ఇస్లాం అన్యాయానికి మరియు వివక్షకు వ్యతిరేకం

శుక్ర, 06/11/2021 - 09:17

ఇస్లాం బోధనలను పరిశీలించినట్లైతే ఇస్లాం అన్యాయానికి మరియు వివక్షకు వ్యతిరేకం ...

ఇస్లాం అన్యాయానికి మరియు వివక్షకు వ్యతిరేకం

ఇస్లాం బోధనలను పరిశీలించినట్లైతే ఇస్లాం అన్యాయానికి మరియు వివక్షకు వ్యతిరేకం అని తెలుస్తుంది. దైవప్రవక్త(అ.స)ల అవతరించబడడానికి ముఖ్యకారణం ప్రజల మధ్య న్యాయాన్నీ, ధర్మాన్ని స్థాపించడం అని ఖుర్ఆన్ వివరిస్తుంది: “నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితోపాటు గ్రంథాన్ని, ధర్మకాఁటాను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి!”[సూరయె హదీద్, ఆయత్25] ఈ ఆయత్ చాలా స్పష్టంగా దైవప్రవక్త(అ.స)ల అవతరించబడడానికి ముఖ్యకారణం ప్రజల మధ్య న్యాయధర్మాల మరియు సమానత్వ స్థాపన అని వివరిస్తుంది.

మరో ఆయత్ లో ఇలా ఉపదేశించబడి ఉంది: (ఓ ప్రవక్తా1.) వారికి చెప్పు: “నేను మీకు చేసే ఉపదేశం ఒక్కటే మీరు అల్లాహ్ కోసం (మంకుతనం మాని) ఇద్దరిద్దరు చొప్పున లేదా ఒక్కొక్కరు చొప్పున సంసిద్ధులై ఆలోచించండి”[సూరయె సబా, ఆయత్46] ఈ ఆయత్ లో కూడా ఖుర్ఆన్ ఇస్లాం యొక్క గొప్ప శిక్షణను సూచిస్తుంది; చివరికి ఒక్కరు మిగిలివున్నా సరే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలి, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, చేతులు ముడుచుకొని కూర్చోకూడదు.

మరో ఆయత్ లో ఇస్లాం సమావత్వాన్ని, సోదరా భావాన్ని ప్రోత్సాహిస్తుంది అని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ ద్వార తెలుస్తుంది: “ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్ర్తీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తుల గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు”[సూరయె హుజురాత్, ఆయత్13] ఈ ఆయత్ స్పష్టంగా వివరిస్తుంది ప్రజలందరూ సమానం. ఆధరణకు అర్హుడు కేవలం అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగినవారు మాత్రమే.[1] ఈ ఆయత్ వివరణ క్రమంలో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: “అరేబీయులు, అరేబీయుడు కానివారిపై ఎటువంటి ప్రాధాన్యత కలిగిలేడు, అరేబీయుడు కానివాడు అరేబీయునిపై ప్రాధాన్యత కలిగిలేడు, అలాగే తెల్లతోలువాడు నల్లతోలువాడిపై నల్లతోలువాడు తెల్లతోలు వాడిపై ప్రాధాన్యత కలిగిలేడు కేవలం ధర్మనిష్ట ద్వార తప్ప”[2]
అలాగే ఇస్లాం యొక్క చరిత్రను చూసుకున్నట్లైతే మదీనహ్ లో 10 సంవత్సరాల దైవప్రవక్త(స.అ) అధికారాన్ని పరిశీలిస్తే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించవచ్చు:
1. దైవప్రవక్త(స.అ) జీవన పద్ధతి చాలా సాధారణంగా, ఆడంభరములకు దూరంగా ఉండేది.
2. దైవప్రవక్త(స.అ) దృష్టిలో ఇస్లాం చట్టం మరియు నిబంధనల పరంగా అందరూ సమానంగా ఉండేవారు. ఎవ్వరికీ ఎవ్వరీ పై ప్రాధాన్యత ఉండేది కాదు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడేది అది ఎవరైనా సరే.

దైవప్రవక్త(స.అ) మరియు వారి ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ(అ.స) యొక్క సాధారణ జీవితం గురించి ప్రజలలో ప్రతీ ఒక్కరికి తెలిసిందే, వారి మిత్రులేకాదు వారి శత్రువులు కూడా అంగీకరించారు అని చరిత్ర నిదర్శిస్తుంది. అదీ ఇబ్నె హాతమ్ ఇస్లాం స్వీకరణ కూడా దీనికి నిదర్శనమే; అదీ ఇబ్నె హాతమ్ ఇస్లాం తొలిదశలో ఇస్లాం సైన్యానికి భయపడి పారిపోయాడు, కాని దైవప్రవక్త(స.అ) చాలా సాధరణంగా జీవితాన్ని గడుపుతారు, ఎటువంటి ఆండంభరాలు ఉండవు లాంటి లక్షణాలు విని దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి విన్నది తన కళ్లతో చూసి, ఇస్లాంను స్వీకరించారు.[3]
అయితే కొన్ని సార్లు ఇస్లాం పేరుతో ప్రజల పై అధికారం చేలాయించ వచ్చు. వాళ్లు ప్రజలకు అన్యాయం చేయవచ్చు, ఎప్పటికీ ప్రజలలో ఇస్లాం ప్రకారం ఉత్తర్వులు జారీ చేయకపోవచ్చు, వాళ్ళు ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకంగా అమలు చేయవచ్చు. అలాంటప్పుడు వారు కపట మాటలకు గురి అయి ఇస్లాం అన్యాయాన్ని సమ్మతిస్తుంది అని భావించరాదు. ఇస్లాం ఆదేశాలు ఆ అధికారుల చర్యకు పూర్తిగా వ్యతిరేకమైనది, వాళ్ల చర్యలకు మరియు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాం యొక్క నిజమైన ఆదేశాలను దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లెబైత్(అ.స) ద్వార ఉల్లేఖించబడిన ఇస్లామీయ ప్రత్యేక గ్రంథాల నుండి మాత్రమే తెలుసుకోవాలి.

రిఫరెన్స్
https://btid.org/fa/news/160179

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19