షైతాన్ ప్రలోభ చికిత్స

శని, 06/12/2021 - 14:35

షైతాన్ ప్రలోభాలకు గురి అయ్యేవారు మరియు అవ్వకుండా ఉండడం ఎలా అన్న అంశాల సంక్షిప్త వివరణ...

షైతాన్ ప్రలోభాల చికిత్స

షైతాన్ మూడు రకాల వ్యక్తులను ప్రలోభిస్తాడు
ఖుర్ఆన్: “నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి”[సూరయె ఫాతిర్, ఆయత్06] షైతాన్ మూడు రకాల వ్యక్తులను తన వలలో వేసుకుంటాడు.
1. ఎవరైతే అల్లాహ్ స్మరణ నుండి దూరంగా ఉంటారో వారిని.
2. అల్లాహ్ ఆదేశాలన్నింటీని ఒకచేత్తో పట్టుకొని ఉండేవారిని. ఉదాహారణకు నమాజ్ చదవాలి అంతే అది ఎలా ఉండాలి అనేది వారికి అక్కర లేదు.
3. తమ జీవితాన్ని పరధ్యానంలో గడిపివారు మరియు తనను అల్లాహ్ చూస్తున్నాడు అన్న విషయాన్ని పట్టించుకోనివారిని.

షైతాన్ అల్లాహ్ నుండి వ్యవధిని కోరాడు, రక్తం ద్వార మనిషి నరాల్లోకి ప్రవేశించి అతడిని ప్రలోభానికి గురి చేయడానికి.[2]

షైతాన్, మనిషి యొక్క స్థతిగతులు బాగా తెలిసినవాడు
షైతాన్ కు మనిషి యొక్క స్థతిగతులు బాగా తెలుసు. ఎవడు ఎలాంటివాడో, ఎవడిని ఏమి చేస్తే తన వలలో చిక్కుకుంటాడో, ఎవడు తన కార్యములలో పరధ్యానం కలిగివున్నాడో, మొ...

షైతాన్ ప్రలోభానికి గురికాకుండా ఉండాలంటే చేయాల్సిన మూడు చర్యలు:
1. ధ్యానం
హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: ధ్యానం మరియు తనను నిత్యం అల్లాహ్ సన్నిధిలో ఉన్నాను అని భావించేవాడే నిత్యం షైతాన్ వల నుండి సురక్షితంగా ఉంటాడు. ఎవరైతే రాత్రీ పగలూ తేడా లేకుండా(పరధ్యానంలో) గడుపుతాడో నిత్యం షైతాన్ వలలో ఉంటాడు.[3]

2. అల్లాహ్ సన్నిధిలో రోధన
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ సన్నిధిలో రోధించడం ద్వార అల్లాహ్ ను గట్టిగా పట్టుకో”
నీవు ఒక అడుగు ముందు వేస్తే అల్లాహ్ పది అడుగులు నీ వైపుకు వస్తాడు.
షైతాన్ కు సైన్యం ఉంది, మనోవాంఛకు కూడా సైన్యం ఉంది. షైతాన్ మనోవాంఛలకు సహాయం కలిపిస్తాడు. అలా ఆత్మను వశపరుచుకుంటాడు.

3. షైతాన్ విశ్వాసులను మరియు అల్లాహ్ పై నమ్మకం కలిగివున్నవారిని వశపరుచుకోలేడు
ఖుర్ఆన్: “షైతాన్ జిత్తులు అత్యంత బలహీనమైనవి”[సూరయె నిసా, ఆయత్76] మరో ఆయత్ లో ఇలా సూచించబడి ఉంది: “విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపినవారిపై షైతాన్ కి ఎలాంటి అధికారం ఉండదు”[సూరయె నహ్లె, ఆయత్99].

షైతాన్ వలలో చిక్కుకున్నవాడి హృదయం మెల్ల మెల్లగా పాపకార్యముల వల్ల రాతిగుండెగా మారుతుంది. రాతిగుండే నమాజ్ చదువుతాడు కాని సత్యఅసత్యాలను గ్రహించలేడు.
ఒకవేళ షైతాన్ వలలో చిక్కుకొని హృదయం రాతిగుండే గా మారిపోతే దానిని ఎలా చికిత్స చేయాలి అన్న విషయం పై కొన్ని విషయాలు:
రాతిగుండెను సాధారణ గుండెను మార్చే కొన్ని అంశాలు:
1. మస్జిద్ కు వెళ్లడం: మస్జిద్ కు వెళ్లే వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ప్రత్యేక దృష్టితో చూస్తాడు, అతడి హృదయాన్ని సాధారణ హృదయంగా మారుస్తాడు.
2. ఇస్లామీయ జ్ఞానం కలిగివున్న వారితో కూర్చోవడం: ఇస్లాం జ్ఞానం కలిగివున్న వారితో కలిసి కూర్చోవడం ద్వార అల్లాహ్ గురించి జ్ఞానం పెరుగుతుంది దాంతో మనిషి హృదయం అల్లాహ్ ఆదేశాల పట్ల విధేయతకు మెల్ల మెల్లగా సిద్ధమౌతుంది.
3. నమాజె షబ్ చదవడం: మన కష్టాలను అల్లాహ్ కు చెప్పుకోవాలి, కష్టాలు చెప్పుకునేందుకు నమాజ్ కన్నా మంచి మార్గం లేదు. మన కష్టాలు అల్లాహ్ కు చెప్పుకోకుండా, ఆయనను ఆరాధించకుండా., మగ్రిబ్ నుండి ఉదయం వరకు టీవీ చూడడం, లేదా విశ్రాంతి చేయడం, ఎంత వరకు సరైన సమ్మతం? ఎప్పుడైనా ఆలోచించారా!!!.

నమాజె షబ్ షైతాన్, అత్యంత బలమైన షైతాన్
షైతానులందరిలోనూ అత్యంత బలమైన షైతాన్ ఎవరో తెలుసా? అత్యంత బలమైన షైతాన్, విశ్వాసులను నమాజె షబ్ నుండి ఆపివేసే షైతాన్.
నిజానికి ఉదయాన్నే నిద్రనుండి లేచేవాడి హృదయాలను అల్లాహ్ చూస్తాడు మరియు వాటిని కాంతితో నింపుతాడు, నీ భాగ్యన్ని నిర్ధారిస్తాడు.[4]
ఒకవ్యక్తి ఇమామ్ జాఫరె సాదిఖ్(స.అ) వద్దకు వచ్చి ఇలా అన్నాడు: యబ్న రసూలల్లాహ్! నాకు ఏదైనా ప్రసాదించండి.
ఇమామ్: భహుశ నిన్న రాత్రి నువ్వు నమాజె షబ్ చదివి ఉండవు.
ఆ వ్యక్తి: చదివాను యబ్నె రసూలల్లాహ్!
ఇమామ్: అబద్ధమాడుతున్నాము, నిజంగా చదివుంటే ఈ రోజు నా వద్దకు వచ్చి (సహాయం)కోరేవాడివి కాదు.

నమాజె షబ్ చదివితే అల్లాహ్ అతడి జీవితకాలాన్ని పెంచుతాడు, నమాజె షబ్ సమాధిలో జ్యోతిలా వెలుగుతుంది. 

రిఫరెన్స్
1. అవాలి అల్ లిఆలి, ఇబ్నె అబీ జమ్హూర్, భాగం1, పేజీ273
2. మిస్బాహ్ అల్ షరీఅహ్, పేజీ80
3. అల్ మహ్జతుల్ బైజా, ఫైజె కాషానీ, భాగం2, పేజీ399

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Shaker on

Jazakallah.. thanks for the good advice to oppose the shitan traps.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7