లు ఇమామ్ “అహ్మద్ ఇబ్నె హంబల్” యొక్క ఒక్క రివాయత్ ఆధారంగా “దైవప్రవక్త‎(స.అ) యొక్క సున్నత్‌తో పాటు ‘ఖులాఫాయే రాషిదీన్’ –అనగా హజ్రత్ అబూబక్ర్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్ మరియు అలీ(అ.స)ల– సున్నత్‌ను కూడా జోడిస్తారు. ఆ హదీస్ ఇది: “మీరు నా సున్నత్ మరియు నా తరువాత ఖులఫాయే రాషిదీన్‌ల సున్నత్ పై అమలు చేయడం తప్పని సరి, దాని పై ఖచ్చితంగా అమలు చేయండి” “عليکم بسنتی و سنه الخلفاء الراشدين المهديين من بعدی، عضوا عليها بالنواجذ”[1]

దైవప్రవక్త(స.అ) తరావీహ్ నమాజును ఖండించారు.[2] అయిన సరే హజ్రత్ ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క అడుగుజాడలలో నడుస్తూ, వాళ్ళ తరావీహ్ నమాజు చదవడమే దీని పై గట్టి సాక్ష్యం. నిజానికి ఇది దైవప్రవక్త(స.అ) సున్నత్ కు వ్యతిరేకమైన చర్య. హజ్రత్ మూహమ్మద్(స.అ) ద్వార హలాల్ చేయబడిన అంశాలు ప్రళయదినం వరకు హలాల్ మరియు వారి హరామ్ గా నిర్ధారించిన అంశాలు ప్రళయదినం వరకు హరామ్"[3] అంటే దైవప్రవక్త(స.అ) ఆదేశాలను మార్చే హక్కు ఖులఫాయె రాషిదీన్ లకు కూడా లేదు. 

మరి కొందరు దైవప్రవక్త‎(స.అ) సున్నత్‌తో పాటు సహాబీయులందరి (ఎటువంటి సహాబీ అయిన సరే) సున్నత్‌ను కూడా జోడిస్తారు. ఈ విషయంపై వాళ్ళు ఒక హదీసును ఉల్లేఖిస్తారు: “నా సహాబీయులు నక్షత్రముల వంటి వారు, (వారిలో) ఎవరిని అనుసరించినా సరే రుజుమార్గం పొందగలవు”[4] మరో హదీస్: “నా సహాబీయులు నా ఉమ్మత్ కోసం శరణులు”

నిజానికి విషయం ఏమిటంటే “اصحابی کالنجوم” అను ఈ హదీస్, దైవప్రవక్త(స.అ) గారి మరో సరైన హదీస్‌ను ప్రతిఘటించుటకు తయారు చేయబడ్డ నకిలీ మరియు తప్పుడు హదీస్. మరి ఈ నిజం నుండి తప్పించుకోవడానికి దారి కూడా లేదు. ఆ అసలు హదీస్: الائمه من اهل بيتی کالنجوم، بايهم اقتديتم اهتديتم “నా అహ్లెబైత్(అ.స)లైన ఇమాముల ఉదాహారణ నక్షత్రములు లాంటిది, వాళ్ళ నుండి ఏ ఒక్కరిని అనుసరించినా నీవు రుజుమార్గాన్ని పొందుతావు”[5] మరి ఇది, నూటికి నూరు శాతం వివేకమైనది కూడాను. ఎందుకంటే అహ్లెబైత్(అ.స)లు, జ్ఞానంలో, పవిత్రతలో, అల్లాహ్ పట్ల భయభక్తిలో, ధర్మనిష్టలో సాటిలేని వారు. ఇలా అని వాళ్ళ అనుచరులే కాదు చివరికి వాళ్ళ శత్రువులు కూడా అంగీకరించారు. మరి చరిత్రలో ఇవన్ని దాచ కుండా లిఖించబడి ఉన్నాయి. కాని “اصحابی کالنجوم” లాంటి హదీసును సరళ బుద్ధి మరియు వివేకం అంగీకరించదు, ఎందుకంటే సహాబీయులలో కొందరు దైవప్రవక్త‎(స.అ) తరువాత మర్తద్(ఇస్లాం స్వీకరించిన తరువాత అవిశ్వాసం తరపు మరలి పోవడం.)గా మారారు. చాలా విషయాలలో విభేదాలకు గురైయ్యారు, దాంతో సహాబీయులలో కొందరిని, మరి కొందరు దూషించారు. చివరికి సహాబీయులలో కొందరు, మరి కొందరి పై లఅనత్ చేశారు. ఉదా‎:‎ ముఆవియా, అలీ(అ.స)పై లఅనత్ చేయమని ఉత్తర్వులు జారి చేశాడు.  వాళ్ళలో కొందరు మరి కొందరితో యుధ్దం చేశారు. ఉదా: జమల్, సిఫ్ఫీన్ మరియు నహర్వాన్ లాంటి యుధ్ధాలు. మరి కొందరు సహాబీయులు మధ్యం సేవించినందుకు, లేదా అత్యాచారం చేసినందుకు, లేదా దొంగతనం చేసినందుకు శిక్షించబడ్డారు. దైవప్రవక్త(స.అ) తరువాత సహాబీయుల పరిస్థితి ఇలా ఉండగా; సహాబీయుల అనుచరణ చేయమని ఆదేశమివ్వబడినటువంటి ఆ హదీస్‌ను ఒక బుద్ధిమంతుడు ఎలా అంగీకరించగలడు!?.

దైవప్రవక్త‎(స.అ), ముఆవియాను విద్రోహుల మరియు దుర్మార్గుల నాయకుడు అని అన్నారు. మరి అలాంటి వాడి మాటలు విని హజ్రత్ అలీ(అ.స)తో యుధ్ధం చేసిన వారు ఎలా రుజుమార్గం చూపించేవారు అవ్వగలరు!?.

అమవీయులను అధికారంలోకి తీసుకొని రావడానికై అమాయకులను చంపిన “అమ్ర్ బిన్ ఆస్”, “ముగైరహ్ బిన్ షఅబహ్” మరియు “బుస్ర్ బిన్ అర్తాహ్” లాంటి వారి మార్గంలో నడిచే వారు ఎలా రుజుమార్గ దర్శకులు అవ్వగలరు!?.

ఒకవేళ ఈ హదీస్ “అస్హాబీ కన్నుజూమ్”ను చదివినట్లైతే స్వయంగా మీరు తెలుసుకుంటారు ఈ హదీస్ నకిలీ మరియు తప్పుడు హదీస్ అని. ఎందుకంటే ఎంతకాదన్నా ఈ హదీస్ యొక్క అభిముఖులు సహాబీయులే, అయితే దైవప్రవక్త‎(స.అ) సహాబీయులను సంభోదిస్తూ “ఓ నా సహాబీయులారా! మీరు నా సహాబీయుల అడుగు జాడలలో నడవండి” అని ఎలా చెప్పగలరు!?. కాని వేరే హదీసులో ఇలా ప్రవచించబడి ఉంది “ఓ నా సహాబీయులారా! మీరు నా అహ్లెబైత్(అ.స)లను అనుసరించండి, ఎందుకంటే వారే నా తరువాత మీ మార్గదర్శకులు” ఈ హదీస్ పూర్తిగా సరైనది అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దీనిపై దైవప్రవక్త‎(స.అ) సున్నత్ ద్వారా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే షియా ముస్లింలు చెబుతూ ఉంటారు; ఈ హదీస్: عَلَيْكُمْ‏ بسُنَّتَي‏ و سُنَّةِ الخُلَفَاءِ الرّاشِدِينَ‏ المهديين مِنْ بَعْدِي‏ “నా సున్నత్ మరియు ఖులాఫాయే రాషిదీన్ల సున్నత్‌ను అనుసరించండి అదే నా తరువాత మీ మార్గదర్శి” లో ..ఖులాఫాయే రాషిదీన్.. అనగా అహ్లేబైతులు అని. వాళ్ళ అనుచరణనే దైవప్రవక్త‎(స.అ) వాజిబ్ అని చెప్పి వాళ్ళతో కలిసి ఉండమని ఆదేశించారు. ఎలాగైతే అల్లాహ్ గ్రంథం అనుచరణ ఆదేశించబడిందో అలాగే వాళ్ళ అనుచరణ కూడా ఆదేశించబడింది.[6]

రిఫరెన్స్
1. ముస్నదె ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, భాగం4, పేజీ126.
2. సహీబుఖారీ, భాగం7, పేజీ99, బాబొ మాయజూజు మినల్ గజబి వష్షిద్దతి లి అమ్రిల్లాహ్.
3. అల్ కాఫీ, మర్హూమ్ కులైనీ, భాగం1, పేజీ58
4. సహీ ముస్లిం, కితాబొ ఫజాయిలి స్సహాబహ్. ముస్నదె అహ్మద్ బిన్ హంబల్, భాగం4, పేజీ398.
5. దఆయిముల్ ఇస్లామ్, ఖాజీ.
6. లెఅకూన మఅస్సాదిఖీన్, తీజానీ, సున్నత్ పట్ల విశ్వాసం అధ్యాయం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8