దైవప్రవక్త(స.అ) తరువాత సున్నత్ కోసం ఎవరిని సంప్రదించాలి

సోమ, 06/07/2021 - 16:36

దైవప్రవక్త(స.అ) తరువాత ఆయన సున్నత్ కోసం అహ్లెబైత్(అ.స)ను సంప్రదించాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త(స.అ) తరువాత సున్నత్ కోసం ఎవరిని సంప్రదించాలి

దైవప్రవక్త(స.అ) తరువాత వారి సున్నత్ ను తెలుసకోవడం కోసం అహ్లెబైత్(అ.స)కు చెందిన ఇమాములను మాత్రమే సంప్రదించాలి, మిగతా సహాబీయులను సంప్రదించకూడదు అని షియా ముస్లిములు నమ్ముతారు. అలా అని షియా ముస్లింలు, “అహ్లెబైత్(అ.స)లకు షరీఅత్ ఆదేశాలను స్థాపించే హక్కు ఉంది అనగా వాళ్ళ సున్నత్‌లు వాళ్ళ స్వయపరియాలోచన మరియు సొంత అభిప్రాయాలకు ఫలితం” అని ఏమాత్రం నమ్మరు. వాళ్ళు ఇమాముల ఆదేశాలను అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్, వాటిని దైవప్రవక్త‎(స.అ), హజ్రత్ అలీ(అ.స)కు నేర్పించారు మరి హజ్రత్ అలీ(అ.స) తమ కుమారులకు నేర్పించారు, ఈ జ్ఞానం వాళ్ళు వారసత్వంగా పొందుతారు, అని నమ్ముతారు. షియా ముస్లింలు వాటి పై చాలా సాక్ష్యాలను నివేదిస్తారు, మరి వాటిని అహ్లెసున్నత్‌ల ఉలమాలు తమ చరిత్ర, సహీ మరియు మసానీద్ పుస్తకాలలో కూడా ఉల్లేఖించారు.

కాని మరల అదే ప్రశ్న మన ముందుకొస్తుంది: “ఎందుకు అహ్లె సున్నత్‌లు ఇలాంటి తమ సరైన హదీసులపై అమలు చేయరు!?”

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) మెచ్చిన లేదా ముస్లిములందిరిని వాళ్ళ ఆదేశాలను అనుసరించమని ఆదేశించబడ్డ వాళ్ళందరి పట్ల అభిప్రాయభేదం కలిగి ఉన్నారు. ఉదా: దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నా ఉమ్మత్ యొక్క ఉలమాలు బనీ ఇస్రాయీల్ యొక్క ప్రవక్త(అ.స)ల కన్న ఉత్తములు” లేదా “ఉలమాలు, ప్రవక్త(అ.స)ల వారసులు”[1]

ఈ రెండు హదీసులలో “ఉలమా” పదానికి అహ్లెసున్నత్ వల్ జమాఅత్‌లు “ఉలామాలందరు” అని వ్యాఖ్యానిస్తారు. మరి షియా ముస్లింలు “ఉలామా” పదానికి “పన్నెండు మంది ఇమాములు” అని వ్యాఖ్యానిస్తారు. బుద్ధి కూడా ఈ విశేష్టతను అంగీకరిస్తుంది, ఎందుకంటే., పవిత్ర ఖుర్ఆన్, ఖుర్ఆన్ యొక్క అంతరార్ధ జ్ఞానం కేవలం పరిపక్వ జ్ఞానం గలవారికే పరిమితం చేసింది. మరి అలాగే ఖుర్ఆన్ యొక్క జ్ఞానం కేవలం అల్లాహ్ చేత ఎన్నుకోబడ్డ దాసుల కొరకు మాత్రమే ప్రత్యేకించింది, ఇది మరో ప్రాముఖ్యత.
అంతేకాకుండా దైవప్రవక్త‎(స.అ), ఎవరూ పొందలేనటువంటి ప్రాముఖ్యతలను తన అహ్లెబైత్(అ.స)ల గురించి ప్రకటించారు. వాళ్ళను విముక్తి నౌక, రుజుమార్గదర్శకులు, మిలమిల మెరిసే నక్షత్రాలు మరియు(ఖుర్ఆన్ తరువాత)  అమూల్యమైన, ప్రజలను చీకటి నుండి విముక్తినిచ్చేవారుగా ప్రకటించారు.[2]

“ఖుర్ఆన్” మరియు “దైవప్రవక్త‎(స.అ) సున్నత్” ఏ ప్రాముఖ్యతలను అహ్లెబైత్(అ.స)ల కొరకు నిరూపించాయో, అహ్లె సున్నత్‌ల వచన వాటికి వ్యతిరేకంగా ఉంది. మరి అహ్లెసున్నత్‌ల వచనాన్ని బుద్ధి కూడా అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళ వచనం అర్ధం లేనిది, వాళ్ళు చెప్పిన విధంగా చూసినట్లైతే ఉలమాలలో నిజమైన మరియు తప్పుడు ఉలమాలకు గుర్తించడం, అలాగే అల్లాహ్ ప్రతీ చెడు మరియు అపవిత్రతను దూరంగా ఉంచి పవిత్రులుగా నిర్ధారించిన ఉలమాలను గుర్తించడం, అమవీ మరియు అబ్బాసీయుల అధికారులు ప్రజలపై ప్రతాపించిన ఉలమాలను గుర్తించడం అసాధ్యం. మరో విధంగా చెప్పాలంటే; అల్లాహ్ చేత ఖుర్ఆన్ యొక్క జ్ఞాన వారసులుగా నిర్ధారించబడ్డ, తన తత్త్వజ్ఞానమును ప్రసాదించబడ్డ ఉలమాల మధ్య మరియు తన ముక్తి కోసం జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళ మధ్య తేడా ఉంటుంది.

అందుకే చరిత్రలో అహ్లెబైత్(అ.స)లు “కేవలం వాళ్ళు విద్యను తమ తమ తండ్రుల నుండి పొందారు” అని తప్ప వారి(అ.స)కి విద్య నేర్పించే ఉపాధ్యాయులు ఉండేవారు అనే ప్రస్తావన దొరకదు. ఇలా ఉన్నప్పటికీ అహ్లెసున్నత్ ఉలమాలు తమ పుస్తకాలలో పన్నెండు ఇమాముల గురించి ఆశ్చర్యకరమైన రివాయతులు ఉల్లేఖించారు. ముఖ్యంగా ఇమామ్ బాఖిర్(అ.స), ఇమామ్ సాదిఖ్(అ.స) మరియు ఇమామ్ రిజా(అ.స)ల గురించి, ఉదా: “మామూన్, నలభై విధ్వాంశులను జమ చేసి ఇమామ్ రిజా(అ.స)తో సంభాషణ చేయించాడు. ఇమామ్ రిజా(అ.స) వయసు చిన్న వయసు అయిన సరే వాళ్ళందరి పై విజయం సాధించారు”.[3]

మరి అలాగే ఫిఖా ఆదేశాలలో అహ్లెసున్నత్ యొక్క నాలుగు వర్గాల మధ్య ఉన్న అభిప్రాయభేధాలు కూడా ఈ సమస్యను ఇంకా స్పష్టం చేస్తుంది. కాని పన్నెండు ఇమాములు, వాళ్ళలో ఒక్క ఆదేశంలో కూడా అభిప్రాయభేదం లేదు.

ఒకవేళ అహ్లెసున్నతుల మాటను ఆయత్‌లలో మరియు హదీసులలో వచ్చిన “ఉలమా” పదాన్ని, ఉలమాలందరు అని అంగీకరించినట్లైతే, కాలం గడిచినకొద్ది వివిధ స్వయపరియాలోచనాల వల్ల వివిధ మతాలు ఎర్పడతాయి. అందుకే స్వయంగా అహ్లేసున్నతుల ఉలమాలు తమ ఈ అర్ధంలేని అభిప్రాయాలను తెలుసుకొని నాలుగు వర్గాలు ఏర్పడిన వెంటనే పరియాలోచన ద్వారాన్ని మూసివేశారు. కాని షియా ముస్లింల; ముస్లిములందరు, అల్లాహ్ మరియు దైవప్రవక్త‎(స.అ), ముస్లిములకు ప్రళయంరోజు వరకు అవసరమైనటువంటి జ్ఞానంతో అలంకరించబడ్డ అహ్లెబైత్(అ.స)లను ఆశ్రయించి ఉండాలి అలా ఉంటే అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)కు వ్యతిరేకంగా తప్పుడు ప్రస్తావన చేయలేరు మరి అలాగే వేరే వర్గం ఏర్పడదు ఇది సంధి మరియు ఐక్యతకు పిలుపునిస్తుంది, అని అంటారు.

రిఫరెన్స్
1. సహీ బుఖారీ, భాగం1, పేజీ26, కితాబుల్ ఇల్మ్. సహీ తిర్మిజీ, భాగం5, పేజీ47, కితాబుల్ ఇల్మ్
2. ఇవన్నీ దైవప్రవక్త(స.అ) సరైనా హదీసుల ఆధారంగా చెప్పబడినది
3. అఖ్దుల్ ఫరీద్ ఇబ్నె అబ్ది రబ్బిహ్. ఫుసూలుల్ ముహిమ్మహ్ ఇబ్నె సబ్బాగె మాలికీ, పేజీ268

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8