గదీస్ సంఘటన ప్రస్తావనం సహీ ముస్లిం గ్రంథంలో

గురు, 06/24/2021 - 13:31

గదీస్ సంఘటన ఉల్లేఖనం సహీ ముస్లిం గ్రంథంలో కూడా రచించబడి ఉంది...

గదీస్ సంఘటన ప్రస్తావనం సహీ ముస్లిం గ్రంథంలో

ఈ హదీసును “ముస్లిం” కూడా తన పుస్తకం “సహీ ముస్లిం”లో “జైద్ బిన్ అర్ఖమ్” కథనాన్ని ఉల్లేఖించారు కాని చాలా సంక్షిప్తంగా; జైద్ ఇలా అన్నారు: “దైవప్రవక్త(అ.స), మక్కా మరియు మదీనా మధ్యలో ఒక “ఖుమ్” అను చెలమ వద్ద ఒక ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: అల్లాహ్ స్తోత్రము తరువాత ఇలా అన్నారు: ప్రజలారా! నేను కూడా ఒక మనిషినే, తొందరలోనే నా ప్రభువు నుండి జిబ్రయీల్ వార్తను తీసుకొని రావచ్చు మరి నేను దానిని అంగీకరించనూ వచ్చు(అందుకని) నేను మీ మధ్య రెండు చాలా ప్రతిష్టాత్మకమైన వస్తువులను వదిలి వెళ్తున్నాను. ఆ రెండింటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం అందులో హిదాయత్ మరియు వెలుగు ఉన్నాయి అందుకని అల్లాహ్ గ్రంథాన్ని తీసుకోండి మరియు దానిని వదలకండి. ఆ తరువాత అల్లాహ్ గ్రంథం పట్ల ప్రజలలో ఆసక్తిని పెంచారు. ఆ తరువాత ఇలా అన్నారు: (రెండవది) నా అహ్లెబైత్(అ.స)లు నేను నా అహ్లెబైత్(అ.స)ల విషయంలో మీకు అల్లాహ్ ప్రమాణాన్ని గుర్తుచేస్తున్నాను. ఈ వాఖ్యాన్ని మూడు సార్లు అన్నారు...,”[1]

వివరణ: ఇమామ్ ముస్లిం, గదీర్ సంఘటనను చాలా సంక్షిప్తంగా ఉల్లేఖించారు అయినా సరే అల్ హందు లిల్లాహ్ సత్యాన్ని నిరూపించడానికి ఇది చాలు. ఈ సంక్షిప్తం స్వయంగా “జైద్ బిన్ అర్ఖమ్” తరపు నుండే అయ్యి ఉండవచ్చు ఎందుకంటే (అప్పటి) రాజకీయ పరిస్థితులు అతను హదీస్‌ను దాచడానికి బలవంతం పెట్టి ఉండోచ్చు మరియు ఈ హదీస్ యొక్క పదధోరణితో కూడా ఈ మాట అర్ధమవుతుంది. రావీ ఇలా అన్నాడు: నేను “హసీన్ బిన్ సీరహ్” మరియు “ఉమర్ బిన్ ముస్లిం”తో పాటు కలిసి “జైద్ బిన్ అర్ఖమ్” వద్దకు వెళ్ళాను, మేము అతని వద్ద కూర్చుండిపోయిన తరువాత హసీన్ ఇలా అన్నాడు: జైద్! మీరు చాలా మంచిని పొందారు, మీరు దైవప్రవక్త‎(స.అ)ను చూశారు అతని నుండి హదీసు విన్నారు, అతనితో పాటు కలిసి జిహాద్‌లో పాల్గున్నారు, అతని వెనుక నమాజు చదివారు అందుకని మీరు దైవప్రవక్త‎(స.అ)తో విన్నది ఏదైనా ఉంటే అది మాకు కూడా వినిపించండి. జైద్ ఇలా అన్నారు: వల్లాహ్, నా భ్రాతృజుడా! నేను చాలా వృధ్దుడయిపోయాను, కాలం కూడా చాలా గడిచిపోయింది దైవప్రవక్త‎(స.అ) నుండి నేర్చుకున్న వాటి నుండి కొన్నీంటిని మరిచిపోయాను అందుకు నేను చెప్పింది తీసుకొండి మరియు నేను చెప్పనిదాని పై చెప్పమని కష్టపెట్టకండి, ఆ తరువాత జైద్ ఇలా అన్నారు: “దైవప్రవక్త‎(స.అ) ఒకసారి ఖుమ్ అను ప్రదేశంలో మాకు ఉపన్యాసమిచ్చారు...,” ఈ హదీసుతో తెలిసిందేమిటంటే హసీన్, గదీర్ గురించి అందరి ముందు ప్రశ్నించడం వల్ల అతనికి కష్టం ఎదురయ్యింది మరియు అతనికి తెలుసు ఈ ప్రశ్నకు సూటిగా జవాబివ్వడం అతనికి ప్రభుత్వం తరపు నుండి కష్టాలకు కారణం అవుతుంది అని ఎందుకంటే ఆ ప్రభుత్వం ప్రజలకు హజ్రత్ అలీ(అ.స)పై లఅనత్ చేయడం పై బలవంతం పెట్టే ప్రభుత్వం(అలాంటి ప్రభుత్వం హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టతల ప్రచారణను ఎలా తట్టుకో గలదు?) అందుకనే ఇందులో జైద్ క్షమాపణ వాఖ్యలు ఉన్నాయి. నేను ముసలివాడినయిపోయాను, ఈ సంఘటన జరిగి చాలా కాలం గడిచిపోయింది, నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం లేవు, మరియు అక్కడున్న వాళ్ళతో ఇలా చెప్పడం నేను చెప్పింది వినండి మరియు చెప్పని వాటి గురించి నన్ను ప్రశ్నించకండి.

భయం ఉన్నప్పటికీ గదీర్ సంఘటనను సవరణ చేసి చెప్పినా కూడా జైద్ బిన్ అర్ఖమ్, చాలా నిజాలను స్పష్టం చేశారు(అల్లాహ్ అతనికి మంచి ప్రతిఫలాన్ని ఇవ్వుగాక) గదీర్ సంఘటనను చెప్పకుండానే అంతా చెప్పేశారు. అదేలా అంటే అతను మక్కా మరియు మదీనా మధ్యలో ఒక “ఖుమ్” అనబడు చెలమ వద్ద దైవప్రవక్త‎(స.అ) ఉపన్యాసమిచ్చారు, ఆ తరువాత హజ్రత్ అలీ(అ.స) పేరు చెప్పకుండానే అతని ప్రతిష్టతలను ప్రవచించారు మరియు హదీసె సఖ్లైన్‌ను చెప్పి అహ్లెబైత్(అ.స)‌లు ఖుర్ఆన్ యొక్క భాగస్థులు అని ప్రవచించారు. ఆ తరువాత సంఘటన ఫలితాన్ని అక్కడున్న వాళ్ళ ఆలోచనకు వదిలేశారు ఎందుకంటే ముస్లిములందరికి తెలుసు హజ్రత్ అలీ(అ.స) అహ్లెబైత్(అ.స)లలో ప్రముఖులని. ఈ కారణంతోనే ఇమామ్ ముస్లిం కూడా మేము అర్ధం చేసుకున్నట్లే అర్ధం చేసుకున్నారు అందుకే అతను ఈ హదీసును హజ్రత్ అలీ(అ.స) యొక్క ప్రతిష్టతల అధ్యాయంలో ప్రవచించారు నిజానికి ఇందులో హజ్రత్ అలీ(అ.స) గారి పేరు కూడా లేదు.

రిఫరెన్స్
1. సహీ ముస్లిం, భాగం7, పేజీ122, బాబొ ఫజాయిలి అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స), ఈ హదీసును ఇమామ్ అహ్మద్, తిర్మిజీ, ఇబ్నె అసాకిర్ మొ॥. వారు కూడా ప్రస్తావించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10