ఇమామత్

మంగళ, 06/15/2021 - 15:29

ఇమామత్ యొక్క అర్థం. దాని పట్ల షియా మరియు అహ్లె సున్నత్ వర్గాల విశ్వాసం పై సంక్షిప్త వివరణ..

ఇమామత్

ఇమామత్ యొక్క అర్థం. దాని పట్ల షియా మరియు అహ్లె సున్నత్ వర్గాల విశ్వాసం పై సంక్షిప్త వివరణ..

“ఇమామత్” అనగా ముస్లిముల “ఇమామతె కుబ్రా అనగా ఖిలాఫత్”[1], “హుకూమత్”[2], “ఖియాదత్”[3] మరియు “విలాయత్”[4] ఈ రోజుల్లో అందరి ఆలోచనలలో ఉన్నట్లు జమాత్ చదివించే ఇమామ్ కాదు. ముందుగా ఇస్లామీయ ఇరువర్గాల దృష్టిలో ఇమామత్ యొక్క మూలం)ఉత్పత్తిస్థానం) గురించి తెలుసుకుందాం. దాంతో పాఠకులకు ఈ రెండు వర్గాలలో ఇమామత్ ఎటువంటి మూలకారణాల పై నిలిచిఉంది, అనే విషయం తెలుస్తుంది.

ఇమామత్ అంశం షియా ముస్లింలలో ఉసూలే దీన్(దీన్ యొక్క మూల కారణాలు)లో ఒకటి. ఎందుకంటే దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ మరియు ఉమ్మత్ యొక్క సంపూర్ణత్వానికి మార్గదర్శి మరి ఈ ఖియాదతే కుబ్రా(పెద్ద మార్గదర్శి)తోనే చాలా ప్రాముఖ్యతలు, విశిష్టతలు; జ్ఞానం, ధైర్యం, కోమల స్వభావం, ఓర్పు, పవిత్రత, దైవభీతి, ధర్మనిష్ఠ, మంచితనం పై ఆధారపడి ఉన్నాయి. షియా ముస్లింల దృష్టిలో “ఇమామత్ అల్లాహ్ నిశ్చయించే పదవి”. ఈ పదవిని దైవప్రవక్త‎(స.అ) తరువాత అల్లాహ్ తన మంచి దాసులలో ఎవరో ఒకరికి ప్రసాదిస్తాడు. ఇందుమూలంగానే హజ్రత్ ఇమామ్ అలీ(అ.స), ముస్లిముల ఇమామ్ అయ్యారు, మరి అతనిని అల్లాహ్‌యే ఎన్నుకుని తన ప్రవక్త(స.అ) వద్దకు, “మీరు ప్రజల మధ్య అలీ(అ.స) యొక్క ఖిలాఫత్ పదవి గురించి ప్రకటించండి” అని దైవవాణి పంపాడు. మరి దైవప్రవక్త‎(స.అ) తన చివరి హజ్జ్ తరువాత “ఖుమ్ మైదానం”లో ఆ ఆదేశాన్ని ప్రకటించారు. ఆ తరువాత ప్రజలందరు హజ్రత్ అలీ(అ.స) చేతులపై బైఅత్(ప్రమాణం) చేశారు.

అహ్లెసున్నతులు కూడా ఉమ్మత్ యొక్క మార్గదర్శనం కోసం ఇమామత్‌ను వాజిబ్ అని నమ్ముతారు. కాని ఇమామ్‌ను ఉమ్మత్ ప్రజలు నియమిస్తారు అని అంటారు. అందుమూలంగా హజ్రత్ అబూబక్ర్ ముస్లిముల ఇమామ్ అయ్యారు, ఇతనిని స్వయంగా ప్రజలే దైవప్రవక్త‎(స.అ) తరువాత తమ ఇమామ్‌గా నియమించుకున్నారు. ఎందుకంటే దైవప్రవక్త(స.అ) ఈ విషయంలో ఆదేశించలేదు కాబట్టి దీనిని ప్రజల అభిప్రాయాలపై మరియు సలహాలపై వదిలేయడం జరిగింది వాళ్ళకు ఇష్టం వచ్చిన వాళ్ళును ఎన్నుకోవచ్చు, అని వాళ్లు నమ్ముతారు.

ఇమామత్ ను విశ్వసించడం మనపై విధి కాబట్టి ఒక పరిశోధకుడు ఇరువర్గాల సంభాషణాలపై దృష్టి సారించి, సాక్ష్యాలను స్వమతపక్షపాతం లేకుండా పరిశీలించినట్లైతే తప్పకుండా యధార్ధానికి దగ్గరవుతాడు. పరిశీలించకుండా తాతముత్తాతలు నేర్పించినవాటినే పాటిస్తూ విశ్వాస పరంగా బనిసలుగా బ్రతకడం అవివేకం. ఆలోచించే స్వాతంత్రం ప్రతీ ఒక్కరికి ఉంది అని ఖుర్ఆన్ కూడా సూచిస్తుంది:

1. ఆయత్: وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰ; అనువాదం: బరువు మోసేవాడెవడూ ఇతరుని బరువును మోయడు[సూరయె అన్ఆమ్, ఆయత్:164]    
2. ఆయత్:كُلُّ نَفۡسِۢ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ; అనువాదం: ప్రతీ వ్యక్తీ తాను సంపాదించే దానికి తాకట్టుగా ఉంటాడు[ముదస్సిర్ సూరా:74, ఆయత్:38] 

అల్లాహ్ ఖుర్ఆన్ గురించి ఇలా ప్రకటించెను:وَلَوۡ كَانَ مِنۡ عِندِ غَيۡرِ ٱللَّهِ لَوَجَدُواْ فِيهِ ٱخۡتِلَٰفٗا كَثِيرٗا
అనువాదం: ఇది అల్లాహ్ తరవు నుండి కాక వేరొకరి తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుధ్ధమైన విషయాలు ఇండేవి[సూరయె నిసా, ఆయత్:82].

రిఫరెన్స్
1. ముహమ్మదీయు లందరిపైనా వర్తించే ఖలీఫా అధికారం, యువరాజత్వము, ప్రాతినిధ్యము, ఉత్తరాధికారము.
2. ప్రభుత్వం, ఆధిపత్యం.
3. మార్గదర్శిత్వము.
4. స్వామితనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10