హజ్రత్ అలీ(అ.స) శిక్షణ బాధ్యతలు

బుధ, 07/14/2021 - 18:20

హజ్రత్ అలీ(అ.స) జీవితం పుట్టుక నుంచి దైవప్రవక్త(స.అ) బెఅసత్ వరకు...

హజ్రత్ అలీ(అ.స) శిక్షణ బాధ్యతలు

హజ్రత్ అలీ(అ.స), రజబ్ మాసం యొక్క 13వ తేదీ ఆముల్ ఫీల్ 30వ సంవత్సరం కాబాలో జన్మించారు. తల్లి ఫాతెమా బింతె అసద్ మరియు తండ్రి అబూతాలిబ్. రమజాన్ మాసం 21వ తేదీ హిజ్రీ 40వ సంవత్సరం కూఫా పట్టణంలో వీరమరణం పొందారు. వారి సమాధి నజఫె అష్రఫ్ లో ఉంది. హజ్రత్ అలీ(అ.స) జీవితం భాగాలు దైవప్రవక్త(స.అ) బేసత్ కు 10 సంవత్సరాల ముందు అమీరుల్ మొమినీన్ జన్మించారు, ఇస్లాం చరిత్రలో సంభవించిన సంఘటనలలో నిత్యం దైవప్రవక్త(స.అ) ప్రక్కనే ఉన్నారు. అలాగే దైవప్రవక్త(స.అ) మరణానంతరం వారు 30 సంవత్సరాల వరకు ఉన్నారు. వారి 63 సంవత్సరాల ఈ జీవితాన్ని క్రింద చెప్పబడే విధంగా విభజించవచ్చు:
1. పుట్టుక నుంచి దైవప్రవక్త(స.అ) బెఅసత్ వరకు,
2. బెఅసత్ నుంచి హిజ్రత్ వరకు,
3. హిజ్రత్ నుంచి దైవప్రవక్త(స.అ) మరణం వరకు,
4. దైవప్రవక్త(స.అ) మరణం నుంచి వారి ఖిలాఫత్ వరకు(హజ్రత్ అబూబక్ర్, ఉమర్ మరియు ఉస్మాన-ర.అ యొక్క ఖిలాఫత్ కాలం),
5. అమీరుల్ మొమినీన్ యొక్క ఖిలాఫత్ కాలం.
పుట్టుక నుంచి దైవప్రవక్త(స.అ) బెఅసత్ వరకు
హజ్రత్ అలీ(అ.స) పుట్టుక నుంచి దైవప్రవక్త(స.అ) బెఅసత్ వరకు, వారి జీవితం యొక్క ఈ భాగంలో వారి వయసు కేవలం 10 సంవత్సరములు మాత్రమే. హజ్రత్ అలీ(అ.స) జన్మించినప్పుడు దైవప్రవక్త(స.అ) వయసు ఇంచుమించు 30 సంవత్సరాలు. దైవప్రవక్త(స.అ) యొక్క నలభైవ ఏట దైవప్రవక్తగా ఎన్నుకోబడ్డారు.
హజ్రత్ అలీ(అ.స) బాల్యం దైవప్రవక్త(స.అ) ఇంట్లో  
మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం, ఆత్మ శిక్షణకు అత్యుత్తమకాలం అయిన మొదటి దశ, ఆ కాలంలో అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) ఇంట్లో వారి శిక్షణలో పెరిగారు. ఇస్లామీయ చరిత్రకారులు ఇలా రచించారు: ఒక సంవత్సరం మక్కాలో ఘోరమైన కరువు వచ్చింది. ఆ సమయంలో దైవప్రవక్త(స.అ) పినతండ్రి అయిన అబూతాలిబ్ యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దైవప్రవక్త ముహమ్మద్(స.అ) తన మరో పినతండ్రి అయిన “అబ్బాస్” ఇతను బనీహాషింకు చెందిన ధనవంతులలో ఒకరు, అతనితో మాలో ప్రతీ ఒక్కరూ అబూతాలిబ్ కుమారుల నుంచి ఒక్కొక్కరిని మన ఇళ్లకు తీసుకొని వెళ్దాం దాంతో అబూతాలిబ్ పై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది, అబ్బాస్ దైవప్రవక్త(స.అ) మాటను సమ్మతించారు. వారిద్దరూ అబూతాలిబ్ వద్దకు వచ్చి తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. అబూతాలిబ్ వారి సలహాను అంగీరించారు. అలా అబ్బాస్ “జాఫర్”ను మరియు హజ్రత్ ముహమ్మద్(స.అ) “అలీ”ను తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళారు. దైవప్రవక్త(అ.స) అలీ(అ.స) చేతిని పట్టుకొని ఇలా అన్నారు: “అల్లాహ్ నాకోసం ఎన్నుకున్న వారినే నేనూ ఎన్నుకున్నాను” హజ్రత్ ముహమ్మద్(స.అ) బాల్యంలో వారి తాతయ్యగారు అబ్దుల్ ముతల్లిబ్ మరణించిన తరువాత వారి పినతండ్రి అయిన అబూతాలిబ్ ఇంట్లో, అబూతాలిబ్ ఆధ్వర్యంలో పెరిగారు, అందుకేవారి కుమారులలో ఒకరి బాధ్యత తీసుకొని వారు మరియు వారి భార్య ఫాతెమా బింతె అసద్ యొక్క శ్రమను కొంచెమైనా తీర్చవచ్చు అని అనుకున్నారు.
హజ్రత్ అలీ(అ.స) తన ఖిలాఫత్ కాలంలో ఒక ఉపన్యాసంలో[1] వారి బాల్యం మరియు శిక్షణ దైవప్రవక్త(స.అ) ఆద్వర్యంలో జరిగింది అని వివరించారు.

అలీ(అ.స) గారె హిరాలో
హజ్రత్ ముహమ్మద్(స.అ) దైవప్రవక్తగా ఎన్నుకోబడక ముందు సంవత్సరంలో ఒక నెల “గారె హిరా”[2] (హిరా గుహ)లో ఆరాధన చేసేవారు. ఆ నెల పూర్తయిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా “మస్జిదుల్ హరామ్”కు వెళ్లి అక్కడ 7 సార్లు లేదా అల్లాహ్ కోరినవన్ని సార్లు కాబా ప్రదక్షణలు చేసి ఆ తరువాత ఇంటికి తిరిగి వెళ్లేవారు.[3]
సాక్ష్యాలనుసారం చూసుకున్నట్లైతే దైవప్రవక్త(స.అ)కు అలీ(అ.స) పట్ల ఉన్న బాధ్యత తీవ్రత వల్ల, వారిని కూడా హిరా గుహకు తనతో పాటు తీసుకుని వెళ్లేవారు తెలుస్తుంది. దైవవాణి తీసుకొచ్చే దైవదూత మొదటిసారి ఆ గుహలో వచ్చి హజ్రత్ ముహమ్మద్(స.అ)ను ప్రవక్తగా ఎన్నుకున్నప్పుడు, అలీ(అ.స) దైవప్రవక్త(స.అ) ప్రక్కనే ఉన్నారు.

హజ్రత్ అలీ(అ.స) ఒక ఉపన్యాసంలో ఇలా ప్రసంగించారు:
“దైవప్రవక్త ప్రతీ సంవత్సరం హిరా కొండ పై ఆరాధన కోసం వెళ్లేవారు. నేను తప్ప వారిని ఎవరూ చూడలేకపోయేవారు... వారి పై దైవవాణి అవతరించబడినప్పుడు, షైతాన్ రోధన వినబడింది; నేను దైవప్రవక్తతో ఇలా అన్నాను: ఈ రోధన ఏమిటి?  వారు: ఇది షైతాన్ రోధన, ఈ రోధనకు కారణం భూమిపై వాడి పట్ల విధేయత విషయంలో నిరాశకు గురి అయ్యాడు. నేను విన్నది నువ్వూ వింటావు, నేను చూసేవి నువ్వూ చూస్తావు, నువ్వు ప్రవక్త కావు అంతే, నువ్వు నా వజీర్ మరియు నువ్వు సజ్జనత్వంపై ఉన్నావు”[4]

ఇబ్నె అబిల్ హదీద్ మోతజిలీ, షర్హె నెహ్జుల్ బలాగహ్ లో ఇలా రచించెను:
“కుతుబె సహా[5] లో ఉల్లేఖించబడి ఉంది; జిబ్రయీల్ మొదటి సారి దైవప్రవక్త పై అవతరించి వారిని దౌత్యం ద్వార గౌరవించినప్పుడు, అలీ దైవప్రవక్త ప్రక్కనే ఉన్నారు”[6]

రిఫరెన్స్
1. నెహ్జుల్ బలాగహ్, సూబ్హీ సాలెహ్, ఖుత్బా192.
2. మక్కా పట్టణంలో ఉత్తరం దిక్కున హిరా కొండ ఉంది. ఆ కొండ శిఖరంలో వున్న ఒక గుహ.
3. ఇబ్నెహిషామ్, అబ్దుల్ మలిక్, అల్ సీరతున్నబవియహ్, తహ్ఖీఖ్ ముస్తఫా అస్సఖా, భాగం1, పేజీ 252.
4. నెహ్జుల్ బలాగహ్, సూబ్హీ సాలెహ్, ఖుత్బా192.
5. అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ఆరు సహీ గ్రంథాలు; సహీ బుఖారీ, సహీ ముస్లిం, సహీ తిర్మిజీ, సుననె ఇబ్నె మాజా, సుననె అబీదావూద్, సుననె నిసాయీ.
6. ఇబ్నె అబిల్ హదీద్, నెహ్జుల్ బలాగహ్, తహ్ఖీఖ్: మొహమ్మద్ అబుల్ ఫజ్ల్ ఇబ్రాహీమ్, భాగం13, పేజీ208.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13