గదీర్ సంఘటన వివరణ అహ్లె సున్నత్ గ్రంథాలలో

బుధ, 06/23/2021 - 15:17

గదీర్ సంఘటన అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉందా? అన్న విషయంపై సంక్షిప్త వివరణ...

గదీర్ సంఘటన వివరణ అహ్లె సున్నత్ గ్రంథాలలో

గదీర్ సంఘటన అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉల్లేఖించబడి ఉందా?
ఈ ప్రశ్నలకు జవాబు “అవును” అనే అనాలి ఎందుకంటే అహ్లెసున్నతుల చాలా ఉలమాలు ఈ సంఘటనను కాలాల పరంగా కూడా లిఖించారు. అహ్లెసున్నతుల పుస్తకాల నుండి కొన్ని సాక్ష్యాలు:

1. “అహ్మద్ ఇబ్నె హంబల్”, “జైద్ ఇబ్ అర్ఖమ్” ద్వార ఇలా రివాయత్‌ను ఉల్లేఖించారు: “మేము దైవప్రవక్త(స.అ)తో పాటు ఒక లోయలో దిగాము దానిని “గదీరె ఖుమ్” అంటారు. దైవప్రవక్త‎(స.అ) నమాజ్ చదవమని ఆదేశించారు, ఆ మండుటెండలో నమాజ్ చదివాము ఆ తరువాత దైవప్రవక్త‎(స.అ) ఉపన్యాసమిచ్చారు. “సుమ్రహ్” అను ఒక చెట్టుపై వస్త్రాన్ని వేసి దైవప్రవక్త‎(స.అ)ను సూర్యకాంతి నుండి అడ్డుకున్నారు. ఆ తరువాత ఇలా అన్నారు: “మీకు తెలియదా” లేదా “నేను మీ పై మీ కన్న ఎక్కువ అధికారం ఉన్న వాడిని అని సాక్ష్యామివ్వరా?” అని ప్రశ్నించారు. అందరు కలిసి కట్టుగా “అవును” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: నేను ఎవరికి మౌలా(స్వామి)నో అలీ(అ.స) కూడా వాళ్ళ స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ‎(అ.స)ని ద్వేషించే వారిని అప్రతిష్టతకు గురిచేయ్యి”.[1]

2. “ఇమామ్ నిసాయి”, తన పుస్తకం “అల్ ఖసాయిస్”లో “జైద్ బిన్ అర్ఖమ్” ద్వార రివాయత్‌ను ఉల్లేఖించారు: అతను ఇలా అన్నారు: “దైవప్రవక్త‎(స.అ), హజ్జతుల్ విదా నుండి తిరిగి వస్తుండగా “గదీరె ఖుమ్‌”లో దిగినప్పుడు కర్రలతో పీఠాన్ని తయారు చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తయిన తరువాత ఇలా అన్నారు: బహుశ ఈ సారి అల్లాహ్ తరపు నుండి పిలుపు రావచ్చు మరి నేను దానిని అంగీకరించ వచ్చు (అందుకని) మీ మధ్య అత్యంత విలువైన రెండు వస్తువులను విడిచి వెళ్తున్నాను...., అల్లాహ్ గ్రంథం మరియు నా ఇత్రత్(వారే) నా అహ్లెబైత్(అ.స)లు (కూడాను). నా తరువాత ఈ రెండింటి పట్ల మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాను. (ఈ విషయాన్ని నా నుండి వినుకోండి) ఈ రెండు నా వద్ద (కౌసర్) సేలయేరుకు చేరనంత వరకు వాటిలో ఎటువంటి విబేధం మరియు దూరం ఎర్పడదు. ఆ తరువాత ఇలా అన్నారు: అల్లాహ్ నాకు మౌలా(స్వామి), నేను విశ్వాసులందరి స్వామిని, ఆ తరువాత అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నేను ఎవ్వరి వలీ(స్వామి)నో అలీ(అ.స) కూడా అతని వలీయే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవూ ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు. “అబుల్ తుఫైల్‎”‎ ఇలా ప్రశ్నించాడు: ఓ జైద్ నీవు విన్నావా? జైద్ ఇలా అన్నారు: అవును(నేనే కాదు) ఆ మైదానంలో ఉన్న వారందరూ తమ తమ కళ్ళతో చూశారు మరియు తమ తమ చెవులతో విన్నారు”.[2]

3. “హాకిమె నైషాపూరీ”, “జైద్ బిన్ అర్ఖమ్” ద్వార రెండు సరైన రావీయుల క్రమంతో షైకైన్(బుఖారీ, ముస్లిం)ల షరతుతో ఇలా ఉల్లేఖించారు: అతను ఇలా అన్నారు: “దైవప్రవక్త(స.అ), హజ్జతుల్ విదా నుండి తిరిగి వస్తుండగా “గదీరె ఖుమ్”లో దిగినప్పుడు కర్రలతో పీఠం తయారు చేసేందుకు ఆదేశించారు ఆ పని పూర్తయ్యాక ఇలా అన్నారు: అల్లాహ్ నన్ను తన వద్దకు ఆహ్వానించవచ్చు మరి నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించవచ్చు. నేను మీ మధ్య రెండు ప్రతిష్టాత్మకమైన వస్తువులను విడిచి వెళ్తున్నాను వాటిలో ఒకటి, మరోకటికి మించినవి, మరి అవి అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స)లు, నా తరువాత ఈ రెండింటితో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాను? ఆ రెండింటి మధ్య నా వద్దకు కౌసర్ సేలయేరుకు చేరనంత వరకు ఎన్నటికి విభేదం రాదు. ఆ తరువాత ఇలా అన్నారు: అల్లాహ్ నాకు మౌలా(స్వామి), నేను ప్రతీ విశ్వాసుని స్వామిని, ఆ తరువాత హజ్రత్ అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నేను ఎవ్వరి వలీ(స్వామి)నో అలీ(అ.స) అతనికీ వలీయే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు”.[3]

4. “తబరానీ” తన పుస్తకం “మొజముల్ కబీర్”లో రావీయుల సరైన క్రమంతో “జైద్ ఇబ్నె అర్ఖమ్” మరియు “హుజైఫహ్ ఇబ్నె అసీదుల్ గఫ్పారీ” ద్వార ఉల్లేఖించారు: “దైవప్రవక్త(స.అ), గదీరె ఖుమ్‌లో కొన్ని చెట్ల క్రింద ఉపన్యాసమిస్తూ ఇలా ప్రవచించారు: ప్రజలారా! తొందర్లోనే నాకు పిలుపు రావచ్చు మరియు నేను దాన్ని అంగీకరించనూ వచ్చు, (వినండి...) నా పై బాధ్యత ఉంది మరియు మీ పై కూడా బాధ్యత ఉంది. మీరేమంటారు(చెప్పండి)? అందరు ఇలా అన్నారు: మేము సాక్ష్యమిస్తున్నాము మీరు ప్రచారం చేశారు, జిహాద్ చేశారు, నీతి నియమాల ఉపదేశాలు ఇచ్చారు. అల్లాహ్ మీకు మంచి ప్రతి ఫలాన్ని ప్రసాదించాలి. దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: మీరు لا اله الا الله، محمد عبده و رسوله , స్వర్గం ఉందని, నరకం ఉందని, మృత్యు ఉందని, పునరుత్థానం ఉందని, మరియు ప్రళయం రావడంలో ఎవ్వరికీ ఎటువంటి సందేహం లేదు అని నమ్మరా!? అందరు ఇలా అన్నారు: అవును! మేము వీటన్నీంటి పై కూడా సాక్ష్యం ఇస్తున్నాము. అప్పుడు దైవప్రవక్త‎(స.అ) ఇలా అన్నారు: ఓ అల్లాహ్ నీవే సాక్షివి, ఆ తరువాత ఇలా ప్రవచించారు: ప్రజలారా! అల్లాహ్ నా మౌలా(స్వామి) మరి నేను విశ్వాసుల స్వామిని నేను విశ్వాసుల పై వాళ్ళ కన్న ఎక్కువ అధికారం గల వాడిని, నేను ఎవరి స్వామినో ఇతను(అలీ(అ.స)) కూడా అతడి స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు, ఆ తరువాత ఇలా అన్నారు: నేను నీ కన్న ముందు వెళ్ళిపోతాను మరియు కౌసర్ సేలయేరు పై నా వద్దకు మీరందరు వస్తారు, ఆ సేలయేరు (పొడవు, వెడల్పుల పరంగా) బస్రా నుండి సున్ఆ వరకు ఉంటుంది, నక్షత్రాలకు సమానంగా దాని పై వెండి కప్పులు ఉంటాయి, మరి మీరు నా వద్దకు వచ్చినప్పుడు నేను మీతో ఆ రెండు అత్యంత విలువైన వస్తువుల(సఖ్లైన్) గురించి ప్రశ్నిస్తాను నా తరువాత వాటితో మీ ప్రవర్తన ఎలా ఉండింది, వాటిలో పెద్దది అల్లాహ్ గ్రంథం దాని ఒక అంచు మీ చేతుల్లో ఉంటే మరొకటి అల్లాహ్ చేతిలో ఉంది అందుకని రుజుమార్గం తప్పకుండా ఉండాలంటే దానిని పట్టుకొని ఉండండి, అందులో ఎటువంటి మార్పులు తీసుకురాకండి మరియు (రెండవది) నా అహ్లెబైత్(అ.స)లు. సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడయిన అల్లాహ్ నాకు ఈ రెండు కౌసర్ సేలయేరు పై నా వద్దకు చేరే వరకు విడిపోవు అని తెలియపరిచాడు”.[4]

5. “‎ఇమామ్ అహ్మద్”, “అల్ బర్రా బిన్ ఆజిబ్” నుండి రెండు రకాలుగా ఈ సంఘటనను ఉల్లేఖించారు: బర్రా బిన్ ఆజిబ్ ఇలా అన్నారు: మేము దైవప్రవక్త‎(స.అ)తో పాటు “గదీరె ఖుమ్‌”లో దిగినప్పుడు “الصلواه جامعه” అని అరుపు వినబడింది, రెండు చెట్ల క్రింద దైవప్రవక్త‎(స.అ) కోసం ఊడ్చి శుభ్రం చేశారు మరియు దైవప్రవక్త(స.అ) అక్కడ జోహ్ర్ నమాజు చదివి అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నాకు విశ్వాసుల పై వాళ్ళ కన్న ఎక్కువ అధికారం ఉందని మీకు తెలియదా? అందరు కలిసి కట్టుగా అవును(మాకు తెలుసు) అని అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) మరల ఇలా అన్నారు: నేను ప్రతీ విశ్వాసుని పై అతడి కన్న ఎక్కువ అధికారం గలదు అని మీకు తెలియదా? అందరు అవును అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) చేయ్యిని పైకి లేపి ఇలా ప్రకటించారు: నేను ఎవరికి స్వామినో అతడికి ఈ అలీ(అ.స) కూడా స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు (ఆ తరువాత) రావీ ఇలా అన్నాడు: ఆ తరువాత ఉమర్, అలీ(అ.స)తో కలిసి ఇలా అన్నారు: అబూతాలిబ్ కుమారా! నీకు శుభాకాంక్షలు, నీవు పురుష మరియు స్త్రీ విశ్వాసులందరి పై నాయకుడివయ్యావు”.[5]

రిఫరెన్స్
1. ముస్నదె అహ్మదె హంబల్, భాగం4, పేజీ372.
2. కితాబుల్ ఖసాయిస్, నిసాయి, పేజీ21.
3. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ109.
4. సవాయిఖుల్ ముహ్రఖహ్, ఇబ్నె హజర్, పజీ25, తబరానీ, హకీం, తిర్మిజీ ఉల్లేఖన.
5. ముస్నదె అహ్మదె హంబల్, భాగం4, పేజీ281. కన్జుల్ ఉమ్మాల్, భాగం15, పేజీ11. ఫజాయిలుల్ ఖమ్సహ్ మినస్ సహ్హాహిస్ సిత్తహ్, భాగం1, పేజీ350.
 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13