ఇస్తిబ్సార్ గ్రంథ వివరణ

గురు, 01/11/2018 - 05:02

.షైఖ్ తూసీ[ర.అ] యొక్క రెండవ గ్రంథం అయిన అల్ ఇస్తిబ్సార్ గ్రంథం గురించి సంక్షిప్త వివరణ.

ఇస్తిబ్సార్ గ్రంథ వివరణ

ఇస్తిబ్సార్ గ్రంథం యొక్క ప్రత్యేకతలు.
1. “ఇస్తిబ్సార్” గ్రంథం సాటి లేని గ్రంథం. రెండు వ్యతిరేక హదీసుల మధ్య ఉన్న వ్యతిరేకాన్ని తొలగించి వాటిని ఒకటిగా చేసిన మొట్టమొదటి గ్రంథం.
2. “ఇస్తిబ్సార్” గ్రంథం, నమ్మదగిన మరియు సమ్మతించబడ్డ గ్రంథమే కాకుండా మంచి కూర్పుగల గ్రంథం. అందుకే “ఇబ్నె తావూస్”[ర.అ] ఈ గ్రంథం గురించి ఇలా అన్నారు: “ఒకవేళ ఒక విషయం పై వ్యతిరేక రివయత్ గనుక ఉంటే, తప్పకుండా ఇస్తిబ్సార్ గ్రంథంలో కూడా అది సూచించబడి ఉంటుంది”.
3. ప్రతీ “బాబ్”లో ముందుగా నమ్మదగ్గా లేదా సమ్మతించబడ్డ రివాయత్ ను ఉల్లేఖించి ఆ తరువాత మిగిలిన రివాయత్ లు ఉల్లేఖించబడతాయి. ఈ గ్రంథంలో ఫిఖాకు సంబంధించిన అన్ని టాపిక్స్ పై ఉల్లేఖించలేదు కేవలం వ్యతిరేకమైన రివాయత్ లు ఉన్న “బాబ్”లను మాత్రమే సూచించారు. కాని “బాబ్”ల క్రమం మాత్రం ఫిఖా గ్రంథాల ప్రకారంగానే చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారు. అంటే “కితాబ్ అల్ తహారత్” నుండి మొదలు పెట్టి “కితాబ్ అల్ దియాత్” పై సమాప్తించారు. ఈ గ్రంథం మూడు భాగలలో విభజించి ఉంది: మొదటి మరియు రెండవ భాగం ప్రార్థనలకు సంబంధించినవి. మూడవ భాగంలో మిగిలిన ఫిఖా అధ్యాయాలను ఉల్లేఖించారు.
ఈ గ్రంథంలో 5511 రివాయత్లు ఉన్నాయి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13