హజ్రత్ మాసుమహ్(స.అ) జీవిత చరిత్ర

మంగళ, 06/08/2021 - 17:44

హజ్రత్ మాసుమహ్(స.అ) జీవిత చరిత్ర మరియు ఆమె ప్రతిష్టత పవిత్ర ఇమాముల ఉల్లేఖనుసారం... 

హజ్రత్ మాసుమహ్(స.అ) జీవిత చరిత్ర

రబీవుల్ అవ్వల్ మాసం యొక్క 23వ తారీఖు హజ్రత్ మాసుమహ్(స.అ) ఖుమ్ పట్టణంలో అడుగుపెట్టిన రోజు. ఆ సందర్భంగా కొన్ని అంశాలు ఇక్కడ వివరించాలనుకున్నాము. ముందుగా వారి గురించి సంక్షింగా తెలుసుకుందాం:

హజ్రత్ మాసూమహ్(అ.స) జీవిత చరిత్ర
కొన్ని ఆధారాల[1] ప్రకారం హజ్రత్ మాసూమహ్(అ.స) జీఖఅదహ్ మాసం 1వ తేదీ హిజ్రీ యొక్క 173 సంవత్సరంలో మదీనహ్ పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి హజ్రత్ ఇమామ్ కాజిమ్(అ.స) మరియు తల్లి నజ్మహ్ ఖాతూన్. కొన్ని ఆధారాల[2] ప్రకారం ఆమె హిజ్రీ యొక్ 201వ సంవత్సరంలో ఖుమ్ పట్టణంలో మరణించారు.[3]

వివాహం చేసుకోకపోవడానికి కారణం
ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ వాటి నుంచి సరైన మరియు వివేకమైనది ప్రదర్శిస్తున్నాము: హజ్రత్ ఇమామ్ కాజిమ్(అ.స) పై హారూన్ అల్ రషీద్ తరపు నుండి ఆగ్రహంతో కూడిన నిఘా ఉండేది, అధికార భయం మరియు ఆందోళన వల్ల ఇమామ్ యొక్క అల్లుడు అయ్యే దైర్యం చేయలేకపోయేవారు. ఈ విధంగా హజ్రత్ మాసూమహ్(అ.స) మరియు ఆమె కొంతమంది చెల్లెళ్లకు వివాహం జరగలేదు.[4]

హజ్రత్ మాసూమహ్(అ.స) ఇరాన్ ప్రమాణానికి కారణం
హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) హిజ్రీ 200వ సంవత్సరంలో మామూన్ అబ్బాసీ బలవంతం వల్ల ఇరాన్ కు చెందిన ఖురాసాన్ పట్టణానికి బయలు దేరారు. ఒక సంవత్సరం తరువాత(అనగా 201హిజ్రీలో) హజ్రత్ మాసూమహ్(అ.స) తమ సోదరులు(హజ్రత్ ఇమామ్ రిజా(అ.స))తో కలవడానికై ఇరాన్ కు బయలుదేరారు[5]

హజ్రత్ మాసూమహ్(అ.స) ఖుమ్ పట్టణంలో ప్రవేశానికి ముందు
హజ్రత్ మాసూమహ్(అ.స), ఖుమ్ పట్టణానికి ప్రవేశానికి ముందు, సావహ్ ప్రదేశంలో అనారోగ్యానికి గురి అయ్యారు.

హజ్రత్ మాసూమహ్(అ.స) ఖుమ్ ప్రవేశం
ఖుమ్ కు చెందిన కొందరు హజ్రత్ మాసూమహ్(అ.స) ఇరాన్ విచ్చేశారని తెలుసుకున్న తరువాత ఆమెను ఖుమ్ కు ఆహ్వానించాలని అనుకున్నారు, అందుకని వారిలో ఒకరు; అతని పేరు మూసా ఇబ్నె ఖజ్రజ్ సఅద్ అష్అరీ, సావహ్ కు వచ్చి ఆమెను ఖుమ్ కు రమ్మని ఆహ్వానించారు. ఆమె ఖుమ్ కు వచ్చిన 17 రోజుల తరువాత మరణించారు.[6]

హజ్రత్ మాసూమహ్(అ.స) ప్రతిష్టతలు
హజ్రత్ మాసూమహ్(అ.స) ప్రతిష్టత గురించి చెప్పాలంటే ముగ్గురు మాసూమ్(పవిత్ర) ఇమాములు ఆమె గోపుర దర్శనం చేసిన వారికి స్వర్గం తప్పని సరిగా నిర్ధారించారు, అన్న విషయం చాలు. 

ఇమామ్ సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: మక్కా అల్లాహ్ యొక్క హరమ్, మదీనహ్ దైవప్రవక్త(స.అ) యొక్క హరమ్, కూఫా అమీరుల్ మొమినీన్(అ.స) హరమ్ మరియు ఖుమ్ పట్టణం మా(అహ్లెబైత్) యొక్క హరమ్. త్వరలోనే అక్కడికి నా సంతానం నుంచి ఒకామే సమాధి చేయబడుతుంది, ఆమె దర్శనం చేసినవారిపై స్వర్గం విధిగా నిర్ధారించబడుతుంది”[7]

సఅద్, హజ్రత్ ఇమామ్ రిజా(అ.స) యొక్క అనుచరులలో ఒకరు ఉల్లేఖనం: ఇమామ్ నాతో ఇలా ప్రవచించారు: ఓ సఅద్! మా నుండి ఒకరి సమాధి మీ దేశంలో ఉందా? నేను మీపై ఫిదా, (మీ ఉద్దేశం) ఫాతెమా బింతె మూస ఇబ్నె జాఫర్ సమాధి (నా)? అని అన్నాను. వారు ఇలా అన్నారు: ఔను, ఆమె స్థానాన్ని తెలుసుకొని ఆమె దర్శనం చేసిన వారు స్వర్గంలో స్థానం పొందుతారు.[8]
హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఉల్లేఖనం: ఖుమ్ లో ఉన్న నా అత్త (గోపురం)ను దర్శనం చేసినవారి(కి ప్రసాదించబడే) బహుమతి స్వర్గం.[9]

రిఫరెన్స్
1. ఉదా: మస్తద్రికె సఫీనతుల్ బిహార్, భాగం8, పేజీ275
2. ఉదా: ముంతహల్ ఆమాల్, భాగం2, పేజీ242
3,4. హజ్రత్ మాసూమహ్(స.అ) ఫాతెమా దువ్వుమ్
5,6. తారీఖె ఖుమ్, హసన్ ఇబ్నె ముహమ్మద్ ఇబ్నె హసన్ ఖుమ్మీ, పేజీ213
7. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, ఇస్లామియహ్, భాగం48, పేజీ317
8. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, ఇస్లామియహ్, భాగం48, పేజీ316, 317
9. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, ఇస్లామియహ్, భాగం48, పేజీ316        

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16