మానవ స్వభావం

సోమ, 07/05/2021 - 14:37

సృష్టికర్త పట్ల విశ్వాసం మానవ స్వభావంలో ఉంది అన్ని విషయం పై సంక్షిప్త వివరణ...

మానవ స్వభావం

మనిషి తన బాల్యాన్ని పూర్తి చేసుకొని మంచి చెడ్డలను గుర్తించే స్థితికి చేరినప్పుడు అతడు తన మనస్సాక్షి(ఫిత్రత్, స్వభావం) ని గ్రహించనట్లైతే నిజం, న్యాయం, ఇతరులకు సహాయపడడం అలాగే ఇతర మంచి లక్షణాలను ఇష్టపడడం., అంటే మంచి లక్షణాలలో ఉన్న మంచిని గ్రహించడం, అతడికి తెలుస్తుంది. అతడు ఇది పుస్తకం చదివో లేక ఎక్కడో నేర్చుకున్న విషయమో కాదు. ఒకవేళ ఇలాంటి వ్యక్తితో ఎవరైనా “ఏ ఆధారంతో నిజం చెప్పడం మంచిపని అని తెలుసుకున్నావు?” అని ప్రశ్నిస్తే అతడు ఇలా సమాధానమిస్తాడు: “దీనిని ఏదో సాక్ష్యాధారాలతోనో తెలుసుకోలేదు, దాని మంచి నా మనస్సాక్షితో పాటు ఉంది, నేనే స్వయంగా తెలుసుకున్నాను, నా అంతరాత్మ నన్ను తెలియపరిచింది!”
ఇదే విధంగా సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం కూడా మనిషి మనస్సాక్షికి తెలుసు, సృష్టికర్త ఉన్నాడు అన్న విశ్వాసం తెలుసుకోవడం కోసం ఎవరో బోధించనవసరం లేదు, పుస్తకాలు చదవనవసరం లేదు; అది తెలుసుకునేందుకు కేవలం మనస్సాక్షిపై దృష్టిపెడితే చాలు ఈ సృష్టిని ఒక జ్ఞాని మరియు శక్తివంతుడైన ఒక సృష్టికర్త సృష్టించాడు అని తెలుకుంటాడు.
మనిషి చరిత్రను చూసుకున్నట్లైతే; సృష్టికర్త ఉన్నాడు అన్న నమ్మకం ప్రతీ కాలంలో ఉండేది. చివరికి మనిషి అసంపూర్ణ మృగంగా ఉండేకాలం మరియు అనాగరికతగా ఉండే సమయంలో కూడా సృష్టికర్త పట్ల విశ్వాసం ఉండేది. అయితే కొందరు ఆ సృష్టికర్తను గుర్తించే విషయంలో పొరపాటుకు గురి అయ్యేవారు, ఉదాహారణకు కొందరు సూర్యుడు అంటే కొందరు నక్షత్రాలు లేదా భూమిపై ఉన్న జీవులను తమ మరియు ప్రపంచ సృష్టికర్తా, ప్రభువుగా భావించేవారు. అంటే సృష్టికర్త ఉన్నాడన్న నమ్మకం అయితే వారిలో ఉండేది, కాని ఆ సృష్టికర్త ఎవరూ అన్న విషయంలో వారికి స్పష్టత ఉందేది కాదు.
సృష్టికర్త పట్ల నమ్మకం మనస్సాక్షి మరియు మానవ స్వభావం ద్వార తెలుస్తుంది అన్న విషయం తెలిసిన తరువాత ఇక్కడ గ్రహించాల్సిన ఒక విషయమేమిటంటే; ఫిత్రత్(మనస్సాక్షి మరియు మానవ స్వభావం)కి సంబంధించిన అంశాలు ఒక్కోసారి కొన్ని ముఖ్య కారణాల వల్ల పరధ్యానానికి గురి అవుతాయి. దీని ఉదాహారణ ఒక మందపాటి బట్ట వెలుగుతున్న బల్బుపై వేస్తే, అది ఆ బల్బు యొక్క కాంతిని ప్రకాశించకుండా ఆపుతుంది; అదే విధంగా సృష్టికర్త ఎరుక అన్యాయం వల్ల, గర్వం వల్ల, మనోవాంఛల వల్ల మరియు ఇతర పాపముల వల్ల పరధ్యానం అనే మందపాటి బట్ట క్రింద ఉండిపోతుంది! అది మనిషికి ఇలాంటి విశ్వాసం(సృష్టికర్త పట్ల విశ్వాసం) అతడి స్వభావంలో ఉంది అన్న విషయాన్నే తెలియకుండా ఉంచేస్తుంది. కాని ఎప్పుడైతే ఆ పరధ్యానం పరదాలు అడ్డుకుంటాయో మనిషి స్వయంగా తన సృష్టికర్తను తన సహజ స్వభావం ద్వార గ్రహిస్తాడు.
నలువైపుల నుంచి కష్టాలు కమ్ముకొని చివరికి ఏ దారి లేకుండా మిగిలిపోయే వ్యక్తిని ఈ స్వభావం గురించి అడిగితే అతడు ఈ స్వభావం గురించి అందరి కంటే వివరంగా వర్ణించగలడు. లేదా విమానంలో ఉండగా ఈ విమానం పడిపోబోతుంది ఇక ఎవరూ కాపాడలేరు అని తెలిసినప్పుడు లోపాల నుంచి మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు అని మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. నిజానికి ఆ మనస్సాక్షి చేత సూచించబడినవాడే సృష్టికర్త.[1]
ఒక రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఒకరోజు ఒక వ్యక్తి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) వద్దకు వచ్చి అల్లాహ్ మరియు సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం పై ఏదైనా సాక్ష్యాన్ని వివరించండి అని ప్రశ్నించాడు. ఇమామ్ దాని సమాధానం క్రమంలో ఇలా ప్రశ్నించారు: నువ్వెప్పుడైనా షిప్ ప్రయాణం చేశావా?
అతడు: ఔను
ఇమామ్: ఎప్పుడైనా ప్రయాణిస్తున్న షిప్ పాడైపోయి మునిగిపోతుండగా చుట్టు ప్రక్కల నిన్ను కాపాడేందుకు మరో షిప్ లేని సమయం, అలాగే నీకు ఈదడం రాకపోవడం వంటి పరిస్థితులు నీకు ఎదురయ్యాయా?(అనగా ఎటువంటి సహాయం లేకపోవడం)
అతడు: ఔను
ఇమామ్: నీ ఆశలు నిరాశలు అయిన ఆ సమయంలో, నీ గుండెలోతుల్లోనుంచి ఎవరో నన్ను రక్షిస్తాడు, ఈ ఆపద నుంచి కాపాడతాడు అనే ఆశ కలిగిందా?
అతడు: ఔను, నన్ను ఈ ఆపద నుంచి కాపాడే శక్తి ఉందని గుండె లోతుల్లో నుంచి ఆశ కలిగింది.
ఇమామ్: నీ హృదయానికి భరోసా ఇచ్చిన శక్తియే సృష్టికర్త, అల్లాహ్.[2]

రిఫరెన్స్
1. ఉసూలె దీన్ బరాయె హమే, ఆయతుల్లాహ్ రిజా ఉస్తాదీ, పేజీ10, ఇంతెషారాతె దారుల్ ఫిక్ర్, ఖుమ్, 1384.
2. షేఖ్ సదూఖ్, తౌహీదె సదూఖ్, పేజీ231, చాపె జదీద్. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12