సూర్యోదయానికి ముందు నిద్రపోవడం

బుధ, 06/30/2021 - 14:02

తులూఐన్(ఫజ్ర్ మరియు సూర్యోదయం) మధ్య నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు అహ్లెబైత్(అ.స) మాటల్లో...

సూర్యోదయానికి ముందు నిద్రపోవడం

తులూఐన్(ఫజ్ర్ మరియు సూర్యోదయం) మధ్య నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు అహ్లెబైత్(అ.స) మాటల్లో:

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “ أَنَّ النَّوْمَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَ قَبْلَ صَلَاةِ الْعِشَاءِ یُورِثُ الْفَقْرَ وَ شَتَاتَ الْأَمْرِ; సూర్యుడు ఉదయించక ముందు నిద్ర మరియు అలాగే ఇషా నమాజ్ కు ముందు నిద్ర, దరిద్రాన్ని మరియు బాధలను తెచ్చిపెడుతుంది”[1]

హజ్రత్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: “ فِی حَدِیثٍ قَالَ لَا تَنَامَنَّ قَبْلَ طُلُوعِ الشَّمْسِ فَإِنِّی أَكْرَهُهَا لَكَ إِنَّ اللَّهَ یُقَسِّمُ فِی ذَلِكَ الْوَقْتِ أَرْزَاقَ الْعِبَادِ عَلَى أَیْدِینَا یُجْرِیهَا; ఎట్టిపరిస్థితిలో సూర్యోదయానికి ముందు నిద్రపోవద్దు, ఇది నీ కోసం మంచిది కాదు అని భావిస్తున్నాను, ఎందుకంటే అల్లాహ్ ఆ సమయంలో తమ దాసులకు మా ద్వార ఉపాధిని ప్రసాదిస్తాడు”[2]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ النوم من أول النهار خرق و نوم القائلة نعمة و النوم بعد العصر حمق  و بین العشاءین یحرم الرزق; ఉదయంపూట నిద్ర అజ్ఞానం, మిట్టమధ్యాహ్నం నిద్ర అనుగ్రహం, అస్ర్ సమయం నిద్ర బుద్దిహీనం, సాయంకాలం నిద్ర(మగ్రిబ్ మరియు ఇషాఁ మధ్య) ఉపాధి కోల్పోవడానికి కారణం అవుతుంది”[3]

అంటే సూర్యోదయానికి ముందు నిద్రపోవడం ఎట్టి పరిస్థితులలో సరి కాదు. 

రిఫరెన్స్
1. ముస్తద్రికుల్ వసాయిల్, భాగం5, పేజీ110.
2. వసాయిల్ అల్ షియా, భాగం6, పేజీ498.
3. మకారిముల్ అఖ్లాఖ్, పేజీ288.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13