10 రకాల మనుషులు మరియు వారి స్వభావాలు

శుక్ర, 07/09/2021 - 13:48

హజ్రత్ లఖ్మాన్ తన కుమారుడికి చెప్పిన 10 రకాల మనుషులు మరియు వారి స్వభావాలు...

10 రకాల మనుషులు మరియు వారి స్వభావాలు

హజ్రత్ లుఖ్మాన్ తన కుమారుడ్ని ఇలా ఉపదేశించారు: బాబూ! ప్రతీ దానికీ కొన్ని సంకేతాలంటాయి, దాని ద్వారానే అవి గుర్తించబడతాయి. వాటి ద్వారానే వాటిని నిదర్శించగలము;
1. సాలెహ్(మంచి)కి మూడు సంకేతాలు: నమాజ్, రోజా(ఉపవాసం) మరియు జకాత్
2. ముతజాహిర్(గొప్పలు చెప్పుకునేవాడు)కీ మూడు సంకేతాలున్నాయి: తన కన్నా గొప్ప అనుకున్నవారిని పొగుడ్తూ ఉంటారు, తెలియని దాని గురించి చెబుతూ ఉంటారు, చేతికి అందనివాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
3. దుర్మార్గుడు, మూడు సంకేతాలు గలడు: తమ పైవాడి ఆదేశాలను పాటించడు, తన క్రిందవారిని హంసిస్తాడు, దుర్మార్గులకు సహాయపడతాడు.
4. మునాఫిఖ్(కపటవర్తనుడు) మూడు సంకేతాలు: అతడి నోరు అతడి మనసుకు వ్యతిరేకం, అతడి మనసు అతడి పనులకు వ్యతిరేకం, పైకి కనిపించే అతడి రూపం లోపలి రూపానికి విరుద్ధం.
5. పాపాత్ముడు, మూడు సంకేతాలుంటాయి: ద్రోహానికి తలబడతాడు, అబద్ధమాడతాడు, తాను చెప్పిన మాటనే వ్యతిరేకిస్తాడు.
6. రియాకార్(జనాలను చూపేందుకు పని చేయువాడు), మూడు సంకేతాలు: ఒంటరిగా ఉంటే నిర్లక్ష్యం వహిస్తాడు, జనం ఉంటే చురుకుగా ఉంటాడు, ప్రతీ పనిలో ప్రజల ప్రశంసలు పొందే విధంగా తనను నిర్ధారించుకుంటాడు.
7. హసూద్(ఈర్ష్యగలవాడు) మూడు సంకేతాలు: మనిషి లేకపోతే అతడి గురించి అతడి వీపు వెన చెడుగా మాట్లాడతాడు, ముందు ఉంటే అతడిని పొగుడ్తూ ఉంటాడు, ఆపదలు వస్తే తల బాదుకుంటాడు.
8. ఇస్రాఫ్ కార్(అతికి గురైనవాడు) యొక్క మూడు సంకేతాలు: అవసరం లేనివాటిని కొంటాడు, అవసరం లేనివాటిని ధరిస్తాడు, అవసరం లేనివాటిని తింటాడు.
9. సోమరిపోతు యొక్క మూడు సంకేతాలు: నిర్లక్ష్యం చేస్తాడు దాంతో కొరతకు గురి అవుతాడు, కొరత వల్ల నష్టానికి గురి అవుతాడు, నష్టాన్ని సాగదిస్తాడు చివరికి పాపానికి గురి అవుతాడు.
10. గాఫిల్(మందబుద్ధిగలవాడు) యొక్క సంకేతాలు: పొరపాటు, వినోదం మరియు మతిమరుపు.

రిఫరెన్స్
ఖిలాలె సదూఖ్, షేఖ్ సదూఖ్, పేజీ121. బిహారుల్ అన్వార్, మజ్లిసీ, భాగం13, పేజీ415.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14