ఇమామత్ దైవప్రవక్త‎(స.అ) సున్నతులలో

గురు, 06/17/2021 - 14:24

ఇమామత్ మరియు విలాయత్ ను సూచిస్తున్న దైవప్రవక్త(స.అ) యొక్క కొన్ని రివాయతుల వివరణ...

ఇమామత్ దైవప్రవక్త‎(స.అ) సున్నతులలో

ఇమామత్ యొక్క విషయంలో దైవప్రవక్త‎(స.అ) చాలా ప్రవచనాలు, ఉల్లేఖించారు. అవి షియా మరియు అహ్లెసున్నత్ వర్గాల వారు మసానీద్ మరియు చరిత్ర పుస్తకాలలో లిఖించారు. దైవప్రవక్త‎(స.అ) ఒకసారి దానిని “ఇమామత్” పదంతో గుర్తుచేస్తే మరో సారి “ఖిలాఫత్” పదంతో, అప్పుడప్పుడు “విలాయత్” పదం లేదా “అమారాత్” పదాన్ని ఉపయోగించేవారు. ఉదాహారణకు:

ఇమామత్ పదం ఉపయోగించబడ్డ రివాయతులు

దైవప్రవక్త(స.అ) ఇమామత్ గురించి ఇలా ప్రవచించారు: “మీ యొక్క అత్యుత్తమ ఇమామ్, మీకు అతనంటే మరియు అతనికి మీరంటే ఇష్టం ఉండాలి; మీరు అతనితో మరియు అతను మీతో కలవాలి. మీ అతినీఛమైన ఆయిమ్మహ్(ఇమాములు), మీకు అతనంటే వైరం మరియు అతనికి మీరంటే వైరం; మీరు అతని పై లఅనత్ చేస్తారు అతను మీ పై లఅనత్ చేస్తాడు. అప్పుడు ప్రజలు దైవప్రవక్త‎(స.అ)తో ఇలా ప్రశ్నించారు: ఓ దైవప్రవక్తా! మేము వాళ్ళపై ఖడ్గాల ద్వార జిహాద్ చేయవచ్చా? దైవప్రవక్త(స.అ), వాళ్ళు మీ మధ్య నమాజ్ చదువుతున్నప్పటి వరకు వద్దు అని అన్నారు”.[1]

మరో చోట ఇలా ప్రవచించారు: నా తరువాత నా మార్గం పై నడవని, మరియు నా సున్నత్ పై(కూడా) అమలు చేయని ఇమాములు ఉంటారు, వాళ్ళలో కొందరు ఖియామ్[2] చేస్తారు, వాళ్ళ హృదయాలు షైతానువి మరియు శరీరం మనుషుల వలే ఉంటాయి.[3]

ఖిలాఫత్ పదం ఉపయోగించబడ్డ రివాయతులు

“దీన్, ప్రళయం వచ్చేంత వరుకు లేదా మీ పై ఖురైష్ వంశం నుండి పన్నెండు మంది ఖలీఫాల కాలం పూర్తయ్యే వరకు స్థిరపడి ఉంటుంది”.[4]

మరో రివాయత్‌లో జాబిర్ బిన్ సుమ్రహ్ ఇలా ఉల్లేఖించారు: నేను, దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచిస్తుండగా విన్నాను: ఇస్లాం పన్నెండు ఖలీఫాల (అధికారం) వరకు గౌరవంగా ఉంటుంది, ఆ తరువాత ఒక పదాన్ని చెప్పారు అది నాకు అర్ధం కాలేదు అందుకని దైవప్రవక్త(స.అ) ఏమన్నారు అని? నా తండ్రి గారిని అడిగాను. అందుకు వారు దైవప్రవక్త(స.అ) “వాళ్ళందరు ఖురైష్ వంశానికి చెందిన వారైవుంటారు అని ఉపదేశించారు” అని జవాబిచ్చారు.[5]

అమారాత్ పదం ఉపయోగించబడ్డ రివాయతులు

“చాలా దగ్గర్లోనే మీకు తెలిసిన వాడే మరియు ఇష్ట పడనివాడే మీ యొక్క నాయకుడవుతాడు. మరి ఎవరైతే అతడి గురించి తెలుసుకున్నాడో అతను విముక్తుడయ్యాడు, మరియు నిరాకరించినవాడు సురక్షితమైయ్యాడు, కాని రాజీ పడ్డవాడు మరియు అతడి అడుగుజాడలలో నడిచినవాడు(ఇక నాశనం అయ్యాడు). ప్రజలు, అయితే మేము వాళ్ళతో యుధ్ధం చేయకూడదా? అని అడిగారు. దానికి దైవప్రవక్త‎(స.అ) ఇలా జవాబిచ్చారు: వాళ్ళు నమాజును చదువుతున్నంత వరకు వాళ్ళతో యుధ్ధం చేయకండి”[6]

మరో చోట ఇలా ఉంది: “పన్నెండు నాయకులు, వాళ్ళందరు ఖురైష్ వంశానికి చెందిన వారై ఉంటారు”.[7]

మరో చోట సహాబీయులకు భయపెడుతూ ఇలా ప్రవచించారు: “తొందరలోనే మీరు నాయకత్వం పై అత్యాశకు గురి అవుతారు కాని ఇది ప్రళయం నాడు అనుతాపానికి కారణం అవుతుంది”.[8]

విలాయత్ పదం ఉపయోగించబడ్డ రివాయతులు

“ఒకవేళ ఒక ముస్లిముల వాలీ[9] (తన ఆధినంలో ఉన్న) ముస్లింలను మోసం మరియు అన్యాయం చేసి ఉన్న స్థితిలో మరణిస్తే అల్లాహ్ అతని పై స్వర్గాన్ని హరామ్ గా నిర్ధారిస్తాడు”[10]

మరి అలాగే మరో చోట విలాయత్ పదాన్ని ఉపయోగించారు: “ఖురైష్ వంశానికి చెందిన పన్నెండుకి పన్నెండు, నాయకులుగా ఉన్నంత వరకు ప్రజల వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి”.[11]

ఇమామత్ మరియు ఖిలాఫత్ అర్ధాన్ని ఎటువంటి వ్యాఖ్య మరియు నెపము లేకుండా ఖుర్ఆన్[12] మరియు సున్నత్ నుండి ప్రదర్శించడం జరిగింది, అంతేకాదు ముఖ్యంగా అహ్లెసున్నత్‌ల యొక్క సహ్హాహ్ గ్రంథాలనే ఆశ్రయించాము. ఎందుకంటే ఖిలాఫత్ అధికారం పన్నెండు మంది పై నిలిచి ఉండడం, వారు ఖురైష్ వంశానికి చెందినవారై ఉండడం, ఇవి షియా ముస్లింల విశ్వాసాలలో సమ్మతమైనవి, అందులో ఎవరికి సందేహం లేదా అభిప్రాయబేధం లేదు అంతేకాదు అహ్లెసున్నతుల ఉలమాలలో కొందరు దైవప్రవక్త(స.అ) ఇలా చెప్పారు అని స్పష్టం చేశారు: దైవప్రవక్త(స.అ) ప్రవచన: “నా తరువాత పన్నెండు ఖలీపాలు ఉన్నారు వాళ్ళందరు బనీ హాషిం నుండి అయి ఉంటారు”.[13]

ఇదీ ఇమామత్ పై దైవప్రవక్త(స.అ) సున్నత్ సంక్షిప్త వివరణ. ముస్లిములందరు ఒకే ఉమ్మత్, కాని ఆ ఖిలాఫత్ సమస్య వాళ్ళను వివిధ వర్గాలుగా, తెగలుగా, విశ్వాసాల పరంగా మరియు ఆలోచన పరంగా విడదీసింది. ముస్లిములలో ఉన్న విబేధమంతా, అది ఫిఖాకు సంబంధించినది కానివ్వండి లేదా ఖుర్ఆన్ వ్యాఖ్యకు సంబంధించినది కానివ్వండి లేదా దైవప్రవక్త(స.అ) సున్నతులను అర్ధం చేసుకొనే విషయం కానివ్వండి అన్నింటికి ఆ ఖిలాఫత్ అధికారమే కారణం.

సఖీఫ తరువాత ఈ ఖిలాఫత్ పదవీ సమస్యే సరైన హదీసుల మరియు స్పష్టమైన ఆయతులను నిరాకరించడానికి కారణంగా మారింది. దానికోసం దైవప్రవక్త‎(స.అ) సున్నతులతో సంబంధం లేనటువంటి తప్పుడు హదీసులను తయారు చేయడం మొదలు పెట్టడం జరిగింది.

తరువాత లిఖించబడే వ్యాసాలలో ఇమామత్ మరియు ఖిలాఫత్ గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాం... ఇన్షా అల్లాహ్...

రిఫరెన్స్
1. సహీ ముస్లిం, భాగం6, పేజీ24, బాబొ ఖియారుల్ ఆయిమ్మ వ షిరారుహుమ్.
2. యుధ్ధం చేయాడానికి నడుము బిగించడం.
3. సహీ ముస్లిం, భాగం6, పేజీ20, బాబుల్ అమ్రి బిలుజూమిల్ జమాఅతి ఇంద జుహూరిల్ ఫితన్.
4. సహీ ముస్లిం, భాగం6, పేజీ4, బాబున్నాస్ తబఅ లి ఖురైషి వల్ ఖిలాఫతి ఫీ ఖురైషిన్.
5. సహీ ముస్లిం, భాగం6. సహీబుఖారీ, భాగం8, పేజీ105 మరియు 128.
6. సహీ ముస్లిం, భాగం6, పేజీ23, బాబొ వుజూబుల్ ఇన్కారి అలల్ ఉమరా.
7. సహీ బుఖారీ, భాగం8, పేజీ127, బాబుల్ ఇస్తిఖ్లాఫ్.
8. సహీ బుఖారీ, భాగం8, పేజీ106, బాబొ మా యుక్రహు మినల్ హిర్సి అలల్ అమారహ్.
9. రాజు, సంరక్షకుడు, ప్రభువు, స్వామి, యజమాని.
10. సహీ ముస్లిం, భాగం6, పేజీ3, బాబుల్ ఖిలాఫతి మిన్ ఖురైష్.
11. యనాబీయుల్ మువద్దహ్, భాగం3, పేజీ104.
12. https://te.btid.org/node/1915
13. యనాబీవుల్ మువద్దహ్, పేజీ 445.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4