పిల్లల శిక్షణ

సోమ, 06/14/2021 - 18:38

పిల్లల శిక్షణ తల్లిదండ్రుల బాధ్యత అందుకని వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం... 

పిల్లల శిక్షణ

1. నెగిటీవ్ భావోద్వాగాలను జయించేందుకు సహాయం
పిల్లలకు కూడా పెద్దవాళ్ల వలే నెగిటీవ్ భావోద్వాగాలకు గురి అవుతారు. ఉదా: కోపం, ద్వాషం, బిడియం, ఈర్ష్య మొ..., వీటిని కంట్రోల్ లో పెట్టడం తల్లిదండ్రుల బాధ్యత. వాటిని దూరం చేయడానికి లేదా అవి ఏమిటి? అని లేదా వాటిని ఎలా తెలుసుకోవాలి? అని లేదా ఎందుకు మనిషి నెగిటీవ్ భావోద్యాగాలకు గురి అవుతాడు? అన్న విషయాలు తెలియపరచాలి.

2. సమస్యలను మరియు కష్టాలను ఎలా ఎదురుకోవాలి
పిల్లలలో ఉండే సామర్థ్యాలను బయటికి రాకుండా అడ్డుకోకూడదు. వాళ్ల పనులు మనం చేసేయకూడదు. పిల్లకు సమస్యలు వస్తే ఎలా వాటిని పరిష్కరించాలి, కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదురుకోవాలి అన్న విషయాలు నేర్పాలి. వాటి కారణాలను ఎలా తెలుసుకోవాలే నేర్పాలి.

3. పిల్లలతో సమయం గడపడం
తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహితులుగా ఉండాలి, దాంతో వాళ్ళు రిలీఫ్ గా ఫీల్ అవ్వాలి. మీ నుండి వాళ్లు నేర్చుకొనే అవకాశాన్ని వారికి ఇవ్వాలి. వారి నుండి మీరూ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు పిల్లలుగా మారి వారితో ఆడాలి.

4. ఈలోకమంత ముఖ్యమైనవాడివి అని చెప్పాలి
నిత్యం మీరు మీ పిల్లలను నువ్వు మాకు ఈలోకమంతగా ముఖ్యం అని గుర్తుచేస్తూ ఉండాలి. మా జీవితంలో ఉన్న వాటిలో అత్యంత ముఖ్యమైనవాడివి అని చెప్పాలి. పిల్లలకు ఏమి తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు కాని వారికి పెద్దవారి కంటే ఎక్కువగా అర్ధం అవుతుంది. ఎప్పుడైతే మీకు వారంటే ముఖ్యమైనవారు అని తెలుస్తుందో అప్పుడు వారిలో సురక్షిత భావం పెరుగుతుంది.

5. మీకు ఇంటి పనులలో సహాయం చేసేవిధంగా శిక్షణ ఇవ్వాలి
పిల్లలకు చిన్నప్పటి నుంచే మీరు చేసే పనులను నేర్పిస్తే, పెద్దవాళ్లు అయినప్పుడు ఒక బాధ్యతగల వ్యక్తిగా మారుతాడు. కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే వారు ఆ పనులతో అలసిపోకూడదు లేదా ఆ పని కష్టంగా ఉండకూడదు., ఉదాహారణకు ఇల్లు దులుపుతున్నప్పుడు ఒక చిన్న గుడ్డముక్కను ఇచ్చి సహాయం చేయమని కోరాలి, పని పూర్తయిన తరువాత కృతజ్ఞత తెలపాలి, పిల్లాడి సహాయం పట్ల తనకి మన సమ్మతాన్ని తెలియపరచాలి. ఇలా ఆ పిల్లాడికి సహాయం చేసినవాడితో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుంటాడు.

6. ప్రపంచం ఎంత సంక్లిష్టమైనదో ఎంత పెద్దదో తెలియపరచాలి
పిల్లలు ఈ ప్రపంచం తాను, తన మిత్రులతో కూడి ఉంది అని భావిస్తారు. వారు చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి ఈ ప్రపంచం యొక్క యదార్థమేమిటి, అది ఎంత పెద్దది మరియు ఎంత సంక్లిష్ట రూపం కలిగివుంది అని. మనుషులే కాదు ఈ భూమిపై రకరకాల జంతువులు, పక్షులు వేరే జీవాలు ఉన్నాయి అని తెలియపరచాలి. వాళ్లకు చిత్రాలు, పుస్తకాలు, జ్ఞానం మొదలగు వాటి గురించి తెలియపరిచి వారు ఊహించుకునే ప్రపంచం కన్నా బయట ప్రపంచం చాలా పెద్దదని తెలియజేయాలి.

7. ప్రేమను అగ్ర స్థానంలో ఉంచడం
పిల్లలకు చిన్నతనం నుండే ఆత్మగౌరవం మరియు ఎలా ఎదుటివారిని గౌరవించాలి? ఇతరులను నష్టం పరచకూడదు, కష్టం కలిగించకూడదు అన్న విషయాలు నేర్పించాలి. వారికి భావోద్వాగాల మరియు ప్రేమను వ్యక్తం చేసే విషయంలో అతివృష్టి మరియు అనావృష్టికి గురి కాకూడదు అని శిక్షణ ఇవ్వాలి.

8. అప్పుడప్పుడు ఇతరులతో పాటు వదలడం
నిత్యం పిల్లాడు మీతోనే ఉండే విధంగా పెంచకండి, దాంతో పిల్లాడు మీరు లేకుండా ఏ పనీ చేయలేడు. సమాజంతో పాటు కలిసి నడిచేందుకు వాళ్లకు అవకాశం కలిపించాలి. తల్లిదండ్రులు లేకపోయినా సరే జీవిచగలిగే ధైర్యాన్ని ఇవ్వాలి.

9. వారి కోసం మీరు ఆదర్శంగా ఉండాలి
పిల్లలు మిమ్మల్ని చూసి ఎలా జీవించాలి అని నేర్చుకోవాలి, అలా మీరు మీ జీవితాన్ని గడపాలి. మీరు ఇలా ఉండాలి అని చెప్పడం కన్నా మీ జీవిత విధానాన్ని చూసి పిల్లలు నేర్చుకోవడమే ప్రభావితమైనది.

10. మనశాంతి చాలా ముఖ్యం
పిల్లలతో మన వ్యవహారం చాలా సున్నితంగా ఉండాలి, వారికి మనశాంతి కలిగేలా ఉండాలి. తప్పు చేయగానే వెంటనే వ్యతిరేకించకూడదు. వారి పై అరవకూడదు. వారిని కోపగించుకోకూడదు.

11. నిలకడ అవసరం
నిబంధనల మరియు వాటిని అమలు పరిచే విషయంలో నిలకడగా ఉండాలి. మీరు చెప్పిన మాటపై నిలబడకపోయినా లేదా చెప్పింది చెప్పిన విధంగా చేయకపోయినా పిల్లలు కూడా మీ మాటకు విలువ ఇవ్వరు మరియు భరోసా తగ్గుతుంది.

12. పనికి రాని మాటలు మాట్లాడకూడదు
పనికిరాని మాటలకు దూరంగా ఉండాలి. వారితో వ్యర్థ సంభాషణ చేయకూడదు.

రిఫరెన్స్
https://btid.org/fa/news/170891        

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7