హజ్రత్ మాసూమహ్(అ.స) అనుగ్రహం ఖుమ్ వాసుల పై

ఆది, 06/06/2021 - 16:08

ఇమామ్ అలీ రిజా(అ.స) యొక్క సొదరి అయిన హజ్రత్ మాసూమహ్(అ.స) అనుగ్రహం ఖుమ్ వాసుల పై హదీస్ ప్రకారం... 

హజ్రత్ మాసూమహ్(అ.స) అనుగ్రహం ఖుమ్ వాసుల పై

జీ ఖఅదహ్ నెల ఒకటో తారీకు, హిజ్రీ యొక్క 173వ సంవత్సరం, మదీనహ్ పట్టణంలో భూమ్యాకాశవాసులలో సందడి గడియాలు, దైవదూతలు మానవులకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు, అప్పడే పుట్టి ఆ పాప అరుపులతో మదీనహ్ ఆనందమయమయ్యింది, ఆ పాప తండ్రి ఇమామ్ మూసా ఇబ్నె జాఫర్(స.అ) తల్లి నజ్మా ఖాతూన్. మరి ఆ పుట్టిన పాప పేరు ..ఫాతెమా.. , తన చివరి నిమిషం వరకు పవిత్రంగా, పాపములకు దూరంగా ఉండడం వల్ల ఆమె పేరుతో మాసూమహ్ పదం కూడా జత అయ్యింది. వారు చివరికి “ఫాతెమా మాసూమహ్”, “మాసూమయె ఖుమ్” లాంటి పేర్లతో ప్రసిద్ధి చెందారు.
హజ్రత్ మాసూమహ్(స.అ), ఇమామ్ అలీ రిజా(అ.స) సొదరి. ఈమె తన రాకతో ఇరాన్ భూమిని పవిత్రంగా మార్చారు, స్వర్గపు ద్వారాలను ఆ దేశవాసుల కోసం తెరవబడ్డాయి, ఎన్నో అనుగ్రహాలు వారితో పాటు ఆ దేశానికి వచ్చాయి, వాటిలో కొన్నింటి వివరణ:

1. అహ్లె బైత్(అ.స)ల సలాము ఖుమ్ పట్టణవాసులకు
ఖుమ్ పట్టణం హజ్రత్ మాసూమహ్(స.అ) రాక ముందు, విశ్వాసులు మరియు అహ్లెబైత్(అ.స) పట్ల ఇష్టం కలిగివున్నవారు ఉన్నప్పటికీ సమృద్ధి లేకుండ మరియు పనికి రానిదిగా ఉండేది, హజ్రత్ మాసూమహ్(స.అ) రాకతో ఆ పట్టణానికి ఒక కళ వచ్చింది, ఆథ్యాత్మికంగా అభివృద్ధి చెందడం మొదలయ్యింది, అలాగే వివిధ రంగాలలో అభివృద్ధి మొదలయ్యింది. ఈ పట్టణం అహ్లెబైత్(అ.స) తరపు నుండి సలామ్ మరియు దురూద్ కు అర్హత పొందింది.
హజ్రత్ ఇమామ్ అలీ రిజా(అ.స) యొక్క అత్యంత దగ్గర అనుచరుడైన సఫ్వాన్ ఇబ్నె యహ్యా ఇలా ఉల్లేఖించెను: నేను ఇమామ్ రిజా(అ.స) కూర్చొని ఉండగా ఖుమ్ మరియు ఖుమ్ వాసుల మాట వచ్చింది, వారు పన్నెండవ ఇమామ్(అ.స) ప్రత్యేక్షమయ్యే కాలంలో వారు ఇమామ్ వైపు మక్కువ చూపుతారు అని చెప్పిన తరువాత ఇమామ్ రిజా(అ.స) అహ్లె ఖుమ్(ఖుమ్ వాసుల)ల పై దురూద్ పంపి ఇలా అన్నారు: అల్లాహ్ వారిని ఇష్టపడుగాక, ఆ తరువాత ఇలా అన్నారు: స్వరానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి వాటిలో ఒక ద్వారం ఖుమ్ ప్రజలకు ప్రత్యేకించబడినది. వారు వివిధ పట్టణాలలో ఉన్న మా ప్రత్యేక షియాల నుండి. అల్లాహ్ మా అహ్లెబైత్(అ.స) విలాయత్ మరియు ప్రేమను వారి స్వభావం మిళితమై ఉంది.[1]

2. ఖుమ్ పట్టణం హజ్రత్ మహ్దీ(అ.స) యొక్క స్థావరంగా మారడం
హజ్రత్ మహ్దీ(అ.స) యొక్క సహచరులు గట్టి విశ్వాసం మరియు దయాగుణం కలిగివున్నవారు అయి ఉంటారు. వారు మంచి స్వభావం, దాతృత్వం కలిగివున్నవారు, హజ్రత్ మాసూమహ్(స.అ) పట్టణంలో జీవితాన్ని గడుపుతూ రోజురోజుకు పటిష్ఠులుగా అవుతున్నారు, అలాగే ఆమె పట్టణంలో జ్ఞాన పరంగా కూడా ఇమామ్ అనుచరులు సిద్ధమౌతున్నారు. అఫ్పాన్ బసరీ ఉల్లేఖనం; ఒకరోజు ఇమామ్ సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: ఖుమ్ పట్టణాన్ని ఖుమ్ అని ఎందుకు అంటారో నీకు తెలుసా? నేను తెలియదు అన్నాను. ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: ఖుమ్ కు ఆ పేరు రావడానికి కారణం ఖుమ్ వాసులు ఖాయిమె ఆలె ముహమ్మద్(అ.స)తో పాటు కలిసి వారి విప్లవంలో పాల్గొంటారు, దౌర్యంగా నిలబడతారు మరియు వారికి తమ సహాయాన్ని అందిస్తారు.[2]

3. ఖుమ్ పట్టణం విశ్వాసులకు రక్షణ నిలయం ముఖ్యంగా దైవప్రవక్త(స.అ) సంతానం కోసం
విశ్వాసులు నిత్యం దుర్మార్గుల అన్యాయానికి గురి అవుతూనే ఉన్నారు, దుర్మార్గుల తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం విశ్వాసులను చంపుతూ ఉన్నారు, ఇప్పటికీ ప్రపంచమంతా రక్తపాతం జరుగుతూనే ఉంది, కాని కరీమయె అహ్లెబైత్(అ.స) హజ్రత్ మాసూమహ్(స.అ) పట్టణం అయిన ఖుమ్ లో అమాయకులకు అండగా నిలబడడానికై ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఈ విధంగా ఈ పట్టణం విశ్వాసులకు రక్షణ నిలయం మారింది. ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) ఇలా ప్రవచించారు: మీ జీవితంలో అడ్డంకులు ఏర్పడి, మీరు కష్టాలకు గురి అయి, ఆపదలలో మునిగిపోతే, ఖుమ్ వైపుకు వెళ్ళిపోండి, ఎందుకంటే ఖుమ్ ఫాతెమా(స.అ) సంతానం కోసం రక్షణ నిలయం.[3]

4. హజ్రత్ మాసూమహ్ దర్శనం స్వర్గం పొందడానికి కారణం
భక్తులు హజ్రత్ మాసూమహ్ దర్శనానికి లక్షల సంఖ్యలో వస్తారు. వారు ఆమె దర్శనం స్వర్గానికి చేర్చే మార్గంగా భావిస్తారు. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “మా కోసం ఒక హరమ్ పుణ్యక్షేత్రం ఉంది, అది ఖుమ్ పట్టణం. త్వరలోనే అక్కడికి నా సంతానం నుంచి ఒకామే సమాధి చేయబడుతుంది, ఆమె పేరు ఫాతెమా. ఆమె దర్శనం చేసినవారిపై స్వర్గం విధిగా నిర్ధారించబడుతుంది”[4]

రిఫరెన్స్
1,2. బిహారుల్ అన్వార్, ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, ఇంతెషారె ఇస్లామియహ్, తెహ్రాన్, భాగం57, పేజీ216.
3. బిహారుల్ అన్వార్, ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, ఇంతెషారె ఇస్లామియహ్, తెహ్రాన్, భాగం57, పేజీ215.
4. బిహారుల్ అన్వార్, ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, ఇంతెషారె ఇస్లామియహ్, తెహ్రాన్, భాగం48, పేజీ317.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12